ఓనం సందర్భంగా సెప్టెంబర్ 13న జీ5లో స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోన్న జీతూ జోసెఫ్ ‘నూనక్కళి’

మలయాళంలో జీతూ జోసెఫ్ సినిమాలకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవలి కాలంలో బసిల్ జోసెఫ్ సినిమాలు కూడా ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి. జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన, బసిల్ జోసెఫ్ హీరోగా నటించిన ‘నూనక్కళి’ సినిమా థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో రాబోతోంది. సెప్టెంబర్ 13న ‘నూనక్కళి’ జీ5లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.

ఈ నేపథ్యంలో, దర్శకుడు జీతూ జోసెఫ్ మాట్లాడుతూ, ‘‘నవ్వుల చట్రంలో జీవితం ఎలాంటి మలుపులు తీసుకుంటుందనే విషయం నూనక్కళి ద్వారా అందంగా చూపించాం. కుటుంబ సభ్యులను ఆకట్టుకోవడమే మా ప్రధాన ఉద్దేశ్యం. బసిల్ జోసెఫ్, గ్రేస్ ఆంటోనీ తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. ఈ సినిమా ఓనమ్ పండుగకు ప్రేక్షకులను వినోదం పరచడానికి సిద్ధంగా ఉంది’’ అని తెలిపారు.

హీరో బసిల్ జోసెఫ్ మాట్లాడుతూ, ‘‘ప్రతిరోజూ మలయాళీ యువతను ప్రతిబింబించే పాత్రల్లో నటించడం నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో కూడా అటువంటి పాత్రలో నేను కనిపిస్తాను. థియేటర్‌లో అందుకున్న విజయం తర్వాత, ఇప్పుడు జీ5లో మా సినిమా ప్రీమియర్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని వ్యాఖ్యానించారు.

ZEE5 ప్లాట్‌ఫార్మ్ గురించి చెప్పాలంటే, ఇది భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌గా రాణిస్తోంది. 12 భాషల్లో అనేక సినిమాలు, టీవీ షోలు, ఒరిజినల్స్, లైవ్ టీవీ వంటి విభాగాలను అందిస్తున్న ఈ ప్లాట్‌ఫార్మ్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.