Movie Reviews – Cine Bullet Telugu https://telugu.cinebullet.com Telugu News of Cine Bullet Fri, 15 Mar 2024 10:27:46 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.5.3 https://telugu.cinebullet.com/wp-content/uploads/2022/10/cropped-cine-bullet-32x32.jpg Movie Reviews – Cine Bullet Telugu https://telugu.cinebullet.com 32 32 మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కథ, “షరతులు వర్తిస్తాయి” రివ్యూ https://telugu.cinebullet.com/sharathulu-varthisthai-review/ https://telugu.cinebullet.com/sharathulu-varthisthai-review/#respond Fri, 15 Mar 2024 10:23:00 +0000 https://telugu.cinebullet.com/?p=4376 సినిమా పేరు : షరతులు వర్తిస్తాయి

విడుదల తేదీ : మార్చి 15, 2024

నటీనటులు : చైతన్య రావు, భూమిశెట్టి, నందకిషోర్, రాధికా, వెంకీ, పెద్దింటి అశోక్ తదితరులు

బ్యానర్ : స్టార్ లైట్ స్టూడియోస్

సంగీతం : అరుణ్ చిలువేరు

నిర్మాతలు : నాగార్జున సామ‌ల‌, శ్రీష్ కుమార్ గుండా, డాక్ట‌ర్ కృష్ణ‌కాంత్ చిత్త‌జ‌ల్లు

దర్శకత్వం : కుమార‌స్వామి

టాలీవుడ్ యంగ్ హీరో చైతన్య రావు, హీరోయిన్ భూమి శెట్టి నటించిన చిత్రం షరతులు వర్తిస్తాయి. కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ నేడు గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలైంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతి అంశాన్ని టచ్ చేస్తూ సాగే కథ హైలెట్‌గా నిలిచింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్న ఈ మూవీ ప్రతి ఒక్కరూ చూడాల్సిన చిత్రం. కథ ఏంటంటే: హీరో చైతన్యరావు (చిరంజీవి) నీటిపారుదల శాఖలో ఒక చిన్న ఉద్యోగిగా పనిచేస్తూ ఉంటాడు. నాన్న లేని కుటుంబాన్ని బాధ్యతగా చూసుకుంటూ ఉంటాడు. తమ్ముడు, చెల్లి, అమ్మ, ఇల్లు గడవడం..ఇలా అన్నీ చూసుకుంటున్న చైతన్య రావు చిన్నప్పటి నుంచి హీరోయిన్ భూమిశెట్టి (విజయశాంతిని)ని ప్రేమిస్తూ ఉంటాడు. భూమిశెట్టి ఓ స్టేషనరీ షాపులో పనిచేస్తూ ఉంటుంది. వారిద్దరి కులాలు వేరు. కుటుంబ బాధ్యతలు చూస్తున్న చైతన్య రావు తన లవర్ భూమిశెట్టి తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు. అదే సమయంలో ఆ ఏరియాలో చైన్ సిస్టమ్ లాంటి చిట్టీల బిజినెస్ ప్రారంభమవుతుంది. కొంత డబ్బు కట్టాక మరో నలుగురిని జాయిన్ చేపిస్తే లక్షాధికారులు అవ్వొచ్చని ఆ ఊరి ప్రజలను నమ్మిస్తారు.

అదే ఊరిలో కార్పొరేటర్‌గా గెలవడానికి ప్రయత్నిస్తున్న శంకరన్న ఆ చిట్టీల బిజినెస్‌కు అండగా నిలబడతాడు. శంకరన్నను వాడుకుని చిట్టీల కంపెనీ ఆ ఊరివాళ్ల దగ్గర డబ్బులు బాగా వసూలు చేస్తుంది. చైతన్య రావు తన భార్యతో స్టేషనరీ షాపును పెట్టించాలనుకుంటాడు. అందుకు కొంత డబ్బును కూడా భూమిశెట్టికి ఇస్తాడు. ఆ తర్వాత ఫీల్డ్ వర్క్ మీద చైతన్య రావు బయటకు వెళ్తాడు. ఆ సమయంలోనే చైతన్య రావు భార్య, తల్లి ఇద్దరూ చిట్టీల కంపెనీలో డబ్బులు పెడుతారు. ఆ రోజు రాత్రికి రాత్రే ఆ కంపెనీ జెండా ఎత్తేస్తుంది. దీంతో హీరో తల్లికి హార్ట్ స్ట్రోక్ వస్తుంది. దీంతో చైతన్య రావు కుటుంబంతో సహా ఆ ఏరియాలో అందరూ రోడ్డున పడతారు. ఆ తర్వాత ఆ కంపెనీని మన హీరో ఎలా ఎదుర్కొన్నాడు?. శంకరన్నను ఎలా కార్పొరేటర్‌ను చేశాడు?. తన ఇంట్లో సమస్యలను ఎలా పరిష్కరించాడు? తన ఏరియా ప్రజలను ఎలా కాపాడాడు? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ: షరతులు వర్తిస్తాయి సినిమా కంప్లీట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీ. మిడిల్ క్లాస్ కుటుంబాలకు డబ్బు ఆశ చూపించి దోచుకునే మోసం గురించి, ఆ మోసాన్ని ఎదుర్కొని సమస్యను పరిష్కరించిన హీరో గురించి అద్భుతంగా చూపించారు. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరోహీరోయిన్ల ప్రేమకథ, కుటుంబ జీవితం చాలా చక్కగా చూపించారు. అందులోనే కంటతడి పెట్టించే ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ ట్విస్ట్ సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని పెంచుతుంది. సెకండాఫ్‌లో రివీల్ చేసే ట్విస్ట్ అదిరిపోతుంది. రియాల్టీగా, మిడిల్ క్లాస్ బతుకుల మీద సాగే కథను అద్భుతంగా తెరకెక్కించారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీని నడిపే వ్యక్తిగా చైతన్య రావు అలా ఒదిగిపోయారంతే. సినిమా అంతా రియల్ లొకేషన్స్‌లో చేయడం సినిమాకు ప్లస్ అయ్యింది. సినిమాటోగ్రఫీ బాగుంది. చిట్టీల మోసాలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీల చుట్టూ జరిగే తీరు, ఎమోషన్స్‌తో నడిచే పాత్రలను దర్శకుడు కుమారస్వామి అద్భుతం తెరకెక్కించారు.

