Cine Bullet Telugu https://telugu.cinebullet.com Telugu News of Cine Bullet Fri, 20 Dec 2024 13:26:26 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 https://telugu.cinebullet.com/wp-content/uploads/2022/10/cropped-cine-bullet-32x32.jpg Cine Bullet Telugu https://telugu.cinebullet.com 32 32 విడుదల 2 మూవీ రివ్యూ అండ్ రేటింగ్ https://telugu.cinebullet.com/vidudhala-2-movie-review-and-rating/ https://telugu.cinebullet.com/vidudhala-2-movie-review-and-rating/#respond Fri, 20 Dec 2024 13:26:09 +0000 https://telugu.cinebullet.com/?p=5333 నటీనటులు: విజయ్ సేతుపతి, సూరి, మంజు వారియర్, గౌతమ్ మీనన్, అనురాగ్ కశ్యప్

దర్శకుడు: వెట్రిమారన్

నిర్మాతలు: ఎల్రెడ్ కుమార్, రామారావు చింతపల్లి

సంగీతం: ఇళయరాజా

సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్ రాజ్

ఎడిటింగ్: ఆర్. రమర్

విడుదల తేదీ: 20 డిసెంబర్ 2024

సీక్వెల్ చిత్రాలకు ఎప్పుడూ ప్రేక్షకులలో ప్రత్యేక ఆసక్తి ఉంటుందని ‘విడుదల-2’ మళ్లీ రుజువు చేసింది. ‘విడుదల-1′ విజయం తర్వాత, వెట్రిమారన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించగా విడుదలకు ముందే మంచి అంచనాలు పెంచుకున్న ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను ఎంతవరకు అందుకుందో ఈ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:’ప్రజాదళం’ నాయకుడు పెరుమాళ్‌ (విజయ్‌ సేతుపతి)ని పోలీసులు అరెస్టు చేయడంతో ఈ కథ మొదలవుతుంది. ఈ సినిమా పార్ట్‌-1 భాగాన్ని కూడా ఇక్కడే ఆపేశారు… మళ్లీ పెరుమాళ్‌ అరెస్టుతోనే పార్ట్‌-2 కథను మొదలుపెట్టారు. కుగ్రామంలోని పిల్లలకు చదువు చెబుతున్న పెరుమాళ్‌, జమీందారీ వ్యవస్థను.. పెట్టుబడిదారుల అక్రమాలను .. అన్యాయాలను .. ఆగడాలను అడ్డుకునే క్రమంలో నాయకుడిగా మారతాడు.

నటీనటులు: విజయ్ సేతుపతి పెరుమాళ్‌గా తన అసాధారణమైన నటనతో ప్రేక్షకుల్ని మెప్పించాడు.కొన్ని సన్నివేశాల్లో ఆయన నటన ఎంతో గొప్పగా అనిపిస్తుంది. మంజు వారియర్ మహాలక్ష్మిగా తన పాత్రలో జీవం పోశారు. గౌతమ్ మీనన్, కన్నడ కిషోర్, సూరి తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికత: ఉద్యమ నేపథ్యంలోని కథలో ప్రేమకథను చేర్చి దర్శకుడు సవాలును సమర్థంగా నిర్వహించారు. కుల దురహంకారానికి బలైన కరప్పన్‌ అనే యువకుడి జీవితంలో జరిగిన దారుణంతో హింసమార్గాన్ని ఎంచుకుని పెరుమాళ్‌.. రెబల్‌గా మారే ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచింది. ఆ సన్నివేశాన్ని దర్శకుడు చాలాబాగా రాశాడు. నక్సలైట్ అంశాన్ని లోతుగా చూపిస్తూ కథను యథార్థంగా తీర్చిదిద్దారు. ఇళయరాజా సంగీతం, వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ సినిమాను మరింత గొప్పగా ఉంచాయి.

తీర్పు: మొత్తం మీద, ‘విడుదల-2’ తన నటీనటుల ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. అయితే కొన్ని సన్నివేశాలు నెమ్మదిగా సాగడం చిన్న నెగటివ్ పాయింట్.

రేటింగ్: 3/5

]]>
https://telugu.cinebullet.com/vidudhala-2-movie-review-and-rating/feed/ 0
బచ్చలమల్లి మూవీ రివ్యూ అండ్ రేటింగ్!! https://telugu.cinebullet.com/bachchalamalli-movie-review-and-rating/ https://telugu.cinebullet.com/bachchalamalli-movie-review-and-rating/#respond Fri, 20 Dec 2024 12:48:23 +0000 https://telugu.cinebullet.com/?p=5330 కామెడీ హీరోగా అల్లరి నరేష్ అందరికి తెలుసు. అయితే ‘నాంది’ వంటి సినిమాలతో సీరియస్ పాత్రల్లో మెప్పించి కొత్త రూట్ ఎంచుకున్నాడు. ఇప్పుడు ‘బచ్చల మల్లి’లో ఒక గ్రామీణ యువకుడి పాత్రలో విభిన్నంగా కనిపించారు. ఈ సినిమా నరేష్ అభిమానులను మెప్పించిందా లేదా అనేది ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

బచ్చలమల్లి (నరేష్) తండ్రిని ఎంతో గౌరవిస్తాడు, కానీ తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం అతనికి సహించలేకపోతాడు. ఈ కోపం పగగా మారి, మల్లి తన జీవితాన్ని చెడు అలవాట్లతో నాశనం చేసుకుంటాడు. చదువు మానేసి, మద్యం, పొగ తాగడం మొదలుకుని, మూర్ఖత్వంలో లిమిట్స్ దాటిపోతాడు. అతను కావేరి (అమృత అయ్యర్)ను ప్రేమిస్తాడు. తన చెడు అలవాట్లను మారుస్తున్నట్టు అనిపించినప్పటికీ, మళ్లీ మూర్ఖంగా ప్రవర్తించడం మొదలవుతుంది. అతని జీవితంలో ఈ మార్పుకు కారణం ఏమిటి? మల్లి ఎలా తప్పుడు దారిలోకి వెళ్లాడు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కథలో ఉంది.

