మ‌న‌సును హ‌త్తుకునే బంధానికి మ‌చ్చుతున‌క‌ ‘చిన్నా’ ట్రైల‌ర్ విడుద‌ల

భావోద్వేగ‌పూరిత‌మైన రోల‌ర్ కోస్ట‌ర్‌గా తెర‌కెక్కింది `చిన్నా` సినిమా. `చిన్నా` ట్రైల‌ర్‌కి అత్య‌ద్భుత‌మైన స్పంద‌న వ‌స్తోంది. చూసిన ప్ర‌తి ఒక్క‌రిలోనూ స‌రికొత్త ఆలోచ‌న‌ల‌ను రేకెత్తిస్తున్న సినిమా `చిన్నా`. ఎటాకి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మిస్తోంది. ఏషియ‌న్ సినిమాస్ ద్వారా తెలుగులో విడుద‌ల‌వుతోంది ఈ చిత్రం.

బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి సిద్ధార్థ్ మునుపెన్న‌డూ చేయ‌ని పాత్ర‌లో క‌నిపిస్తున్నారు. మేన‌మామ‌కి, మేన‌కోడ‌లికి మ‌ధ్య ఉన్న అంద‌మైన అనుబంధాన్ని తెర‌మీద అత్య‌ద్భుతంగా చూపించిన సినిమా `చిన్నా`. `చిన్నా` లో సిద్ధార్థ్ పెర్ఫార్మెన్స్ ని చూసిన వారంద‌రూ ఆయ‌న కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా ప్ర‌శంసిస్తున్నారు.

సిద్ధార్థ్‌ని ఇదివ‌ర‌కు ప‌లు సినిమాల్లో చూశాం. తెలుగు డైలాగులు త‌న‌దైన శైలిలో ఆయ‌న చెప్పే తీరుకు ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. `చిన్నా` లోనూ ఆయ‌న మార్క్ క‌నిపిస్తుంది. సినిమాల ప‌ట్ల ఆయ‌న‌కున్న ప్రేమ‌, అంకిత‌భావం, న‌మ్మ‌కం వ్య‌క్త‌మ‌వుతుంది.

`చిన్నా` చిత్రానికి ఎస్‌.యు.అరుణ్‌కుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. త‌మిళంలో `ప‌న్న‌యారుం ప‌ద్మినియుం`, `సేతుప‌తి` సినిమాల‌తో డైర‌క్ట‌ర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు అరుణ్‌కుమార్‌.

సిల్వ‌ర్ స్క్రీన్ మీద ఫ్రెష్ సినిమాటిక్ లాంగ్వేజ్‌ని ప‌రిచ‌యం చేస్తుంది `చిన్నా` మూవీ. అత్య‌ద్భుత‌మైన డైలాగులు, అర్థ‌వంత‌మైన విష‌యాల‌తో, సున్నిత‌మైన‌, కీల‌క‌మైన సందేశంతో అందంగా సాగుతుంది `చిన్నా` చిత్రం.

మ‌న‌సును హ‌త్తుకునే సినిమా అని ట్రైల‌ర్‌తోనే అర్థ‌మ‌వుతుంది. అక్టోబ‌ర్ 6న విడుద‌ల కానుంది `చిన్నా` సినిమా. ట్రైల‌ర్ చూసిన ప్ర‌తి ఒక్క‌రికీ సినిమా మీద ప్ర‌త్యేక‌మైన ఆస‌క్తి క్రియేట్ అవుతుంది.

నటీనటులు:

సిద్ధార్థ్, నిమిషా సజయన్

సాంకేతిక వర్గం:

బ్యానర్: ఇటాకి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి

సమర్పణ: సోనాలి నారంగ్

దర్శకత్వం: ఎస్.యు.అరుణ్ కుమార్

నిర్మాత: సిద్ధార్థ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హరి ప్రసాద్

మ్యూజిక్: సంతోష్ నారాయణన్

సినిమాటోగ్రఫీ: బాలాజీ సుబ్రమణ్యం

ఎడిటర్: సురేష్ ఎ.ప్రసాద్

పి.ఆర్.ఓ: వంశీ కాకా