ప్లస్ పాయింట్స్ :

చైతన్య రావు నటన

సినిమాటోగ్రఫీ

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :

స్క్రీన్ ప్లే :

తీర్పు: ఓవరాల్ గా షరతులు వర్తిస్తాయి సినిమా ఓ మధ్యతరగతి కుటుంబ కథ. సాఫీగా సాగుతున్న ఓ మధ్యతరగతి కుటుంబ జీవితం డబ్బుపై ఆశతో ఎలాంటి పరిస్థితులలోకి వెళ్లిందో ఈ సినిమా ద్వారా తెరపై చూడొచ్చు.

రేటింగ్ : 3/5

]]>
https://telugu.cinebullet.com/sharathulu-varthisthai-review/feed/ 0
“సలార్ పార్ట్‌ 1 – సీజ్‌ఫైర్‌” తెలుగు – రివ్యూ https://telugu.cinebullet.com/salaar-part-1-cease-fire-telugu-review/ https://telugu.cinebullet.com/salaar-part-1-cease-fire-telugu-review/#respond Fri, 22 Dec 2023 13:48:11 +0000 https://telugu.cinebullet.com/?p=3946 సినిమా పేరు : సలార్

విడుదల తేదీ : డిసెంబర్ 22, 2023

నటీనటులు : ప్రభాస్, శ్రుతి హాసన్, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్, మధు గురుస్వామి, ఈశ్వరీ రావు, టినూ ఆనంద్, రామచంద్రరాజు, ఐకాన్ సతీష్ తదితరులు

దర్శకుడు : ప్రశాంత్‌ నీల్‌

నిర్మాత : విజయ్‌ కిర్‌గంధూర్‌

సంగీతం : రవి బస్రూర్

సినిమాటోగ్రఫీ : భువన్ గౌడ్

ఎడిటర్ : ఉజ్వల్ కులకర్ణి

పాన్ ఇండియా హీరో ప్రభాస్ నుంచి వచ్చిన కొత్త ప్రాజెక్ట్ “సలార్”. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులును ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథ :

ఖాన్సార్ నగరానికి నాయకుడిగా రాజమన్నార్ (జగపతి బాబు) తిరుగులేని విధంగా ఉంటాడు. ఐతే, రాజమన్నార్ రెండో భార్య కొడుకు వరద రాజమన్నార్ (పృథ్వీరాజ్ సుకుమారన్)ని దొరని చేయాలని నిర్ణయించుకుంటాడు. అయితే, ఆ నిర్ణయం ఖాన్సార్ నగరం గమనాన్నే మార్చేస్తోంది. ఖాన్సార్ నగరానికి నాయకుడు అవ్వడం కోసం చుట్టూ ఉన్నవారంతా బలాన్ని పోగేసుకుని యుద్దానికి సన్నద్ధం అవుతుంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల మధ్య వరద రాజమన్నార్ పై అనేక దాడులు జరుగుతూ ఉంటాయి. అందరూ వరద రాజమన్నార్ ను చంపడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సహాయం కోసం తన చిన్ననాటి ప్రాణ స్నేహితుడు దేవా (ప్రభాస్)ని పిలుస్తాడు వరద. ఆ తర్వాత దేవా(ప్రభాస్) ఏం చేశాడు ?, తన స్నేహితుడి కోసం ఎలాంటి యుద్ధం చేశాడు ?, ఈ క్రమంలో శత్రువులు ఎలా భయపడ్డారు ?, అసలు దేవా ఎవరు ?, అతని గతం ఏమిటి ?, అతని తండ్రి ఎవరు ? అనేది మిగిలిన కథ.

ప్లస్ పాయింట్స్ :

భారీ అంచనాలతో వచ్చిన సలార్, ఆ అంచనాలకు తగ్గట్టుగానే, హై ఓల్టేజ్ యాక్షన్ డ్రామాతో పాటు గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తోనూ చాలా బాగా ఆకట్టుకుంది. సినిమాలో ప్రభాస్ యాక్షన్ ఎలివేషన్స్ ఫ్యాన్స్ కి బాగా నచ్చుతాయి. అదేవిధంగా ఖాన్సార్ నగరం చుట్టూ అల్లిన కథలోని మెయిన్ ఎమోషన్ అండ్ ట్విస్ట్ లు కూడా బాగున్నాయి. సలార్ పాత్రలోని షేడ్స్ ను ప్రభాస్ బాగా పలికించాడు. ప్రభాస్ – శ్రుతి హాసన్ మధ్య సాగే సీన్స్ ను, అలాగే ప్లాష్ బ్యాక్ ను.. ఆ ప్లాష్ బ్యాక్ లోని ప్రభాస్ క్యారెక్టర్ తో పాటు యాక్షన్ సీక్వెన్సెస్ ను.. ఇలా ప్రతి పాత్రను, ప్రతి ట్రాక్ ను దర్శకుడు ప్రశాంత్ నీల్ చాలా బాగా తీర్చిదిద్దారు.

ముఖ్యంగా ప్రభాస్ – పృథ్వీరాజ్ సుకుమారన్ మధ్య సాగే సీన్స్ కూడా మెప్పిస్తాయి. తన పాత్రకు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణం పోశారు. రఫ్ అండ్ మాస్ అవతార్‌ లో పృథ్వీరాజ్ సుకుమారన్ అద్భుతంగా నటించారు. ప్రభాస్ – పృథ్వీరాజ్ సుకుమారన్ ఆన్‌ స్క్రీన్ ఫ్రెండ్షిప్ కూడా బాగానే వర్కౌట్ అయ్యింది. ఇక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో జగపతి బాబు కూడా చాలా బాగా నటించాడు. శ్రియా రెడ్డి తన పాత్రలో మెరిశారు. ఆమె పాత్రలోని ఎలివేషన్ సన్నివేశాలు చాలా బాగున్నాయి.