నటీనటులు:

అల్లరి నరేష్ తన కెరీర్‌లో మరో వైవిధ్యమైన పాత్రలో నటించారు. గ్రామీణ యువకుడి పాత్రలో ఆయన సహజంగా కనిపించారు. కొన్ని హార్డ్ హిట్టింగ్ సన్నివేశాలలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమృత అయ్యర్ కూడా తన పాత్రకు న్యాయం చేశారు. రావు రమేష్, బలగం జయరామ్, అచ్యుత్ కుమార్, ప్రవీణ్, హరితేజ, వైవా హర్ష తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. ప్రవీణ్ కొత్త తరహా పాత్రలో నవ్వులు పూయించారు.

సాంకేతికత:

సుబ్బు మంగాదేవి దర్శకునిగా మంచి కథ తో ప్రయత్నించారు. మల్లి పాత్ర ద్వారా కోపం, మూర్ఖత్వం వల్ల కలిగే నష్టాన్ని సందేశాత్మకంగా చాటారు. స్క్రీన్‌ప్లే కట్టుదిట్టంగా ఉండి ఆసక్తిని కలిగిస్తుంది. పీరియాడిక్ కాన్సెప్ట్ కోసం ఊర్లలో చిత్రీకరించిన దృశ్యాలు అందంగా మెరిసాయి. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత జోష్ ఇచ్చింది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గానే ఉన్నాయి.

బలాబలాలు:

‘బచ్చల మల్లి’లో అల్లరి నరేష్ నటన ప్రభావవంతంగా నిలిచింది. కథలో కొన్ని హార్డ్ హిట్టింగ్ ఎపిసోడ్లు ఉన్నాయి. స్క్రీన్‌ప్లేలో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ప్రీ-క్లైమాక్స్ సీన్ల నుండి పుంజుకుని, మంచి ముగింపును అందించింది చిత్రం.

రేటింగ్: 3/5

]]>
https://telugu.cinebullet.com/bachchalamalli-movie-review-and-rating/feed/ 0
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” టైటిల్ ఖరారు, ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న టైటిల్ పోస్టర్ https://telugu.cinebullet.com/young-talented-hero-kiran-abbavarams-new-films-title-dil-ruba-has-been-finalized-the-title-poster-is-creating-interest/ https://telugu.cinebullet.com/young-talented-hero-kiran-abbavarams-new-films-title-dil-ruba-has-been-finalized-the-title-poster-is-creating-interest/#respond Fri, 20 Dec 2024 03:05:43 +0000 https://telugu.cinebullet.com/?p=5327 యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త చిత్రానికి “దిల్ రూబా” అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ సినిమాలో రుక్సర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తోంది. “దిల్ రూబా” చిత్రాన్ని శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,సారెగమ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు.

“దిల్ రూబా” సినిమా టైటిల్ అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ఈ పోస్టర్ లో కిరణ్ అబ్బవరం యూనిక్ స్టైల్, యాటిట్యూడ్ తో కనిపిస్తున్నారు. ‘హిస్ లవ్, హిస్ యాంగర్..’ అనే కొటేషన్ కిరణ్ అబ్బవరం క్యారెక్టర్ ను రిఫ్లెక్ట్ చేస్తోంది. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా “దిల్ రూబా” సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకోనుంది. ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తుండగా, డానియేల్ విశ్వాస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రవీణ్ కేఎల్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. “క” సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం చేస్తున్న చిత్రంగా “దిల్ రూబా”పై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ సినిమా ను ఫిబ్రవరి లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు – కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్, తదితరులు

టెక్నికల్ టీమ్

పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్) & దుడ్డి శ్రీను.

ఎడిటర్ – ప్రవీణ్.కేఎల్

సినిమాటోగ్రఫీ – డానియేల్ విశ్వాస్

మ్యూజిక్ – సామ్ సీఎస్

నిర్మాతలు – రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి,సారెగమ.

