డ్రింకర్ సాయి మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!

drinker sai review and rating

నటీనటులు: ధర్మ, ఐశ్వర్య శర్మ, పోసాని కృష్ణమురళి, శ్రీకాంత్ అయ్యంగార్, సమీర్, ఎస్ఎస్ కాంచి, భద్రం, కిర్రాక్ సీత, రీతు చౌదరి, ఫన్ బకెట్ రాజేశ్, రాజ ప్రజ్వల్, తదితరులు
నిర్మాతలు: బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్
రచన, దర్శకత్వం: కిరణ్ తిరుమలశెట్టి
సినిమాటోగ్రఫి: ప్రశాంత్ అంకిరెడ్డి
ఎడిటింగ్: మార్తాండ్ కె వెంకటేష్
మ్యూజిక్: శ్రీ వసంత్

టీజర్ మరియు ట్రైలర్ ద్వారా ప్రేక్షకులలో ఆసక్తి ఏర్పరుచుహుకున్న చిత్రం ‘డ్రింకర్ సాయి’. కిరణ్ తిరుమలశెట్టి దర్శకత్వంలో ధర్మ మరియు ఐశ్వర్య శర్మ హీరో హీరోయిన్లు గా నటించగా చిన్న బడ్జెట్‌లో నిర్మితమైన ఈ చిత్రం మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా గా తెరకెక్కింది. “బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్” అనే ట్యాగ్‌లైన్ తో వచ్చిన ఈ చిత్రం లో కిరాక్ సీత, రీతూ చౌదరి, శ్రీకాంత్ అయ్యంగార్, ఫన్ బకెట్ రాజేష్, సమీర్, భద్రం, SS కాంచి వంటి పలువురు నటులు కీలక పాత్రలు పోషించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరించిందో ఈ సమీక్షలోకి వెళ్లి చూద్దాం.

కథ: తప్పు మార్గంలో జీవిస్తూ జీవితాన్ని జల్సా చేస్తున్న డబ్బున్న అనాధ సాయి (ధర్మ). తాగడం, తిరగడం తప్ప ఏపని చేయని సాయి కి ఓ రోజు భాగీ (ఐశ్వర్య) ప్రేమలో పడతాడు. ఆమె ప్రేమను పొందేందుకు సాయి ప్రయత్నిస్తాడు. కానీ, మందు, సిగరెట్ వంటి అలవాట్లను అసహ్యించుకునే భాగీతో సాయి ప్రేమను ఎలా అంగీకరించింది అనేది ఆసక్తికరం. భాగీ ప్రేమను గెలుచుకోవడం కోసం సాయి చేసిన ప్రయత్నాలు? భాగీ సాయిని అంగీకరించిందా? సాయి జీవితానికి ఈ ప్రేమ ఎలా మలుపు తీసుకువచ్చిందనేది అసలు కథ.

నటీనటులు: హీరో ధర్మ కాకాని ఈ చిత్రంలో అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. ఆయన డ్యాన్సులు, ఫైట్స్ మరియు ఎమోషనల్ సీన్లలో చూపించిన పర్ఫెక్షన్, పాత్రకు సరిపడా మెచ్యూరిటీని కనపరిచింది. మద్యం మత్తులో ఉన్న యువకుడి పాత్రలో అతని హావభావాలు మరియు బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్‌గా ఉన్నాయి. క్లైమాక్స్ లో ఎమోషనల్ సీన్స్ లో అయన నటన ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. హీరోయిన్ ఐశ్వర్య శర్మ తన పాత్రలో చాలా క్యూట్‌గా కనిపించగా, ఎమోషనల్ సీన్స్ లో చాలా ముద్ర వేసింది. ఆమె తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అతిథి పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ మరియు పోసాని కృష్ణమురళి తమ పాత్రలతో ఆకట్టుకున్నారు. సమీర్, కిరాక్ సీత, రీతు చౌదరి వంటి ఇతర నటీనటులు కూడా తమ పాత్రలను బాగా పోషించారు. SS కాంచి తన పాత్రతో ప్రేక్షకులను కాసేపు నవ్వించారు. ఫన్ బకెట్ రాజేష్, భద్రం వారు తమ హాస్య ప్రదర్శనతో చిత్రంలో నవ్వులు పంచారు. మొత్తం మీద, అన్ని పాత్రలు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశాయి.

సాంకేతిక నిపుణులు: కిరణ్ తిరుమలశెట్టి రాసుకున్న కథ చాలా బాగుంది. టెక్నికల్‌గా సినిమాను బలంగా మలచడంతో పాటు మంచి కథ, కథనం తోడై ప్రేక్షకులను అలరిస్తుంది. శ్రీ వసంత్ సంగీతం “డ్రింకర్ సాయి” సినిమాకు ప్రధాన బలం. పాటలు ఫోక్ టచ్‌తో వినసొంపుగా ఉన్నాయి. నేపథ్య సంగీతం కూడా కొన్ని ఎమోషనల్ సీన్లను బాగా ఎలివేట్ చేసింది. ప్రశాంత్ అంకిరెడ్డి సినిమాటోగ్రఫీ డీసెంట్‌గా ఉంది.మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటింగ్ బాగుంది. నిర్మాతలు బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ ప్రొడక్షన్ వాల్యూస్‌ బాగున్నాయి.

ప్లస్ పాయింట్స్:

సంగీతం

నటీనటుల ప్రదర్శన

ప్రొడక్షన్ వాల్యూస్

మైనస్ పాయింట్స్:

సినిమా నిడివి

అక్కడక్కడా సాగతీత

తీర్పు: “డ్రింకర్ సాయి” ఒక సరికొత్త కాన్సెప్ట్‌తో రూపొందించబడిన చిత్రం. అది మితిమీరిన అలవాట్ల ద్వారా జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయో చూపిస్తుంది. అలాగే యువతలో మందు, సిగరెట్ వంటి వ్యసనాలపై ఆలోచన కలిగించే ప్రయత్నం చేస్తుంది. సినిమా ఒక శక్తివంతమైన సందేశాన్ని అందిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, ప్రత్యేక అనుభవాన్ని అందిస్తుంది. “డ్రింకర్ సాయి” కథ, నటన మరియు సందేశం వంటి అంశాలతో చాలా బలమైన చిత్రంగా నిలుస్తుంది.

రేటింగ్: 3.25/5