నటి ఈశ్వరీ రావుకి చాలా మంచి పాత్ర దొరికింది. ఆమె అమ్మగా అలరించింది కూడా. బాబీ సింహా, మధు గురుస్వామి, టినూ ఆనంద్, రామచంద్రరాజు, ఐకాన్ సతీష్ ఇలా ప్రతి ఒక్కరూ చాలా సెటిల్డ్‌ గా నటించారు. అలాగే, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వం ఆకట్టుకుంది. కథలోని ప్రధాన పాత్రల పై ప్రశాంత్ నీల్ పెట్టిన ఎఫెక్ట్స్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా ఆయన తీసుకున్న స్టోరీ లైన్, రాసుకున్న యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ మెయిన్ ఎమోషన్స్ చాలా బాగున్నాయి. అన్నట్టు రవి బస్రూర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంది.

మైనస్ పాయింట్స్ :

సలార్ కథలోని మెయిన్ సెటప్ లో డెప్త్ ఉన్నా.. మెయిన్ ప్లాట్ లోని మెయిన్ క్యారెక్టర్స్ మధ్య ప్రధాన కాన్ ఫ్లిక్ట్ ను ఇంకా బాగా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. అలాగే కొన్ని ఇన్సిడెంట్స్ మరీ సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక కష్ట కాలంలో ఉన్న స్నేహితుడి కోసం హీరో రంగంలోకి దిగి ఏం చేశాడు ?, స్నేహం కోసం ఎలాంటి త్యాగం చేశాడు ? అనేదే ఈ సినిమా థీమ్. కానీ, ఆ స్నేహాన్ని పాత్రలు పెద్దయ్యాక కూడా మరింత ఎఫెక్టివ్ గా ఎస్టాబ్లిష్ చేసి ఉంటే బాగుండేది. అన్నట్టు ‘కె.జి.ఎఫ్’ ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాల మాదిరి ఇందులో కూడా లెక్కకు మించి పాత్రలు ఉన్నాయి.

సాంకేతిక విభాగం :

టెక్నికల్ గా చూసుకుంటే సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. రవి బస్రూర్ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యింది. అదే విధంగా భువన్ గౌడ్ సినిమాటోగ్రఫీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. సినిమాలోని నిర్మాత విజయ్‌ కిర్‌గంధూర్‌ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ తన రచనతోనూ దర్శకత్వంతోనూ ఆకట్టుకున్నారు. ఐతే, ఉత్కంఠభరితమైన కథనాన్ని ఇంకా ఎఫెక్టివ్ రాసుకుని ఉండి ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.

తీర్పు :

హై వోల్టేజ్ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ ‘సలార్’ చాలా బాగా ఆకట్టుకుంది. ప్లే ఇంట్రెస్ట్ గా సాగుతూ గ్రాండ్ యాక్షన్ విజువల్స్ తో పాటుగా ప్రభాస్ స్క్రీన్ ప్రెజెన్సీ, మరియు మెయిన్ కథలోని యాక్షన్ అండ్ ఎమోషన్స కూడా చాలా బాగున్నాయి. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఐతే ఫుల్ కిక్ ను ఇస్తోంది ఈ సినిమా. కాకపోతే, కొన్ని యాక్షన్ సన్నివేశాలు రెగ్యులర్ గా అనిపిస్తాయి. కానీ, ఓవరాల్ గా ఈ సినిమా ఆడియన్స్ ను చాలా బాగా అలరిస్తోంది

రేటింగ్ : 3.5/5

]]>
https://telugu.cinebullet.com/salaar-part-1-cease-fire-telugu-review/feed/ 0
ది ట్రయల్ మూవీ రివ్యూ : ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ https://telugu.cinebullet.com/the-trial-movie-review-an-interesting-investigative-thriller-2/ https://telugu.cinebullet.com/the-trial-movie-review-an-interesting-investigative-thriller-2/#respond Thu, 23 Nov 2023 09:13:55 +0000 https://telugu.cinebullet.com/?p=3726 మూవీ : ది ట్రయల్

రిలీజ్ డేట్ : 2023-11-24

నటీనటులు : స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు, ఉదయ్ పులిమే, సాక్షి ఉత్తాడ, జస్వంత్ పెరుమాళ్ల తదితరులు

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : రామ్ గన్ని

నిర్మాతలు : స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ

సినిమాటోగ్రఫీ : శ్రీ సాయికుమార్ దారా

ఎడిటర్ : శ్రీకాంత్ పట్నాయక్ ఆర్

మ్యూజిక్ : శరవణ వాసుదేవన్

బ్యానర్స్ : ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్

సహ నిర్మాత : సుదర్శన్ రెడ్డి

కథ :

పోలీస్ ఇన్స్‌పెక్టర్ రూప (స్పందన పల్లి), సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అజయ్ (యుగ్ రామ్) పెళ్లి జరుగుతుంది. అయితే ఇద్దరి భావాలు, అభిప్రాయాలు కలవకపోవడం వల్ల వారి మధ్య తగాదాలు, అలకలు చోటు చేసుకొంటుంటాయి. ఈ క్రమంలో రూప ప్రెగ్నెంట్ అని తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తాడు. ఆ క్రమంలో వివాహం జరిగి ఏడాది పూర్తయిన సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీలో అజయ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తాడు. ఆ కేసును పోలీస్ అధికారి రాజీవ్ (వంశీ కోటు) దర్యాప్తు మొదలుపెడుతాడు.

పెళ్లైన కొత్తలో రూప, అజయ్ మధ్య విభేదాలు ఎందుకు నెలకొన్నాయి? వారిద్దరి మధ్య తగాదాలకు కారణమేమిటి? అజయ్ మరణం తర్వాత కస్టడీలోకి తీసుకొన్న రూపను రాజీవ్ ఎలా విచారించాడు? పోలీసుల కస్టడీలో అజయ్ మరణం వెనుక ఉన్న కారణాలు రాజీవ్ రాబట్టాడా? అజయ్ ఆత్మహత్య చేసుకొన్నాడా? లేదా రూప హత్య చేసిందా? అజయ్ మరణానికి అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ది ట్రయల్ సినిమా కథ.