రచన, దర్శకత్వం – విశ్వ కరుణ్

]]>
https://telugu.cinebullet.com/young-talented-hero-kiran-abbavarams-new-films-title-dil-ruba-has-been-finalized-the-title-poster-is-creating-interest/feed/ 0
సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న డిఫరెంట్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ “కిల్లర్” https://telugu.cinebullet.com/the-second-schedule-of-shooting-of-the-different-sci-fi-action-thriller-movie-killer-has-been-completed/ https://telugu.cinebullet.com/the-second-schedule-of-shooting-of-the-different-sci-fi-action-thriller-movie-killer-has-been-completed/#respond Thu, 19 Dec 2024 07:08:22 +0000 https://telugu.cinebullet.com/?p=5324 “శుక్ర”, “మాటరాని మౌనమిది”, “ఏ మాస్టర్ పీస్” వంటి డిఫరెంట్ సినిమాలతో మూవీ లవర్స్ దృష్టిని ఆకట్టుకుంటున్న దర్శకుడు పూర్వాజ్ “కిల్లర్” అనే సెన్సేషనల్ సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన హీరోగా పాత్రలో నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ గా నటిస్తుండగా..మరో ఇద్దరు హీరోలుగా విశాల్ రాజ్, గౌతమ్ యాక్ట్ చేస్తున్నారు. ఏయు అండ్ఐ మరియు మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ సినిమా బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి ఈ కొలాబ్రేషన్ లో నిర్మాణమవుతున్న రెండవ చిత్రమిది.

“కిల్లర్” పార్ట్ 1 డ్రీమ్ గర్ల్ మూవీ ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ పూర్తి చేశారు. రామెజీ ఫిలిం సిటీ, వికారాబాద్ ఫారెస్ట్ ఏరియా, హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ చిత్రీకరణ జరిపారు. సెకండ్ షెడ్యూల్ లో హీరో పూర్వాజ్, హీరోయిన్ జ్యోతి పూర్వజ్ మరో ఇద్దరు హీరోలు విశాల్ రాజ్, గౌతమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా

హీరో, దర్శకుడు పూర్వాజ్ మాట్లాడుతూ – “కిల్లర్” సినిమా ఔట్ పుట్ మేము అనుకున్నట్లే బాగా వస్తోంది. లవ్, రొమాన్స్, ప్రతీకారం, ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్, థ్రిల్లర్ అంశాలతో మా సినిమాను రూపొందిస్తున్నాం. ఎ మాస్టర్ పీస్ సినిమాతో పాటు మా సంస్థలో వస్తున్న చిత్రంగా “కిల్లర్” మూవీపై ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా సినిమాను చిత్రీకరిస్తున్నాం. త్వరలోనే షూటింగ్ కంప్లీట్ చేసి చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ గా “కిల్లర్” ఒక స్పెషల్ మూవీగా మీకు గుర్తుండిపోతుంది. అన్నారు.

నటీనటులు – జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, విశాల్ రాజ్, గౌతమ్, తదితరులు

టెక్నికల్ టీమ్

సినిమాటోగ్రఫీ – జగదీశ్ బొమ్మిశెట్టి

మ్యూజిక్ – అషీర్ ల్యూక్, సుమన్ జీవరత్నం

వీఎఫ్ఎక్స్, వర్చువల్ ప్రొడక్షన్ – మెర్జ్ ఎక్స్ఆర్

పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

బ్యానర్స్ – థింక్ సినిమా, మెర్జ్ ఎక్స్ఆర్, ఏయు అండ్ ఐ.

నిర్మాతలు – పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి.

రచన దర్శకత్వం – పూర్వాజ్

]]>
https://telugu.cinebullet.com/the-second-schedule-of-shooting-of-the-different-sci-fi-action-thriller-movie-killer-has-been-completed/feed/ 0
తెలంగాణ ప్రభుత్వం అనుమతితో శ్రీతేజ్‌ను పరామర్శించిన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ https://telugu.cinebullet.com/popular-producer-allu-aravind-visited-sree-tej-with-permission-from-the-telangana-government/ https://telugu.cinebullet.com/popular-producer-allu-aravind-visited-sree-tej-with-permission-from-the-telangana-government/#respond Thu, 19 Dec 2024 07:02:18 +0000 https://telugu.cinebullet.com/?p=5321 సంధ్య థియేటర్‌ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్‌ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్‌ యోగా క్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆయన హస్పటల్‌ వైద్యాధికారులతో, శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీతేజ్‌ ఆరోగ్యస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్‌ గారు మాట్లాడుతూ

” అందరికి నమస్కారం.. ఇప్పుడే హస్పటల్‌లో ఉన్న శ్రీతేజ్‌ను ఐసీయూలో చూశాను. డాక్టర్లందరితోనూ మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవరీ అవుతున్నాడు. గత 14 రోజుల్లో.. లాస్ట్‌ 10 డేస్‌ల్లో రికవరీ బాగా కనిపిస్తుంది. బట్‌ కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. అయితే శ్రీతేజ్‌ కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్దంగా ఉన్నాం. దీంతో పాటు ప్రభుత్వం కూడా మేము కూడా శ్రీతేజ్‌ను సంపూర్ణ ఆరోగ్యంగా చూడటానికి రెడీగా ఉన్నాం అని చెప్పడ అభినందనీయం. చాలా మంది అభిమానులు, బందువులు, మిత్రులు అల్లు అర్జున్‌ ఎందుకు హస్పటల్‌కు వెళ్లలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం. తొక్కిసలాట జరిగిన మరుసటి రోజే ఉదయమే అర్జున్‌ హస్పటల్‌కు వెళ్లదామనుకున్నాడు. కానీ హస్పటల్‌ అధికారులు నిన్నే కదా ఈ సంఘటన జరిగింది. మీరు హస్పటల్‌కు వచ్చే కార్యక్రమం వాయిదా వేసుకోమని అన్నారు. కరెక్ట్‌ అనిపించింది. అందుకే రాలేదు. ఇక ఆ రోజే అర్జున్‌పై కేసు వచ్చింది. ఆ కేసులో లీగల్‌ టీమ్‌ హెడ్‌ నిరంజన్‌ రెడ్డి హస్పటల్‌కు వెళ్లకూడదు.. వారిని కలవకూడదు అని ఆయన స్ట్రాంగ్‌గా చెప్పారు. ఆ తరువాత మేము రావడానికి ఎన్నో నిబంధనలు ఉన్నాయి. ఇక బన్నీ ఒక రోజు బాధపడుతూ నేను చూడలేకపోయాను.. మీరైనా వెళ్లండి.. డాడీ అన్నాడు. అందుకే నేను ఇక్కడికి రావడానికి ముందు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్‌ తీసుకున్నాను. ఈ రోజు వచ్చాను. ఈ అనుమతి నాకు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ రేవంత్‌ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే పోలీస్‌ శాఖ వారికి, హస్పటల్‌ యజమాన్యానికి, సీఇవో అభిమన్యు, మెడికల్‌ డైరెక్టర్‌ సంహిత్‌కు అందరికి నా కృతజ్క్షతలు తెలియజేస్తున్నాను’ అన్నారు.

