చెన్నై, నవంబర్ 10, 2023: వైవిధ్యమైన పాత్రలు, సినిమాలతో ఇటు దక్షిణాది ప్రేక్షకులనే కాదు, ఉత్తరాది ప్రేక్షకులకు సైతం సుపరిచితులయ్యారు టాలెంటెడ్ యాక్టర్ ధనుష్. ఈ వెర్సటైల్ స్టార్ మరో సెన్సేషనల్ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చుట్టారు. ఆ మూవీ ఏదో కాదు.. మ్యాస్ట్రో ఇళయ రాజా బయోపిక్. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో సంగీత జ్ఞానిగా తనదైన ముద్ర వేసిన ఈయనపై సినిమా రానుండటం అనేది సంగీతాభిమానులతో పాటు ఇళయరాజా అభిమానులను, సినీ ప్రేక్షకులను ఆనందోత్సహాల్లో ముంచెత్తింది. ఈ చిత్రాన్ని కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ సంస్థలు కలిసి రూపొందించనున్నాయి. ఈ నిర్మాణ సంస్థల కలయికలో తొలి చిత్రంగా రూపొందనున్న ఈ బయోపిక్ షూటింగ్ అక్టోబర్ 2024లో ప్రారంభమై 2025 మధ్యలో విడుదల కానుంది.
రాబోయే మూడు సంవత్సరాలలో ప్రేక్షకులను ఆకట్టుకునేలా అనేక మెగా-బడ్జెట్ చిత్రాలను కనెక్ట్ మీడియా, మెర్క్యూరీ గ్రూప్ కలిసి సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. సౌత్ సినీ ఇండస్ట్రీని దృష్టిలో ఉంచుకుని కనెక్ట్ మీడియా సహకారంతో మెర్క్యురీ మూవీస్ అనే ప్రత్యేక యూనిట్‌ను మెర్క్యురీ గ్రూప్ ఇండియా ఆవిష్కరించింది. ఇకపై సరికొత్త సినిమాలను, కంటెంట్‌ను అందించేందుకు సిద్దమైంది. దక్షిణాదిలోని సినిమా, ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీకి క్లాస్ గ్లోబల్ ప్రాక్టీస్‌లు , స్ట్రక్చర్డ్ స్టూడియో ప్రొడక్షన్‌లో అత్యుత్తమంగా తీసుకురావడంలో కొత్త శకానికి నాంది పలికినట్టు అవుతుంది. వీరి కలయిక రాబోయే దశాబ్దంలో గణనీయమైన వ్యాపార వృద్ధిని అందిస్తుంది. దీనిని ఇలంపరితి గజేంద్రన్ ముందుండి నడిపించనున్నారు.
దక్షిణాది చిత్ర పరిశ్రమ సంవత్సరానికి 900 కంటే ఎక్కువ సినిమాలను విడుదల చేస్తుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో సౌత్ ఇండస్ట్రీ వాటా ఎక్కువ. కంటెంట్ సృష్టి పరంగా అగ్రగామిగా ఉంది. ఈ నేపథ్యంలో కనెక్ట్ మీడియా నుంచి వరుణ్ మాథుర్ మాట్లాడుతూ, “మెర్క్యురి అనేది ప్రపంచ వినోద ప్రదేశంలో అత్యంత ప్రసిద్ధి చెందిన పేర్లలో ఒకటి. మెగా-బడ్జెట్ చిత్రాలను నిర్మించడానికి వారితో చేతులు కలపడం పట్ల మేము సంతోషిస్తున్నాం. ప్రస్తుతం భారతీయ వినోద పరిశ్రమ చాలా కీలక పరిణామ దశలో ఉంది. రాబోయే రెండు దశాబ్దాలు ఇది మరింత అభివృద్ధి చెందుతుంది. ఒక జాతీయ స్టూడియోగా మెర్క్యురీతో మా భాగస్వామ్యం గొప్పగా ఉంటుంది. భారతదేశం, ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల కొద్దీ అభిమానులకు నచ్చే సినిమాలను అందించడంలో మా వంతు ప్రయత్నం చేస్తాం’’ అన్నారు.