క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో సింపుల్‌ పాయింట్ దర్శకుడు రామ్ గన్నీ రాసుకొన్న కథ.. క్యూరియాసిటిని పెంచేలా డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే ఒక బలం కాగా, మూడు క్యారెక్టర్లతో సినిమాను నడిపించిన విధానం మరో బలంగా మారిందని చెప్పవచ్చు.కేవలం మూడు పాత్రల మధ్య జరిగే డ్రామాను గ్రిప్పింగ్‌గా చెప్పడంలో రామ్ గన్నీ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

కథలో ఉండే సైకాలజీ డిజార్డర్‌ను బలంగా ఎస్టాబ్లిష్ చేయడంలో తడబాటు కనిపించింది. కథకు బలంగా మారిన డిజార్డర్ పాయింట్‌ను హడావిడిగా గ్రాఫిక్స్‌తో కాకుండా పాత్రలతో చెప్పించి ఉంటే కొంత ఎమోషనల్ కంటెంట్ యాడ్ అయ్యే అవకాశం ఉండేదనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు వరకు కొనసాగించిన ట్విస్టులు ఆ లోపాన్ని కప్పిపుచ్చేలా చేశాయి.

ఇక నటీనటులు విషయానికి వస్తే.. రూప పాత్రలో స్పందన పల్లి చూపించిన వేరియేషన్స్ చాలా బాగున్నాయి. చిన్న చిన్న హావభావాలు ప్రదర్శించిన విధానం ఆకట్టుకొనేలా ఉన్నాయి. రూప పాత్రలో ఒదిగిపోయిన విధానం బాగుంది. సినిమా భారాన్నంత రాజీవ్‌తో కలిసి రూప పంచుకొన్నది. రూప, రాజీవ్ మధ్య సన్నివేశాలు చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో కథ పట్టు సడలకుండా సాగింది. ఇక అజయ్ పాత్ర పరిధి మేరకు యుగ్ రామ్ రాణించారు. వంశీ, యుగ్ రామ్, రూప యాక్టింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయని చెప్పవచ్చు.

ది ట్రయల్ సినిమాకు సాంకేతిక అంశాలు బలంగా మారాయి. శరవణ వాసుదేవన్ మ్యూజిక్, రీ రికార్డింగ్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. పూర్తిగా ఇండోర్‌ లొకేషన్లలో సీన్లను చిత్రీకరించిన తీరు శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫి బాగుంది, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. చాలా తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీతో సినిమాను అందించిన తీరు నిర్మాతలు స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడకు సినిమాపై ఉన్న అభిరుచిని తెలియజెప్పాయి.

క్రైమ్, సస్పెన్స్ జానర్‌తో సాగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌‌ ది ట్రయల్. దర్శకుడు రాసుకొన్న బలమైన సన్నివేశాలు, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్లస్ పాయింట్. స్పందన, యుగ్ రామ్, వంశీ తమ నటనతో కథను నడిపించిన విధానం వారి ప్రతిభకు అద్దం పట్టింది. అందరూ కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా సన్నివేశాలను పండిచారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాను ఇష్టపడేవారికి ది ట్రయల్ నచ్చుతుంది. ట్విస్టులు సినిమాపై క్యూరియాసిటిని పెంచుతాయి. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. ఈ వారం చూడటానికి అవకాశం ఉన్న సినిమాల జాబితాలో ఈ మూవీని చేర్చుకోవచ్చు.

రేటింగ్ : 3/5

]]>
https://telugu.cinebullet.com/the-trial-movie-review-an-interesting-investigative-thriller-2/feed/ 0
ది ట్రయల్ మూవీ రివ్యూ : ఆసక్తికరమైన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ https://telugu.cinebullet.com/the-trial-movie-review-an-interesting-investigative-thriller/ https://telugu.cinebullet.com/the-trial-movie-review-an-interesting-investigative-thriller/#respond Thu, 23 Nov 2023 09:10:14 +0000 https://telugu.cinebullet.com/?p=3720 మూవీ : ది ట్రయల్

రిలీజ్ డేట్ : 2023-11-24

నటీనటులు : స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు, ఉదయ్ పులిమే, సాక్షి ఉత్తాడ, జస్వంత్ పెరుమాళ్ల తదితరులు

కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం : రామ్ గన్ని

నిర్మాతలు : స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడ

సినిమాటోగ్రఫీ : శ్రీ సాయికుమార్ దారా

ఎడిటర్ : శ్రీకాంత్ పట్నాయక్ ఆర్

మ్యూజిక్ : శరవణ వాసుదేవన్

బ్యానర్స్ : ఎస్ఎస్ ఫిలింస్, కామన్ మ్యాన్ ప్రొడక్షన్స్

సహ నిర్మాత : సుదర్శన్ రెడ్డి

కథ :

పోలీస్ ఇన్స్‌పెక్టర్ రూప (స్పందన పల్లి), సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అజయ్ (యుగ్ రామ్) పెళ్లి జరుగుతుంది. అయితే ఇద్దరి భావాలు, అభిప్రాయాలు కలవకపోవడం వల్ల వారి మధ్య తగాదాలు, అలకలు చోటు చేసుకొంటుంటాయి. ఈ క్రమంలో రూప ప్రెగ్నెంట్ అని తెలియడంతో అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి చేస్తాడు. ఆ క్రమంలో వివాహం జరిగి ఏడాది పూర్తయిన సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీలో అజయ్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణిస్తాడు. ఆ కేసును పోలీస్ అధికారి రాజీవ్ (వంశీ కోటు) దర్యాప్తు మొదలుపెడుతాడు.

పెళ్లైన కొత్తలో రూప, అజయ్ మధ్య విభేదాలు ఎందుకు నెలకొన్నాయి? వారిద్దరి మధ్య తగాదాలకు కారణమేమిటి? అజయ్ మరణం తర్వాత కస్టడీలోకి తీసుకొన్న రూపను రాజీవ్ ఎలా విచారించాడు? పోలీసుల కస్టడీలో అజయ్ మరణం వెనుక ఉన్న కారణాలు రాజీవ్ రాబట్టాడా? అజయ్ ఆత్మహత్య చేసుకొన్నాడా? లేదా రూప హత్య చేసిందా? అజయ్ మరణానికి అసలు కారణం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ది ట్రయల్ సినిమా కథ.