]]>
https://telugu.cinebullet.com/popular-producer-allu-aravind-visited-sree-tej-with-permission-from-the-telangana-government/feed/ 0
“డ్రింకర్ సాయి” సినిమా నుంచి ‘అర్థం చేసుకోవు ఎందుకే..’ లిరికల్ సాంగ్ రిలీజ్ https://telugu.cinebullet.com/ardham-chesukovu-enduke-lyrical-song-from-the-movie-drinker-sai-released/ https://telugu.cinebullet.com/ardham-chesukovu-enduke-lyrical-song-from-the-movie-drinker-sai-released/#respond Wed, 18 Dec 2024 16:52:59 +0000 https://telugu.cinebullet.com/?p=5318 ధర్మ, ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “డ్రింకర్ సాయి”. బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్ అనేది ఈ చిత్ర ట్యాగ్ లైన్. ఈ చిత్రాన్ని ఎవరెస్ట్ సినిమాస్, స్మార్ట్ స్క్రీన్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మిస్తున్నారు. కొన్ని వాస్తవ ఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ నెల 27న ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అ‌వుతోంది. ఈ రోజు “డ్రింకర్ సాయి” సినిమా నుంచి ఫోర్త్ సింగిల్ ‘అర్థం చేసుకోవు ఎందుకే..’ లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు.

‘అర్థం చేసుకోవు ఎందుకే..’ లిరికల్ సాంగ్ ను శ్రీ వసంత్ కంపోజ్ చేయగా, చంద్రబోస్ లిరిక్స్ అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ పాడారు. ఈ పాట ఎలా ఉందో చూస్తే – ‘అర్థం చేసుకోవు ఎందుకే, అర్థం చేసుకోవు ఎందుకే, ఎన్నెన్నో చెబుతున్నా, ఏవేవో చేస్తున్నా, అర్థం చేసుకోవు ఎందుకే, అర్థం చేసుకోవు ఎందుకే… నా చిన్ని లోకం నువ్వేనని, నాకున్న ప్రాణం నీదేనని, నాకన్నా ఎక్కువగా నిన్నే ప్రేమించానని, ప్రేమన్న మాటే నీతో తెలిసొచ్చిందని, అర్థం చేసుకోవు ఎందుకే అర్థం చేసుకోవు ఎందుకే’ అంటూ లవ్ లోని పెయిన్ ను తెలిపేలా సాగుతుందీ పాట.

నటీనటులు – ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్స్ – ఎస్ఎం రసూల్, జోగు బిందు శ్రీ

స్టిల్స్ – రాజు వైజాగ్ (SVA)