మెర్క్యూరీ గ్రూప్ సీఈవో, ఎండీ శ్రీరామ్ భక్తిశరణ్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం ప్రాంతీయ కథలకు ఎక్కువగా డిమాండ్ ఉంది. ప్రాంతీయ కథలతో సినిమాలు తీస్తే అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోంది. మాకు ఇంటర్నేషనల్ వైడ్‌గా వ్యాపారం చేసిన అనుభవం ఉంది. ఇక ముందు లోకల్, ప్రాంతీయ కథలను అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిస్తాం. కనెక్ట్ మీడియాతో ఏర్పాటు చేసిన ఈ వెంచర్ మీద మాకు ఎంతో నమ్మకం ఉంది. కనెక్ట్ మీడియా మాకు విశ్వసనీయ భాగస్వామి మాత్రమే కాకుండా వినోద పరిశ్రమపై స్పష్టమైన, బలమైన అవగాహన కలిగి ఉంది. పరిశ్రమలోని ఇతర విభాగాల వారితోనూ వివిధ వాటాదారులతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి’’అని అన్నారు.
“కనెక్ట్ మీడియా” గురించి
కనెక్ట్ మీడియా దేశంలోని మొట్టమొదటి పాన్-ఇండియా ఫిల్మ్ స్టూడియో, బిగ్ స్క్రీన్ ఎంటర్‌టైనర్‌లపై ప్రత్యేక దృష్టి సారించింది. దేశంలోని పలు భాషలు, భౌగోళిక ప్రాంతాలలో ప్రయాణించే చిత్రాలను రూపొందిస్తోంది. అనేక మెగా బడ్జెట్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. మరి కొన్ని ప్రీ-ప్రొడక్షన్‌లో ఉన్నాయి. రాబోయే 3 సంవత్సరాలకు సరిపడా లైనప్ ఉంది. ఫిల్మ్ స్టూడియో వ్యాపారంతో పాటు, కనెక్ట్ మీడియా ఫాస్ట్ ఛానెల్‌లు, టెక్ ఎనేబుల్డ్ సిండికేషన్‌లోనూ కనెక్ట్ మీడియాకు అనుభవం ఉంది.
“మెర్క్యూరి” గురించి
భారతదేశంతో పాటు అమెరికా, కెనడా, కరేబియన్ దీవులు, యూరప్‌లో కన్సల్టింగ్, టెక్నాలజీ, స్పోర్ట్స్, మీడియా & ఎంటర్‌టైన్‌మెంట్ ఇలా ఎన్నో ఇండస్ట్రీల్లో వ్యాపారం చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా మెర్క్యురీ వేగంగా విస్తరిస్తోంది. మెర్క్యురీ అనేక క్రీడా జట్లకు ప్రాతినిధ్యం వహించడంతో పాటు వినోదం, క్రీడా డొమైన్‌లలో భారతదేశం నుండి అగ్రశ్రేణి సూపర్ స్టార్‌లతో పని చేసింది. మెర్క్యురి ప్రాధమిక దృష్టి ఎల్లప్పుడూ ప్రాంతీయ సినిమాలపైనే ఉంటుంది. అనేక ప్రముఖ నిర్మాణ సంస్థలతో, గత దశాబ్దంలో కొన్ని అతిపెద్ద, అత్యుత్తమ చిత్రాలతో విస్తృతంగా పనిచేసిన గొప్ప అనుభవాన్ని కలిగి ఉంది. మెర్క్యురి బాలీవుడ్ ప్రపంచంలో తమిళం, తెలుగు, కన్నడ భాషలలో ప్రాంతీయ సినిమాపై ఎక్కువ దృష్టి పెట్టడం ద్వారా విస్తృతంగా పనిచేసింది.