బ్లాక్ బస్టర్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లను పలు ఇండియన్ భాషల్లో అందిస్తూ నెంబర్ వన్‌గా రాణిస్తోన్న ఓటీటీ మాధ్యమం ZEE5. బహు భాషా ఓటీటీ మాధ్యమంగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న జీ 5 లైబ్రరీలోకి మరో విలక్షణమైన చిత్రం చేరుతుంది. అదే ‘కడక్ సింగ్’. పంకజ్ త్రిపాఠి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను గోవాలో జరిగిన 54వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఐఎఫ్ఎఫ్ఐ) ప్రారంభ వేడుకలో మేకర్స్ విడుదల చేశారు. పలువురు సినీ, రాజకీయ సెలబ్రిటీలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు హాజరైన ప్రతిష్టాత్మకైన ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ ట్రైలర్ విడుదలవటం విశేషం, ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఐఎఫ్ఎఫ్ఐకి సంబంధించిన గాలా ప్రీమియర్స్‌లో ‘కడక్ సింగ్’ ప్రీమియర్ కానుండటం మరో విశేషం. డిసెంబర్ 8న ఈ ప్రీమియర్‌ను జీ5 ప్రదర్శించనుంది. దీనికి చిత్ర యూనిట్‌తో పాటు సినీ అభిమానులు హాజరవుతారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ అనిరుద్ రాయ్ చౌదరి దర్శకత్వం వహించిన ‘కడక్ సింగ్’ చిత్రంలో పంకజ్ త్రిపాఠి, పార్వతి తిరువోతు వంటి జాతీయ అవార్డు విజేతలతో పాటు సంజన సంఘి, బంగ్లాదేశ్ నటి జయా ఎహసాన్, దిలీప్ శంకర్, పరేష్ పాహుజా, వరుణ్ బుద్ధదేవ్ నటించారు. ఓపస్ కమ్యూనికేషన్స్, విజ్ ఫిల్మ్స్, కె.వి.ఎన్.ప్రొడక్షన్ బ్యానర్స్‌పై ఆండ్రే తిమ్మిన్స్, విరాఫ్ సర్కారి, సబ్బాస్ జోసెఫ్, హెచ్ కంటెంట్ స్టూడియో మహేష్ రామనాథన్, కె.వి.ఎన్ ఈ చిత్రాన్నినిర్మించారు. శ్యామ్ సుందర్, ఇంద్రాణి ముఖర్జీ సహ నిర్మాతలుగా వ్యవహరించారు.
ఎ.కె.శ్రీవాస్తవ్ అలియాస్ కడక్ సింగ్ ఫైనాన్సియల్ క్రైమ్ డిపార్ట్‌మెంట్‌లో జాయింట్ డైరెక్టర్‌గా వర్క్ చేస్తుంటారు. తను రెట్రో గ్రేడ్ అమ్నీషియాతో బాధపడుతుంటారు. తను హాస్పిటల్‌లో జాయిన్ అయిన దగ్గర నుంచి సినిమా మొదలవుతుంది. ఆయన గతానికి సంబంధించిన కొన్ని విషయాలు ఆయన వర్తమాన జీవితంపై ప్రభావాన్ని చూపుతుంటాయి. సగం సగం గుర్తుకు వచ్చిన జ్ఞాపకాలతో ఇబ్బంది పడుతున్న కడక్ సింగ్ ఓ రోజు తనకేమైందో తెలుసుకోవాలని అనుకుంటాడు. ఇదే క్రమంలో తన కుటుంబం విడిపోకుండా కాపాడుకుంటూ వస్తుంటాడు. ఓ వైపు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు కుటుంబానికి సంబంధించిన భావోద్వేగాలను కొత్త కోణంలో చూపించే కథాంశంతో చూపించేలా ‘కడక్ సింగ్’ సినిమా ఉంటుంది.
ఈ సందర్భంగా పంకజ్ త్రిపాఠి మాట్లాడుతూ ‘‘నటుడిగా ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించాను. కానీ కడక్ సింగ్ తరహా పాత్రలో ఎప్పుడూ నటించలేదు. ఇలాంటి క్యారెక్టర్ చేయటం యాక్టర్‌లో నాలో ఓ కొత్త ఉత్సాహన్నిస్తుంది. అలాగే టోని డా, పార్వతి, జయ, సంజన సహా పలువురు ఔత్సాహిక నటీనటులతో కలిసి నటించే అవకాశం కలిగింది. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో మా ‘కడక్ సింగ్’ ట్రైలర్‌ను విడుదల చేయటం సంతోషంగా ఉంది. ట్రైలర్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. అదే ఫిల్మ్ ఫెస్టివల్‌లో సినిమాను కూడా డిసెంబర్ 8న ప్రదర్శించబోతుండటం ఆనందంగా ఉంది’’ అన్నారు.