వీఎఫ్ఎక్స్ – సుమరామ్ రెడ్డి.ఎన్

ఆర్ట్ – లావణ్య వేములపల్లి

కొరియోగ్రఫీ – భాను, మోయిన్

డీవోపీ – ప్రశాంత్ అంకిరెడ్డి

ఎడిటింగ్ – మార్తాండ్ కె వెంకటేష్

లైన్ ప్రొడ్యూసర్ – లక్ష్మీ మురారి

మ్యూజిక్ – శ్రీ వసంత్

లిరిక్స్ – చంద్రబోస్

పీఆర్ఓ – జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

ప్రొడ్యూసర్స్ – బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్

రచన, దర్శకత్వం – కిరణ్ తిరుమలశెట్టి

]]>
https://telugu.cinebullet.com/ardham-chesukovu-enduke-lyrical-song-from-the-movie-drinker-sai-released/feed/ 0
‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌’ అన్ ప్రిడిక్టబుల్ గా ఉంటుంది. ఆడియన్స్ ఖచ్చితంగా చాలా థ్రిల్ అవుతారు: డైరెక్టర్ రైటర్ మోహన్ https://telugu.cinebullet.com/srikakulam-sherlock-holmes-will-be-unpredictable-audience-will-definitely-be-thrilled-director-writer-mohan/ https://telugu.cinebullet.com/srikakulam-sherlock-holmes-will-be-unpredictable-audience-will-definitely-be-thrilled-director-writer-mohan/#respond Wed, 18 Dec 2024 16:39:14 +0000 https://telugu.cinebullet.com/?p=5315 వెన్నెల కిషోర్ టైటిల్ రోల్ పోషిస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌’. రైటర్ మోహన్ రచన, దర్శకత్వం వహించారు. అనన్య నాగళ్ల, సీయా గౌతమ్ కీలక పాత్రలు పోహిస్తున్న ఈ చిత్రాన్ని లాస్యారెడ్డి సమర్పణలో శ్రీ గణపతి సినిమాస్ బ్యానర్‌పై వెన్నపూస రమణారెడ్డి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ సాంగ్స్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. క, పొలిమేర 2, కమిటీ కుర్రోళ్లు చిత్రాలతో విజయాలు అందుకున్న వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రైటర్ మోహన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ ఎలా స్టార్ట్ అయ్యింది? వెన్నెల కిషోర్ గారిని టైటిల్ రోల్ కి తీసుకోవడానికి కారణం?

-ఇది ఏడుగురికి సంబధించిన కథ. వెన్నెల కిషోర్ గారిది డిటెక్టివ్ రోల్. రైల్ కి ఇంజన్ లాంటి క్యారెక్టర్. మిగతా బోగీలు కూడా ముఖ్యమే. ప్రతి పాత్ర కథలో చాలా కీలకంగా వుంటుంది. ఇందులో డిటెక్టివ్ రోల్ కొంచెం హ్యుమర్ తో వుంటుంది. ఆ పాత్రకు వెన్నెల కిషోర్ గారు పర్ఫెక్ట్ గా ఫిట్ అయ్యారు. ఆయన ఉత్తరాంధ్ర యాసని ఒక ఛాలెంజ్ తీసుకొని కష్టపడి నేర్చుకొని సినిమా చేశారు. సినిమాలో శ్రీకాకుళం యాస పట్ల చాలా కేర్ తీసుకున్నాం. కథలో క్రైమ్ కామెడీ ఎమోషన్ థ్రిల్ లవ్ అన్నీ బ్యాలెన్స్ గా వుంటాయి.

శ్రీకాకుళం బ్యాక్ డ్రాప్ ని తీసుకోవడానికి కారణం ?

-ఇది 1991లో జరిగే కథ. టీజర్ లో చెప్పినట్లు రాజీవ్ గాంధీ గారు వైజాగ్ పర్యటన ముగించుకొని అదే రోజు శ్రీపెరంబుదూర్ వెళ్లి అక్కడ చనిపోయారు. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు చిన్న సంఘటనలని ఎవరూ పట్టించుకోరు. అదే రోజు ఇంకొన్ని సంఘటనలు జరిగాయి. వీటి మధ్య వున్న సంబంధం ఏమిటనేది షెర్లాక్ హోమ్స్‌ అనే ఫిక్షనల్ క్యారెక్టర్ తో చాలా ఇంట్రస్టింగ్ స్క్రీన్ ప్లేతో చేయడం జరిగింది. ఈ కథని ఎవరూ ప్రెడిక్ట్ చేయలేరు. చాలా సస్పెన్స్, థ్రిల్ వుంటుంది.

చంటబ్బాయ్ తాలూక అని ట్యాగ్ పెటడానికి కారణం?

-తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే చిరంజీవి గారి చంటబ్బాయ్ గుర్తుకు వస్తుంది. షెర్లాక్ హోమ్స్‌ అనేది హాలీవుడ్ ఫిక్షనల్ క్యారెక్టర్. అది కొందరికి పరిచయం లేకపోవచ్చు. అందుకే అందరికీ కనెక్ట్ అయ్యేవిధంగా వంశీ నందిపాటి గారి సూచన మేరకు ఆ ట్యాగ్ ని పెట్టడం జరిగింది. అందులోనూ ‘తాలూకా’ అనేది ఇప్పుడు ట్రెండింగ్.

-వంశీ నందిపాటి గారికి ఈ సినిమా చాలా నచ్చింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో చాలా థ్రిల్ అయ్యారు. ఆయన సినిమా రిలీజ్ చేయడం చాలా అనందంగా వుంది. ఆయన ఇచ్చిన సూచనలు, సలహాలతో సినిమా నెక్స్ట్ లెవల్ కి వెళ్ళింది. ఆర్ఆర్, సిజీని చాలా ఇంపాక్ట్ ఫుల్ గా చేయించారు. మా నిర్మాత రమణారెడ్డి గారికి, వంశీ గారికి మంచి సింక్ కుదిరింది.

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ టైటిల్ జస్టిఫికేషన్ ఏమిటి ?

-ఈ సినిమాలో డిటెక్టివ్ కి అమ్మనాన్నలలే సహాయకులిగా వుంటారు. అమ్మ పేరు షర్మిల, నాన్న పేరు లోకనాథ్, తన పేరు ఓం ప్రకాష్. ఈ మూడు పేర్లలో ఫస్ట్ లెటర్ సౌండింగ్ తో షెర్లాక్ హోమ్స్‌ అని పెట్టడం జరిగింది.

రైటర్ మోహన్ పేరు ఎలా వచ్చింది ?

