ఏపీ మరియు తెలంగాణలలో హౌస్ ఫుల్ థియేటర్లతో విజయ్ దేవరకొండ యొక్క “ఫ్యామిలీ స్టార్”కి పండుగ అడ్వాంటేజ్

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

స్టార్ హీరో విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ సినిమా సకుటుంబ ప్రేక్షకుల ఆదరణతో సక్సెస్ ఫుల్ గా థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది. ఇవాళ ఉగాది పండుగ సందర్భంగా హాలీడే అడ్వాంటేజ్ ఈ సినిమాకు కలిసొచ్చింది. గత నాలుగు రోజుల కంటే ఎక్కువగా ఇవాళ ఏపీ, తెలంగాణలోని థియేటర్స్, మల్టీప్లెక్సులు హౌస్ ఫుల్ అవుతున్నాయి. సెలవు రోజు కాబట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ పెద్ద సంఖ్యలో ఫ్యామిలీ స్టార్ సినిమాను చూసేందుకు థియేటర్స్ కు వెళ్తున్నారు. ఎల్లుండి రంజాన్ హాలీడే ఉండటం కూడా ఈ వీక్ ఫ్యామిలీ స్టార్ కు థియేట్రికల్ కలెక్షన్స్ కు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

ఈ నెల 5న తేదీన ఫ్యామిలీ స్టార్ సినిమా వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ముందుకొచ్చింది. తెలుగు, తమిళంలో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఫస్ట్ డే నుంచే కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమాకు రెస్పాన్స్ వచ్చింది. ఫ్యామిలీ ఆడియెన్స్ ఆదరణతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాను పరశురామ్ డైరెక్షన్ లో శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఈ సమ్మర్ కు ఫ్యామిలీతో కలిసి చూసేందుకు ప్రేక్షకులకు బెస్ట్ ఆప్షన్ గా మారుతోంది ఫ్యామిలీస్టార్.