పార్వతి తిరువోతు మాట్లాడుతూ ‘‘‘కడక్ సింగ్’లో నటించటం అరుదుగా దొరికే అవకాశం. టోని డా సృష్టించిన పాత్ర ఇది. అందులోనూ పంకజ్ వంటి యాక్టర్‌తో కలిసి నటించటం మెమొరబుల్ ఎక్స్‌పీరియెన్స్. అలాగే సంజన సంఘి, పరేష్ పాహుజ, జయా ఎహసాన్ ఇలా అందరూ అద్భుతమైన నటనను ప్రదర్శించారు. మనం సినిమాల రూపంలో చూపించే కథల్లో విషయ సంగ్రహణతో పాటు మానవత్వాన్ని మేల్కొపేలా ఉండాలి. అలాంటి ఓ అనుభూతిని టోనీ డా అండ్ టీమ్ ‘కడక్ సింగ్’లో మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ అన్నారు.
సంజన సంఘి మాట్లాడుతూ ‘‘‘కడక్ సింగ్’ కథ విన్నప్పుడు కొత్తగా అనిపించింది. డైెరెక్టర్ అనిరుధ్ అండ్ టీమ్ దాన్ని ఇంకా బాగా తెరకెక్కించారు. ఇందులో పంకజ్ త్రిపాఠి నా తండ్రి పాత్రను పోషించారు. ఆయన నటనలో డాక్టరేట్ చేశారు. గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేయటం హ్యాపీగా ఉంది. త్వరలో ఇక్కడే ఈ చిత్రాన్ని ప్రీమియర్ చేయబోతున్నాం. దానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం’’ అన్నారు.
జయ మాట్లాడుతూ ‘‘‘కడక్ సింగ్’లో వైవిధ్యమైన పాత్రలో కనిపిస్తాను. ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్. చాలా మంచి టీమ్‌తో కలిసి పని చేశాను. పంకజ్ వంటి గొప్ప యాక్టర్‌తో నటించటం మరచిపోలేని ఎక్స్‌పీరియెన్స్. అనిరుధ్ రాయ్‌గారు సినిమాను చక్కగా తెరకెక్కించారు. ఓ డిఫరెంట్ లాంగ్వేజ్ మూవీలో నటించటం, కొత్త సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టటం అనేది నటిగా నాకు ఓ కొత్త ఉత్సాహాన్నిచ్చింది. నేను నటించిన సినిమాల్లో దీనికి ఎప్పుడూ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. శాంతను మైత్ర సంగీతం మనసుకు హత్తుకుంటుంది. అవిక్ ముఖోపాధ్యాయ్ విజువల్స్ ఆకట్టుకుంటాయి. ఈ సినిమా కోసం నేను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అన్నారు.
‘కడక్ సింగ్’ డిసెంబర్ 8న ZEE 5 లో ప్రీమియర్ అవుతుంది.
ZEE 5 గురించి…
సరికొత్త ఎంటర్‌టైన్‌మెంట్ కావాలనుకునే లక్షలాది మంది ప్రేక్షకుల కోసం విభిన్నమైన భాషల్లో ఎప్పటికప్పుడు కొత్త కథనాలున్న బ్లాక్ బస్టర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ZEE 5 అందరినీ అలరిస్తుంది. ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఓ గ్లోబల్ కంటెంట్ పవర్ హౌస్‌లాంటి జీ లిమిటెడ్‌లో ZEE 5 ఎంటర్‌టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్ ఓ భాగం. 12 భాషల్లో (ఇంగ్లీష్, హిందీ, బెంగాలి, మళయాళం, తమిళం, తెలుగు, కన్నడ, మరాఠి, ఒరియా, భోజ్‌పురి, గుజరాతి, పంజాబి) ..3500 చిత్రాలు, 1750 టీవీ షోలు, 700 ఒరిజినల్స్, 5 లక్షల గంటల ఆన్ డిమాండ్ కంటెంట్ ఉన్న అన్‌లిమిటెడ్ కంటెంట్ జీ 5 సొంతం. ఈ కంటెంట్‌లో బెస్ట్ ఒరిజినల్స్, ఇంటర్నేషనల్, నేషనల్ లెవల్ మూవీస్, టీవీ షోస్, సంగీతం, పిల్లలకు సంబంధించిన షోస్, ఎడ్ టెక్, సినీప్లేస్, వార్తలు, లైవ్ టివి, మరియు హెల్త్ అండ్ లైఫ్ స్టైల్ షోస్ ఉంటాయి. గ్లోబల్ టెక్ డిస్రప్టర్స్‌తో తన భాగస్వామ్యాల నుండి వచ్చిన బలమైన డీప్-టెక్ స్టాక్, ZEE5 బహుళ పరికరాలు, ఎకోసిస్టమ్స్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్స్ వెంబడి 12 నావిగేషనల్ భాషలలో అపరిమిత, హైపర్-వ్యక్తిగతీకరించబడిన కంటెంట్ వీక్షణ అనుభవాన్ని అందించుటకు దోహదపడుతుంది.
వీటిపై ZEE5 ను అనుసరించండి:
ఫేస్బుక్ – https://www.facebook.com/ZEE5
ట్విట్టర్ – https://twitter.com/ZEE5India
ఇన్స్టాగ్రాం – https://www.instagram.com/zee5/