Hit 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?

అడివి శేష్ హీరోగా నటించిన మేజర్ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఆ చిత్రం తర్వాత ఆయన చేస్తున్న ‘హిట్ 2’ సినిమా తాజాగా రూపొందింది. నాని తన సొంత బ్యానర్లో నిర్మించిన సినిమా ఇది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరగనుంది.

ఆ కేసు విచారణను చేపట్టిన పోలీస్ అధికారిగా అడివి శేష్ ఈ సినిమాలో కనిపించనున్నాడు. గతంలో చేసిన హిట్ సినిమా కి ఇది సీక్వెల్ కాగా ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమా కి మంచి క్రేజ్ ఉంది. ఆ విధంగా ఈ సినిమాను  డిసెంబర్ 2వ తేదీన  విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ మరింత ఊపందుకున్నాయి. ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటు జరగనుంది. అందుకు హైదరాబాదు .. ఫిల్మ్ నగర్లోని జెఆర్సీ కన్వెన్షన్ వేదిక కానుంది.