“రాజు గారి అమ్మాయి, నాయుడు గారి అబ్బాయి” నుండి “ధీర ధీరనా” లిరికల్ వీడియో విడుదలైంది

తన్విక అండ్ మొక్షిక క్రియేషన్స్ పతాకంపై నూతన తారలు రవితేజ నున్న హీరోగా, నేహ జురెల్ హీరోయిన్ గా రూపొందుతున్న చిత్రం ‘ రాజు గారి అమ్మాయి – నాయుడు గారి అబ్బాయి’. సత్య రాజ్ దర్శకునిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాసు నిర్మాతలు.

యువ ప్రతిభావంతులు కలిసి రూపొందిస్తున్న “రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన “ఐ లవ్ యు” గీతం ప్రేక్షకులను కట్టిపడేసింది. తాజాగా ఈ చిత్రం నుంచి శృంగార గీతం “ధిర ధిరన” లిరికల్ వీడియో విడుదలైంది.

ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తనయుడు రోషన్ సాలూరి ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం చేయటం విశేషం. రోషన్ సాలూరి స్వరపరిచిన “ధిర ధిరన” గీతం ఆకట్టుకుంటోంది. సాహితి చాగంటి ఆలపించిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించారు. రోషన్ సాలూరి మధురమైన సంగీతానికి సాహితి చాగంటి గాత్రం, రెహమాన్ సాహిత్యం తోడై పాట మరింత అందంగా మారింది. లిరికల్ వీడియోలో నాయికా నాయకుల మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. థియేటర్లలో ఈ సాంగ్ యువత మనసు దోచుకోవడం ఖాయమనిపిస్తోంది.

“రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” చిత్ర కథాంశం, ఈ తరం సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ‘రాజుగారి అమ్మాయి నాయుడు గారి అబ్బాయి’ టీజర్ మెప్పించింది. ప్రేక్షకులలో ఈ సినిమాపై ఉన్న ఆసక్తిని రెట్టింపు చేయడానికి ఈ చిత్రం యొక్క ట్రైలర్ త్వరలో విడుదల కానుంది. ఈ చిత్రం కొద్ది రోజులలో థియేటర్లలో కుటుంబ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.

తారాగణం:

కథానాయకుడు: రవితేజ నున్నా

కథానాయిక: నేహా జురెల్

ఇతర ప్రధాన పాత్రలలో నాగినీడు,ప్రమోదిని

జబర్దస్త్ బాబీ,జబర్దస్త్ అశోక్, పుష్ప దుర్గాజి

యోగి ఖత్రి , అజిజ్ భాయ్, వీరేంద్ర

గిద్ద మోహన్, అప్పిరెడ్డి, కంచిపల్లి అబ్బులు

శ్రావణి

సాంకేతిక బృందం:

సంగీతం: రోషన్ సాలూరి

ఛాయాగ్రహణం: మురళి కృష్ణ వర్మ

కూర్పు: కిషోర్ టి

దర్శకత్వం: సత్య రాజ్

నిర్మాతలు: రామిసెట్టి సుబ్బారావు, ముత్యాల రామదాస్