-నా కెరీర్ ఇవివి గారి దగ్గర మొదలైయింది. తర్వాత పోసాని గారి దగ్గర చేశాను. తర్వాత రాజశేఖర్ గారి సినిమాలకి చేశాను. ఆయనే రైటర్ మోహన్ అనే పేరు వేశారు. సినిమా టీంలో ఒకే పేరుతో చాలామంది వుంటే వాళ్ళ డిపార్ట్మెంట్ పేరుతో పిలుస్తారు. నేను రైటింగ్ డిపార్ట్మెంట్ లో చాలా కాలం పని చేయడంతో రైటర్ మోహన్ అనే పేరులా అలా నేచురల్ గా వచ్చింది.

మ్యూజిక్ గురించి ?

-సునీల్ కశ్యప్ పాటల ఇచ్చారు. ఇప్పటికే సాంగ్స్ వైరల్ అయ్యాయి. ఆర్ఆర్ జ్ఞాని చేశారు. చాలా అద్భుతంగా వచ్చింది.

రైటర్ గా మీ బలం ?

-నేను కామెడీ బాగా చేయగలను. అది మా గురువు గారు ఈవివి గారి దగ్గర నేర్చుకున్నాను. రైటర్ గా పూర్తిగా అనుభవం సాధించిన తర్వాతే దర్శకుడు కావాలని అనుకున్నాను.

నెక్స్ట్ ఏ జోనర్ లో చేయబోతున్నారు ?

-నెక్స్ట్ ఎమోషనల్ జోనర్ లో ఓ సినిమా చేయబోతున్నాను. స్క్రిప్ట్ సిద్ధంగా వుంది

ఆల్ ది బెస్ట్

-థాంక్ యూ

]]>
https://telugu.cinebullet.com/srikakulam-sherlock-holmes-will-be-unpredictable-audience-will-definitely-be-thrilled-director-writer-mohan/feed/ 0
తమిళ దర్శకుడు తీసిన తెలుగు నేటివిటి కథ ‘విడుదల-2’ : నిర్మాత చింతపల్లి రామారావు. https://telugu.cinebullet.com/vidudala-2-a-telugu-nativity-story-made-by-a-tamil-director-producer-chintapalli-rama-rao/ https://telugu.cinebullet.com/vidudala-2-a-telugu-nativity-story-made-by-a-tamil-director-producer-chintapalli-rama-rao/#respond Wed, 18 Dec 2024 16:36:19 +0000 https://telugu.cinebullet.com/?p=5312 విజయ్ సేతుపతి, వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన ‘విడుదల -1’ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘విడుదల-2’. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.. ప్రముఖ నిర్మాత , శ్రీ వేధాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు. ఈ చిత్ర తెలుగు హక్కులను దక్కించుకున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేస్తున్నారు నిర్మాత చింతపల్ల రామారావు ఈ సందర్భంగా ఆయన బుధవారం చిత్ర విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.

విడుదల-2 చిత్రం ఎలా ఉండబోతుంది?

పరిపాలకుల అహంకారానికి అణచివేయబడిన సామాన్యుల నుంచి ఉధ్భవించిన ఒక అసామాన్యుడి వీర విప్లవ గాథే ‘విడుదల-2’. మనతో మిళితమైన అంశాలతో కూడిన కథ.. ఇలాంటి కథలు మన నేటివిటికి సరిపోతుంది అని ఈ సినిమా తెలుగు హక్కులను దక్కించుకున్నాను. యదార్థ సంఘటనల ఆధారంగా తీసిన చిత్రమిది. అణగారిని వర్గాల నుంచి ఉద్భవించిన ఓ విప్లవ కెరటం అందరిని పెట్టుబడి దారి వ్యవస్థ నుంచి ఎలా బయటపడేలా చేశారు అనేది ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది.

ఈ చిత్రం తెలుగు నేటివిటికి ఎలా సరిపోతుంది?

ఈ చిత్రం తమిళంలో తీసిన తెలుగు నేటివిటి కథ. తెలుగు రాష్ట్రాల్లోని సమస్యలు, ఇక్కడ జరిగిన సంఘటనలు ఆధారంగా తీసిన చిత్రమిది. ఇది తమిళ దర్శకుడు తీసిన తెలుగు వారి కథ.

విజయ్‌సేతుపతి పాత్ర ఎలా ఉండబోతుంది?

నటుడిగా ఆయన గురించి ఎంత చెప్పిన తక్కువే.. ఈ చిత్రంలో పెరుమాళ్‌కు పాత్రకు ఆయన నూటికి నూరు శాతం సరిపోయాడు.

నక్సెలైట్‌ పాత్రలో విజయ్‌ సేతుపతి నటన, పాత్రలోని ఎమోషన్‌ ఆయన పండించిన విధానం అద్భుతం. నటుడిగా విజయ్‌ సేతుపతి ప్రేక్షకుల్లో ఎంతో మంచి గుర్తింపు ఉంది. ఈ చిత్రం ఆయన పేరు మరింత పెరుగుతుంది. ప్రజాసంక్షేమం కోసం కోరిన వ్యక్తి తమ వాళ్లను కుటుంబాన్ని కూడా వదిలి ఎలాంటి త్యాగాలు చేశాడు? అనేది ఎంతో ఎమోషనల్‌గా ఉంటుంది.

ఇళయరాజా సంగీతం గురించి?

ఈ చిత్రానికి ఆయన నేపథ్య సంగీతం ప్రాణంగా నిలుస్తుంది. ఈ చిత్రంలో ఆయన సంగీతంతో ప్రళయరాజాలా అనిపిస్తాడు.

