బేబి చిత్రంతో యువ ప్రేక్షకులను అలరించిన కథానాయకుడు విరాజ్ అశ్విన్. ఆ చిత్రంతో లవర్‌బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న ఈ యువ కథానాయకుడు హీరోగా నటించిన తాజా చిత్రం జోరుగా హుషారుగా. పూజిత పొన్నాడ కథానాయిక. అనుప్రసాద్ దర్శకుడు. నిరీష్ తిరువిధుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో విరాజ్ అశ్విన్‌తో జరిపిన ఇంటర్వూ ఇది.
బేబి తరువాత వస్తున్న చిత్రం కావడంతో ఏమైనా ఒత్తిడికి లోనవుతున్నారా?
బేబి చిత్రం హిట్ అవుతుందని అనుకున్నాం. కానీ ప్రేక్షకులు ఇంత పెద్ద బ్లాక్‌బస్టర్ ఇస్తారని అనుకోలేదు. బేబి తరువాత చాలా ఆఫర్లు వస్తున్నాయి. కానీ నేను బాధ్యతగా, చాలా సెలెక్టివ్‌గా వెళుతున్నాను. ఒక హిట్ సినిమా తరువాత వస్తున్న సినిమాకు ఎంత పెద్ద హెల్ప్ అవుతుందనడానికి జోరుగా హుషారుగా మంచి ఉదాహరణ. బేబి తరువాత వస్తున్న ఈ సినిమాపై అందరిలోనూ మంచి పాజిటివ్ వైబ్స్ వున్నాయి. నాకైతే వ్యక్తిగతంగా కాస్త ప్రెజర్‌గా వున్న సినిమా తప్పకుండా సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందన్న నమ్మకం వుంది.
బేబిలో విరాజ్ పాత్రకు ఈ చిత్రంలో పాత్రకు వున్నతేడా ఏమిటి?
ఆ చిత్రంలో ధనిక యువకుడిగా కనిపించాను. ఈ చిత్రంలో ఓ మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపిస్తాను. చేనేత కుటుంబానికి చెందిన యువకుడిగా నాలో చాలా ఎమోషన్స్ వుంటాయి. ఎన్నికష్టాలున్నా మనసులో దాచుకుని బయటికి సంతోషంగా కనిపించే యువకుడిగా నా పాత్ర అందరిని ఎంటర్‌టైన్ చేసే విధంగా వుంటుంది. పర్సనల్‌గా నాకు నా పాత్ర ఎంతో కనెక్ట్ అయ్యింది. బేబిలో పాత్రకు పూర్తి భిన్నమైన పాత్రలో కనిపిస్తాను.
బేబీ తరువాత కెరీర్ ఎలా వుంది?
ముందుతో పొల్చితే హీరోగా చాలా ఆఫర్లు వస్తున్నాయి. బేబీ తరువాత దాదాపు అన్ని జానర్‌ల కథలు విన్నాను. అయితే బేబి ప్రభావంతో ఎక్కువగా లవర్‌బాయ్ పాత్రలే వస్తున్నాయి. అయితే నేను మాత్రం కథ, నా పాత్ర నచ్చితే సినిమా ఒప్పుకోవాలని నిర్ణయించుకున్నాను.
జోరుగా హుషారుగా చిత్రం ఎలా వుండబోతుంది?
ఈ చిత్రంలో ముఖ్యంగా ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ అందర్ని కట్టిపడేస్తుంది. ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ తన కొడుకును సక్సెస్‌ఫుల్ చేయడానికి ఎలాంటి త్యాగాలు చేశాడు? ఫ్యామిలీ కోసం కొడుకు ఏం చేశాడు? అనేది ఎంతో ఎమోషన్‌గా వుంటుంది.
హాయ్ నాన్న, యానిమల్, తాజాగా జోరుగా హుషారుగా, రాబోయే సైందవ్ సినిమా అన్ని ఫాదర్ ఎమోషన్ సినిమాలే అన్ని ఈ నెలలో విడుదల కావడం ఎలా అనిపిస్తుంది?
ఇది చాలా కాకతాళీయంగా, సర్‌ప్రైజింగ్ వుంది. మన లైఫ్‌లో బిగ్గెస్ట్ ఎమోషన్ ఫాదర్ ఎమోషన్. నిజంగా చాలా ఆనందంగా వుంది. తప్పకుండా మా సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం వుంది.
హాయ్ నాన్న మీరులో యాక్ట్ చేయడం, అందులో నాని విరాజ్‌గా కనిపించడం పట్ల మీ స్పందన?
ఆ చిత్ర దర్శకత్వం టీమ్ అంతా నా ఫ్రెండ్స్ కావడంతో ఆ సినిమాలో నటించాను. ఆ చిత్రంలో నాని విరాజ్ పాత్రలో కనిపించడం నిజంగా కో ఇన్‌సిండెంట్ అంతే. ఆ సినిమా షూటింగ్ సమయంలో విరాజ్ అంటే నేను పలకడం, హాయ్ నాన్న ప్రీరిలీజ్ వేడుకలో విరాజ్ అనగానే అందరూ నేను అనుకోవడం, ఇలా చాలా ఫన్నీగా, సంతోషంగా అనిపించింది.
హీరోగా నే కంటిన్యూ చేస్తారా?
ప్రస్తుతానికి హీరోగానే కంటిన్యూ చేస్తాను. నచ్చిన పాత్రలు, పవర్‌ఫుల్ పాత్ర అయితే ఇతర హీరోల సినిమాల్లో కూడా కనిపిస్తాను.
ఫైనల్‌గా జోరుగా హుషారుగా ఎలాంటి సినిమా?
ఈ చిత్రంలో ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్, లవ్, ఇలా అన్ని వుంటాయి. ఇదొక లైట్ హార్టెడ్ సినిమా. అందరూ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం వుంది.