క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ జానర్‌లో సింపుల్‌ పాయింట్ దర్శకుడు రామ్ గన్నీ రాసుకొన్న కథ.. క్యూరియాసిటిని పెంచేలా డిజైన్ చేసిన స్క్రీన్ ప్లే ఒక బలం కాగా, మూడు క్యారెక్టర్లతో సినిమాను నడిపించిన విధానం మరో బలంగా మారిందని చెప్పవచ్చు.కేవలం మూడు పాత్రల మధ్య జరిగే డ్రామాను గ్రిప్పింగ్‌గా చెప్పడంలో రామ్ గన్నీ సక్సెస్ అయ్యాడని చెప్పవచ్చు.

కథలో ఉండే సైకాలజీ డిజార్డర్‌ను బలంగా ఎస్టాబ్లిష్ చేయడంలో తడబాటు కనిపించింది. కథకు బలంగా మారిన డిజార్డర్ పాయింట్‌ను హడావిడిగా గ్రాఫిక్స్‌తో కాకుండా పాత్రలతో చెప్పించి ఉంటే కొంత ఎమోషనల్ కంటెంట్ యాడ్ అయ్యే అవకాశం ఉండేదనిపిస్తుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి ఎండ్ కార్డు వరకు కొనసాగించిన ట్విస్టులు ఆ లోపాన్ని కప్పిపుచ్చేలా చేశాయి.

ఇక నటీనటులు విషయానికి వస్తే.. రూప పాత్రలో స్పందన పల్లి చూపించిన వేరియేషన్స్ చాలా బాగున్నాయి. చిన్న చిన్న హావభావాలు ప్రదర్శించిన విధానం ఆకట్టుకొనేలా ఉన్నాయి. రూప పాత్రలో ఒదిగిపోయిన విధానం బాగుంది. సినిమా భారాన్నంత రాజీవ్‌తో కలిసి రూప పంచుకొన్నది. రూప, రాజీవ్ మధ్య సన్నివేశాలు చాలా గ్రిప్పింగ్‌గా ఉండటంతో కథ పట్టు సడలకుండా సాగింది. ఇక అజయ్ పాత్ర పరిధి మేరకు యుగ్ రామ్ రాణించారు. వంశీ, యుగ్ రామ్, రూప యాక్టింగ్ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా మారాయని చెప్పవచ్చు.

ది ట్రయల్ సినిమాకు సాంకేతిక అంశాలు బలంగా మారాయి. శరవణ వాసుదేవన్ మ్యూజిక్, రీ రికార్డింగ్ సన్నివేశాలను ఎలివేట్ చేసింది. పూర్తిగా ఇండోర్‌ లొకేషన్లలో సీన్లను చిత్రీకరించిన తీరు శ్రీ సాయికుమార్ దారా సినిమాటోగ్రఫి బాగుంది, ఆర్ట్ విభాగాల పనితీరు బాగుంది. చాలా తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీతో సినిమాను అందించిన తీరు నిర్మాతలు స్మృతి సాగి, శ్రీనివాస నాయుడు కిల్లాడకు సినిమాపై ఉన్న అభిరుచిని తెలియజెప్పాయి.

క్రైమ్, సస్పెన్స్ జానర్‌తో సాగే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌‌ ది ట్రయల్. దర్శకుడు రాసుకొన్న బలమైన సన్నివేశాలు, స్క్రీన్ ప్లే ఈ సినిమాకు ప్లస్ పాయింట్. స్పందన, యుగ్ రామ్, వంశీ తమ నటనతో కథను నడిపించిన విధానం వారి ప్రతిభకు అద్దం పట్టింది. అందరూ కొత్తవారైనా అనుభవం ఉన్నవారిలా సన్నివేశాలను పండిచారు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాను ఇష్టపడేవారికి ది ట్రయల్ నచ్చుతుంది. ట్విస్టులు సినిమాపై క్యూరియాసిటిని పెంచుతాయి. థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఉన్న సినిమా. ఈ వారం చూడటానికి అవకాశం ఉన్న సినిమాల జాబితాలో ఈ మూవీని చేర్చుకోవచ్చు.

రేటింగ్ : 3/5

]]>
https://telugu.cinebullet.com/the-trial-movie-review-an-interesting-investigative-thriller/feed/ 0
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్ https://telugu.cinebullet.com/narakasura-movie-review-and-rating/ https://telugu.cinebullet.com/narakasura-movie-review-and-rating/#respond Sat, 04 Nov 2023 06:49:54 +0000 https://telugu.cinebullet.com/?p=3617 సినిమా పేరు : నరకాసుర

నటీనటులు : రక్షిత్ అట్లూరి, అపర్ణ జనార్థన, సంగీతన విపిన్, నాస్సర్, చరణ్ రాజ్, శత్రు, శ్రీమన్ తదితరులు

ఎడిటర్ : చి. వంశీ కృష్ణ

ఛాయాగ్రహణం : నాని చమిడ్శెట్టి

సంగీతం : నఫల్ రాజా

నిర్మాతలు : డాక్టర్ శ్రీనివాస్, కరుమూరు రాఘు

రచన మరియు దర్శకత్వం : సెబాస్టియన్ నోవా అకోస్ట జూనియర్ (సెబి జూనియర్)

కథ : శివ (రక్షిత్ అట్లూరి) ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దుల్లోని కాఫీ ఎస్టేట్‌లో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. శివని అతని మరదలు వీరమణి చిన్నతనం నుంచి ప్రేమిస్తుంది. కానీ శివ ఎస్టేట్ యజమాని మీనాక్షి (అపర్ణ జనార్దన్) తో ప్రేమలో పడతాడు. అతని మంచితనం చూసి మీనాక్షి కూడా అతనితో ప్రేమలో పడుతుంది. ఆ ప్రాంత ఎమ్మెల్యే వీరి నాయుడు (చరణ్ రాజ్) మీనాక్షి శివ పెళ్లి జరిపిస్తాడు. కొన్ని రోజుల తర్వాత శివ అదృశ్యమయ్యాడు. మరోవైపు మీనాక్షి ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుంది. కొంతమంది హిజ్రాలు ఆమె ప్రాణాలను ఫణంగా పెట్టి కాపాడతారు. ఆమె ను చంపాలనే కుట్ర వెనుక ఎవరున్నారు? శివ ఏమయ్యాడు? అనేదే ఈ సినిమా కథ.