ఇంకా ఈ చిత్రంలో ప్రధాన హైలైట్స్‌ ఏమిటి?

ఈ చిత్రంలో పీటర్‌ హెయిన్స్‌ ఇప్పటి వరకు ఇండియన్‌ స్క్రీన్‌పై చూడని పోరాటాలు సమాకూర్చాడు, మంజు వారియర్‌ సహజ నటన ఈ చిత్రానికి ప్లస్‌ అవుతుంది. విజయ్‌, మంజు వారియర్‌ మధ్య ఎమోషన్స్‌ సీన్స్‌ అద్భుతంగా ఉంటాయి. ఆ సన్నివేశాలు అందర్ని కంటతడిపెట్టిస్తాయి.

మీరు ఈ చిత్రాన్ని తీసుకోవడానికి మహారాజా చిత్రం సాధించిన విజయం కూడా కారణం అనుకోవచ్చా?

మహారాజా చిత్రం విజయం సాధించడం కూడా ఒక కారణం. ఈ కథాంశం కూడా నాకు నచ్చడంతో ఈ సినిమా తీసుకున్నాను.

సీక్వెల్స్‌కు హిట్స్‌ అవుతున్నాయి ఆ సెంటిమెంట్‌ కూడా ఉంది. ఆ కోవలోనే ఈ చిత్రం కూడా విజయం సాదిస్తుంది. అత్యధిక థియేటర్స్‌లో ఈ సినిమా విడుదల చేస్తున్నాం.

విడుదల పార్ట్‌ వన్‌తో పొలిస్తే పార్ట్‌-2 ఎలా ఉంటుంది?

పార్ట్‌ వన్‌ కేవలం పాత్రలు ఎస్టాబ్లిష్‌ మాత్రమే జరిగింది. కథ అంతా విడుదల-2లోనే ఉంటుంది పార్ట్‌ వన్‌కు పదిరెట్టు అద్భుతంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రంలో ప్రతి ఫ్రేమ్‌లో విజయ్‌ సేతుపతి అత్యంత ఉన్నతమైన నటనను చూస్తారు. ఆయన ప్రతి ఫ్రేమ్‌లో ఉంటాడు.

ఇందులో హింస ఎక్కువగా కనిపిస్తుంది? అభ్యంతరాలు ఏమీ రాలేదా?

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. కానీ ఇది కొత్తగా క్రియేట్‌ చేసిన కథ కాదు. పూర్తి స్థాయి రియలిస్టిక్‌గా ఉంటుంది.

పార్ట్‌-3 ఉంటుందా?

పార్ట్‌-3 దర్శకుడి ఆలోచనను బట్టి ఉంటుంది.

మీ తదుపరి చిత్రాలు

శ్రీ శ్రీ రాజావారు చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలోనే డ్రీమ్‌గర్ల్‌ అనే ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నాం. ఇది కాక మరో రెండు సినిమాలు సెట్స్‌ మీదకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నాయి.

]]>
https://telugu.cinebullet.com/vidudala-2-a-telugu-nativity-story-made-by-a-tamil-director-producer-chintapalli-rama-rao/feed/ 0
అత్యంత ఘనంగా నాగన్న మూవీ ట్రైలర్ విడుదల https://telugu.cinebullet.com/naganna-movie-trailer-released-with-great-fanfare/ https://telugu.cinebullet.com/naganna-movie-trailer-released-with-great-fanfare/#respond Wed, 18 Dec 2024 16:27:50 +0000 https://telugu.cinebullet.com/?p=5309 చాందిని క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ కుమార్ హీరోగా, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలో నెక్కింటి నాగరాజు నిర్మిస్తున్న తాజా చిత్రం నాగన్న. ఈ చిత్రాన్ని సతీష్ కుమార్, మహేష్ కుమార్ ఇద్దరు దర్శకత్వం చేస్తున్నారు. వీరితో పాటు సింధు సిరి, చందన, రూప, జనర్థాన్, స్వాతి ఘట్కర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రం నుంచి నేడు ట్రైలర్ విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రం యూనిట్ మీడియా సమావేశం నిర్వహించారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా తీసి, థియేటర్, ఓటీటీలలో విడుదల చేయడం అంటే ఎంత కష్టమో అందిరికి తెలిసిందే. ఈ విషయంలో డైరెక్టర్స్ సతీష్ కుమార్, మహేష్ కుమార్ ల కృషి అద్భతం అని సమావేశానికి వచ్చిన అతిథులు కొనియాడారు.

ఈ సమావేశంలో డైరెక్టర్ సతీష్ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ప్రత్యేక్షంగా, పరోక్షంగా పనిచేసినా, హెల్ప్ చేసిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదిత్య మ్యూజిక్ లో పాటలు వచ్చేలా కృషి చేసిన నిరంజన్, మాధవ్ ఇద్దరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ఇంత బాగా రావడానికి ప్రొడ్యూసర్ నెక్కంటి నాగరాజు ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉంది అని పేర్కొన్నారు.

హీరోయిన్ సింధూ మాట్లాడుతూ.. తెలుగు అమ్మాయిగా పుట్టినందుకు సంతోషంగా ఉందన్నారు. ముఖ్యంగ జై కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఫ్రెండ్ తో ఆడిషన్ కు వెళ్లి సెలెక్ట్ అయినట్లు చెప్పారు. ఇక షూటింగ్ సమయంలో డైరెక్టర్, నిర్మాత చూపెట్టిన కేర్ మర్చిపోలేదని పేర్కొన్నారు. షూటింగ్ అంతా చాలా కంఫర్టుగా జరిగిందని, తెలుగు అమ్మాయిలను సపోర్ట్ చేయండి అని పేర్కొన్నారు.

తొమ్మిది రోజుల్లో షూటంగ్ చేయడం అంటే మాములు విషయం కాదని, దీనికి దర్శకుడు సతీష్ కుమార్, అలాగే మహేష్ కుమార్ ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నటి రూప అలాగే జనార్థన్ మాట్లాడుతూ.. ఈ సినిమా అవకాశం ఇచ్చినందుకు నిర్మాత నెక్కంటి నాగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ట్యాలెంటెడ్ డైరెక్టర్స్ సతీష్, మహేష్ ఇద్దరికి థ్యాంక్స్ చెప్పారు.

హీరో, డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ.. 12 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో పనిచేస్తూ చాలా మందితో పరిచయం ఉందని, ఈ కథ పట్టుకొని, చాలా మంది హీరోల దగ్గరకు వెళ్లి కథ చెప్పాము, అలా నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక ప్రొడ్యూసర్ నాగరాజు అన్న నన్నే హీరోగా పెట్టి చేయన్నారు. దాంతో కథను చాలా తొందరగా ఫినిష్ చేయాలి అని చాలా ప్రణాళికతో సినిమా పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ సినిమా ఓటీటీలో వస్తుందని, సొంతంగా థియేటర్లో విడుదల చేస్తన్నట్లు చెప్పుకొచ్చారు. ఈ సినిమా జర్నీలో కలిసి పనిచేసిన చాలా మందికి థ్యాంక్స్ చెప్పారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఒక ఊరిలో ఉండే కొంత మంది కుర్రళ్లు ఒక నిధి కోసం పాటుపడుతారని, ఈ వేటలో వారికి నిధి దొరికిందా లేదా అనే కథాంశంతో ఈ సిినిమా తెరకెక్కినట్లు తెలుస్తుంది. యూట్యూబ్ లో విడుదలైన ఈ ట్రైలర్ పై మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ చిత్రం విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.

నటీనటులు : చిత్రం శ్రీను, మహేష్ కుమార్, సింధు సిరి, చందన, రూప, జనర్థాన్, స్వాతి ఘట్కర్

బ్యానర్ : చాందిని క్రియేషన్స్

డైెరెక్టర్ : సతీష్ కుమార్, మహేష్ కుమార్

ప్రొడ్యూసర్ : నెక్కంటి నాగరాజు

డిఒపి, ఎడిటర్ : లక్ష్మీకుమార్

కొరియోగ్రాఫర్ : మహేష్ కుమార్

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

పీఆర్ఓ: హరీష్, దినేష్

]]>
https://telugu.cinebullet.com/naganna-movie-trailer-released-with-great-fanfare/feed/ 0
స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మిస్తోన్న చిత్రం ‘జాక్- కొంచెం క్రాక్’ ఏప్రిల్ 10న విడుదల https://telugu.cinebullet.com/star-boy-sidhu-jonnalagaddas-film-jack-a-little-crack-directed-by-bommarillu-bhaskar-and-produced-by-b-v-s-n-prasad-will-release-on-april-10th/ https://telugu.cinebullet.com/star-boy-sidhu-jonnalagaddas-film-jack-a-little-crack-directed-by-bommarillu-bhaskar-and-produced-by-b-v-s-n-prasad-will-release-on-april-10th/#respond Wed, 18 Dec 2024 10:14:29 +0000 https://telugu.cinebullet.com/?p=5306 సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం మంచి ఫాంలో ఉన్నారు. డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ అంటూ యూత్, మాస్ ఆడియెన్స్‌లో క్రేజీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఈయ‌న క‌థాయ‌కుడిగా బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న తాజా చిత్రం ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. శ్రీవెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర బ్యాన‌ర్‌పై సీనియ‌ర్ ప్రొడ్యూస‌ర్ బివిఎస్ఎన్‌.ప్ర‌సాద్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో సిద్దు జొన్నలగడ్డ సరసన బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య నటిస్తున్నారు. కీలక పాత్రలో ప్ర‌కాష్ రాజ్‌, నరేష్, బ్రహ్మాజీ వంటి వారు కనిపించనున్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ 80 శాతం పైగానే పూర్త‌య్యింది. శరవేగంగా షూటింగ్ చేస్తున్న చిత్రయూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ చిత్రానికి సంబంధించిన రిలీజ్ డేట్‌ను మేకర్లు రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ఈ మూవీని గ్రాండ్‌గా విడుదల చేయబోతోన్నారు. సమ్మర్ కానుకగా రాబోతోన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే పూర్తి కానుంది.

ఈ చిత్రంలో సిద్దు పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉండబోతోంది. పూర్తి వినోదాత్మకంగా రాబోతోన్న ఈచిత్రానికి అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రమోషన్స్‌లో యూనిట్ ప్రారంభించనుంది.

]]>
https://telugu.cinebullet.com/star-boy-sidhu-jonnalagaddas-film-jack-a-little-crack-directed-by-bommarillu-bhaskar-and-produced-by-b-v-s-n-prasad-will-release-on-april-10th/feed/ 0