విశ్లేషణ :

ఈ సినిమా కోసం ఎంచుకున్న కథ అద్భుతంగా ఉంది. కానీ కథనం కాస్త గందరగోళంగా ఉంది. ముఖ్యంగా మొదటి అరగంట దర్శకుడు చాలా బాగా రాశాడు. శివ, మీనాక్షిలు కేరళకు వెళ్లి హిజ్రాలతో పోరాడి చివరకు వారితో జీవించడము చాలా బాగుంది. కథకు కొత్తదనం తీసుకొచ్చి హిజ్రా కోణంలో యాక్షన్ సన్నివేశాలను చూపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. క్లైమాక్స్ ఫైట్ సంతృప్తికరంగా ఉన్నాయి.

నటన పరంగా రక్షిత్ మరోసారి అద్భుతంగా నటించాడు. ఇద్దరు హీరోయిన్లు కూడా చాలా సహజంగా, నేర్పుగా నటించారు. ఎట్టకేలకు చాలా కాలం తర్వాత మంచి పాత్ర లభించడంతో చరణ్ రాజ్ హిజ్రా పాత్ర లో మెరిశాడు. నాజర్ ఇతర నటీనటులు కూడా తమ పాత్రలను చక్కగా పోషించారు.

టెక్నికల్‌గా ఈ సినిమా పలు అంశాల్లో ఆకట్టుకుంది. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ బాగుంది, అలాగే నఫల్ రాజా పాటలు మరియు నేపథ్య సంగీతం కూడా బాగుంది. ఎడిటింగ్‌, కాస్ట్యూమ్స్‌ కూడా బాగున్నాయి. యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి, నిర్మాణ విలువలు ఆకట్టుకున్నాయి.

ఈ సినిమా తో సెబాస్టియన్‌కు దర్శకుడిగా పరిచయమవుతున్నప్పటికీ, చిత్ర నిర్మాణానికి సంబంధించిన అన్ని అంశాల గురించి అతనికి లోతైన అవగాహన ఉందని స్పష్టమవుతుంది. ఎంచుకున్న కథ బాగున్నప్పటికీ, స్క్రిప్ట్‌ని ఇంకా మెరుగుపరుచుకోవచ్చు. మొత్తానికి సెబాస్టియన్ మాత్రం ఓ మంచి సినిమా తీయడానికి చాలా కష్టపడ్డాడు.

ప్లస్ పాయింట్లు :

సంగీతం

సినిమాటోగ్రఫీ

ఫైట్స్

కథ

హీరో రక్షిత్

మైనస్ పాయింట్లు:

మొదటి భాగం

స్క్రీన్ ప్లే

తీర్పు :

ఇతరుల పట్ల దయ మరియు కరుణతో ఎలా ప్రవర్తించాలనే దాని గురించి చెప్తూ ఒక బలమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ సినిమా తప్పకుండా సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఆకర్షణీయమైన కథనం మరియు ప్రభావవంతమైన నటన వెరసి ఈ సినిమా కి మంచి ఆదరణ లభించడం ఖాయం.

రేటింగ్ : 3/5

]]>
https://telugu.cinebullet.com/narakasura-movie-review-and-rating/feed/ 0
‘రామన్న యూత్’ మూవీ రివ్యూ – కామెడీ ఎంటర్టైనర్ https://telugu.cinebullet.com/ramanna-youth-movie-review-comedy-entertainer/ https://telugu.cinebullet.com/ramanna-youth-movie-review-comedy-entertainer/#respond Fri, 15 Sep 2023 12:57:57 +0000 https://telugu.cinebullet.com/?p=3102 సినిమా : ‘.రామన్న యూత్’

బ్యానర్ : ఫైర్ ఫ్లై ఆర్ట్స్

రివ్యూ రేటింగ్ : 3/5

విడుదల తేదీ : 15.09.2023

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – శివ ఎంఎస్. కే

రచన దర్శకత్వం – అభయ్ బేతిగంటి.

సంగీతం – కమ్రాన్ ,

సినిమాటోగ్రఫీ – ఫహాద్ అబ్దుల్ మజీద్

నటీనటులు : అభయ్ నవీన్, అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు, టాక్సీ వాలా విష్ణు, అమూల్య రెడ్డి, కొమ్మిడి విశ్వేశ్వర్ రెడ్డి, జగన్ యోగిరాజు, బన్నీ అభిరాన్, మాన్య భాస్కర్, వేణు పొలసాని తదితరులు

కాస్ట్యూమ్ డిజైనర్ – అశ్వంత్ బైరి,

సౌండ్ డిజైన్ – నాగార్జున తాళ్లపల్లి,

ఎడిటర్ – రూపక్ రొనాల్డ్ సన్, అభయ్,

ఆర్ట్ – లక్ష్మీ సింధూజ,

పీఆర్వో – జీఎస్కే మీడియా

బలగం వంటి సహజమైన నేటివ్ కథలు ఆదరణ పొందుతున్న నేపథ్యంలో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పొలిటికల్ ఎంటర్ టైనర్ “రామన్న యూత్”. టాలెంటెడ్ యంగ్ యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. అనిల్ గీల, శ్రీకాంత్ అయ్యంగార్, తాగుబోతు రమేష్, రోహిణి జబర్దస్త్, యాదమ్మ రాజు నటీ నటులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని సెప్టెంబర్ 15 న గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “రామన్న యూత్” సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం పదండి.

కథ:

ఒక యువకుడు రాజకీయ నాయకుడిగా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయి అనేది “రామన్న యూత్.”. సిద్దిపేట్‌ నియోజక వర్గం పరిధిలోని ఆంక్షాపూర్‌ గ్రామంలో ఉండే రాజు (అభయ్) పొలిటికల్ లీడర్‌గా ఎదగాలని కలలు కంటుంటాడు. అదే

నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే రంగుల రామన్న (శ్రీకాంత్ అయ్యంగార్‌) అంటే పిచ్చి.. గ్రామ పెద్దగా ఉండే అనిల్ (తాగుబోతు రమేష్)ను స్పూర్తిగా తీసుకొని దసరా పండుగ సందర్బంగా తన దోస్తులు పండు (జగన్ యోగిబాబు), రమేష్ (బన్నీ అభిరామ్ ), బాలు (అనిల్ గీలా) లతో కలసి రామన్న యూత్ అసోసియేషన్‌ను పెట్టి తనే లీడర్ అని ప్రకటించుకొనెలా ఫ్లెక్సీ పెడుతాడు. దాంతో తన అన్న ఫోటో లేకుండా ఫ్లెక్సీ కట్టారనే కోపంతో అనిల్ తమ్ముడు మహిపాల్ (విష్ణు) రాజు ఫ్రెండ్స్ తో గొడవపడతాడు. ఆ గొడవలో రామన్న బాగా తెలుసు మా డాడీ దుబాయ్ లో ఉండాడని కూడా రామన్నకు తెలుసని రాజు అంటాడు . మా అన్న సపోర్ట్ లేకుండా రామన్నను కలవలేరని ఛాలెంజ్ విసురుతాడు మహిపాల్ ఛాలెంజ్ ను ప్రిస్టేజ్ గా తీసుకున్న రాజు ఫ్రెండ్స్ సిద్దిపేటలో ఉన్న రామన్న ను కలవడానికి బయలుదేరుతారు. ఆలా వెళ్లిన వీరు రామన్నను కలిశారా? రామన్న కోసం వెళ్లిన వీరు హైదరాబాద్ కు ఎందుకు వెళ్లారు? రామన్నను కలుసుకొనే క్రమంలో వీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? చివరకు రామన్న ను కలసి తన ఛాలెంజ్ నిరూపించుకున్నారా? చివరకు లీడర్‌గా ఎదిగాలన్న రాజు కల నెరవేరిందా? అనేది తెలుసుకోవాలి అంటే “రామన్న యూత్” సినిమా చూడాల్సందే.

నటీ నటుల పనితీరు

యూత్ లీడర్ గా ఎదగాలని కలలు కనే రాజు పాత్రలో నటించిన అభయ్ , పండు, రమేష్, బాలులతో కలసి ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్‌తో కామెడీ ట్రాక్‌తో మెప్పించారనే చెప్పాలి. ప్రతి సినిమాలో తాగుబోతు క్యారెక్టర్ లో కనిపించే రమేష్..విలేజ్ పొలిటికల్ లీడర్ గా ఓ డిఫరెంట్ క్యారెక్టర్‌ లో నటించి మెప్పించాడు. మాజీ యం. యల్. ఏ పాత్రలో . శ్రీకాంత్ అయ్యంగార్ బాగా నటించాడు. సినిమాకు కీలకమైన క్యారెక్టర్‌గా మారిన పాత్రలో విష్ణు, ఉన్న కాసేపు యాదమ్మ రాజు నవ్వించిన తీరు బాగుంది. రాజు ఫ్రెండ్స్ కు ఫాదర్స్ గా నటించిన ఆనంద చక్రపాణి, విష్ణు,వేణు పొలసాని తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. రీల్స్ చేసే గృహిణిగా జబర్దస్త్ రోహిణి కనిపించినప్పుడల్లా నవ్వించారు.ఇంకా ఈ చిత్రంలో నటించిన వారందరూ కొత్తవారైనా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారని చెప్పవచ్చు..

సాంకేతిక నిపుణుల పనితీరు

ఒక యువకుడు రాజకీయ నాయకుడిగా ఎదగాలని చేసే ప్రయత్నాలు ఎలాంటి మలుపులు తిరిగాయనే కథను రాసుకొని దానికి తెలంగాణ యాస భాషతో వుండే పాత్రలతో పాటు ఎమోషనల్ పాయింట్‌తో కనెక్ట్ చేసి డానికి కామెడీ సీన్స్ జోడించి తెరకెక్కించడంలో అభయ్ నవీన్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సంగీత దర్శకుడు కమ్రాన్ అందించిన సంగీతం బాగుంది ఫహాద్ అబ్దుల్ మజీద్ అందిచింన సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. ఆహ్లదపరిచే సంభాషణల ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. రూపక్ రొనాల్డ్ సన్, అభయ్, ఎడిటింగ్ పనితీరు బాగుంది. ఫైర్ ఫ్లై ఆర్ట్స్ పతాకంపై ఖర్చుకు వెనుకాడకుండా అన్ని వర్గాల వారికి నచ్చే ఎలిమెంట్స్ తో నిర్మించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. కామెడీ , ఎమోషన్ వాల్యూస్ లతో యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన “రామన్న యూత్” సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ కచ్చితంగా నచ్చుతుంది

Telugu.Cinebullet.Com Review Rating – 3/5

]]>
https://telugu.cinebullet.com/ramanna-youth-movie-review-comedy-entertainer/feed/ 0
‘మిస్టర్ ప్రెగ్నెంట్’ రివ్యూ – అమ్మతనం గురించి ఎంతో గొప్పగా వర్ణించే ఒక కుటుంబ కథా చిత్రం https://telugu.cinebullet.com/mr-pregnant-review-a-family-drama-that-portrays-motherhood-very-well/ https://telugu.cinebullet.com/mr-pregnant-review-a-family-drama-that-portrays-motherhood-very-well/#respond Fri, 18 Aug 2023 09:09:38 +0000 https://telugu.cinebullet.com/?p=2789 మూవీ : మిస్టర్ ప్రెగ్నెంట్

రిలీజ్ డేట్ : 18/08/23

డైరెక్టర్ : శ్రీనివాస్ వింజనంపాటి

నిర్మాతలు :అప్పి రెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల, వెంకట్ అన్నపరెడ్డి.

నటీ నటులు : సొహైల్, రూపా కొడువయుర్, సుహాసినీ మణిరత్నం, రాజా రవీంద్ర, బ్రహ్మాజీ, అలీ, హర్ష, స్వప్నిక, అభిషేక్ రెడ్డి బొబ్బల తదితరులు

సంగీతం : శ్రావణ్ భరద్వాజ్

బిగ్ బాస్ ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న సయ్యద్ సోహైల్‌ ర్యాన్‌… ప్రస్తుతం హీరోగా రాణించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకుముందు అతని నుంచి వచ్చిన రెండు సినిమాలు పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో అబ్బాయిల ప్రెగ్నెన్సీ అనే ఒక సరికొత్త కాన్సెప్ట్ తో మిస్టర్ ప్రెగ్నెంట్ అనే సినిమాలో నటించాడు.

వినడానికి వింతగా ఉన్న.. అసంభవమైన ఈ కాన్సెప్ట్ ఒక సరికొత్త ప్రయోగం అని చెప్పవచ్చు.రూపా కొడువయుర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి శ్రీనివాస్ వింజనంపాటి డైరెక్షన్ వహించారు. ఈరోజు విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో తెలుసుకుందాం..

కథ :

ఇది మూవీలో హీరో గౌతమ్(సోహైల్‌) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో ఒంటరిగా పెరిగి పెద్దవాడవుతాడు. టాటూ ఆర్టిస్టుగా ఫేమస్ అయిన ఇతను అంటే మహి కి చాలా ప్రేమ. గౌతమ్ అమ్మాయిని పట్టించుకోకపోయినా వదలకుండా వెంటపడుతూనే ఉంటుంది. ఫైనల్ గా ఆమెతో పెళ్లికి ఒప్పుకున్న గౌతం పెళ్లి చేసుకోవడానికి ఒక కండిషన్ పెడతాడు.

పిల్లలు అంటే తనకు నచ్చదు కాబట్టి లైఫ్ లో పిల్లలు వద్దు అని ఒప్పుకుంటేనే పెళ్లి చేసుకుంటాను అని అంటాడు. మహి కూడా అందుకు ఒకే చెప్పడంతో ఇద్దరు పెళ్లి చేసుకుని ఎంతో హ్యాపీగా గడుపుతారు. ఈ నేపథ్యంలో సడన్గా మహి ప్రెగ్నెంట్ అవుతుంది.. ఇక ఆ తరువాత వీళ్ళ లైఫ్ లో ఒక పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. దీనికి గౌతమ్ రియాక్షన్ ఏమిటి? అసలు గౌతం మిస్టర్ ప్రెగ్నెంట్ ఎలా అయ్యాడు? సమాజానికి ఈ మూవీ కన్వెజ్ చేయాలి అనుకున్న మెసేజ్ ఏమిటి? తెలుసుకోవాలి అంటే మాత్రం ఈ చిత్రాన్ని స్క్రీన్ పై చూడాల్సిందే.

విశ్లేషణ :

మూవీ కాన్సెప్ట్ సరికొత్తగా ఉన్నప్పటికీ కాస్త కాంట్రవర్షల్ అనే అనవచ్చు. కంటెంట్ కనెక్ట్ అయితే చిన్న సినిమాని కూడా ఓ రేంజ్ హిట్ చేసే ప్రేక్షకులు ఉన్న సమయం కాబట్టి క్రేజీ కాన్సెప్ట్ తో సినిమాలు తీయడానికి డైరెక్టర్ ముందుకు వస్తున్నారు. ఇలా వచ్చినదే మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీ. ఇది నిజంగా ప్రయోగాత్మకమైన చిత్రం. అసలు అబ్బాయి ప్రెగ్నెంట్ అవ్వడం అనే కాన్సెప్ట్ ఏమిటో తెలుసుకోవడానికి అయినా ఈ మూవీ ని చూడడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తారు.

డైరెక్టర్ కొత్త వాడైనా కానీ కత్తి మీద సామి లాంటి ఈ స్టోరీని ఎంతో కన్వెన్సీంగా తెరకెక్కించారు అని చెప్పవచ్చు. ఎక్కడ ఎలాంటి కన్ఫ్యూషన్ లేకుండా ప్రతి విషయం ఎంతో క్లారిటీగా అందరికీ అర్థమయ్యే విధంగా మూవీ ని తీశారు. మామూలుగా ఇలాంటి కాన్సెప్ట్ తో తీసిన సినిమాలు అయితే చాలా సీరియస్ గా ఉంటాయి లేకపోతే పిచ్చ కామెడీగా ఉంటాయి. కానీ ఈ చిత్రంలో అన్ని రుచులు సమపాళ్లల్లో కలిసాయి. కామెడీ ,లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్, సెంటిమెంట్, ప్రెగ్నెంట్ వుమన్ పడే పెయిన్స్ అన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు.

ప్లస్ పాయింట్స్ :

ఈ మూవీలో బ్రహ్మాజీ ఎపిసోడ్లో కామెడీ మాత్రం ఓ రేంజ్ లో ఉంది.

అమ్మతనం గురించి హీరో చెప్పే డైలాగ్స్ ఖచ్చితంగా థియేటర్లో ప్రేక్షకులను టచ్ చేస్తాయి

ఈ మూవీలో గౌతమ్ పాత్ర సోహైల్‌ కెరియర్ లోనే గుర్తుండిపోయే ఒక మైలురాయి.

ఎక్కడ వల్గారిటీ లేకుండా ఎంతో క్లియర్ గా ఉన్న ఈ చిత్రం ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ.

మైనస్ పాయింట్స్ :

మూవీలో హీరో పడే తపన ఇంకా స్ట్రాంగ్ గా చూపిస్తే బాగుండేది.

ఫస్ట్ హాఫ్ కాస్త రెగ్యులర్గా సాగినట్లు అనిపిస్తుంది.

చివరి మాట :

కుటుంబ కథా చిత్రం కుటుంబ సమేతంగా అందరూ చూడాల్సిన చిత్రం ‘మిస్టర్ ప్రెగ్నెంట్’

రేటింగ్‌ : 3

]]>
https://telugu.cinebullet.com/mr-pregnant-review-a-family-drama-that-portrays-motherhood-very-well/feed/ 0
దయా వెబ్ సిరీస్ రివ్యూ – ఆకట్టుకునే థ్రిల్లర్ వెబ్ సిరీస్ https://telugu.cinebullet.com/dayaa-web-series-review-an-engagging-thriller-web-series/ https://telugu.cinebullet.com/dayaa-web-series-review-an-engagging-thriller-web-series/#respond Fri, 04 Aug 2023 14:10:03 +0000 https://telugu.cinebullet.com/?p=2674 వెబ్ సిరీస్ : దయా వెబ్ సిరీస్

నటీనటులు : జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, నంబీషన్ రమ్య, కమల్ కామరాజ్, జోష్ రవి తదితరులు

టెక్నీకల్ టీమ్

సినిమాటోగ్రఫీ : వివేక్ కాలేపు

సంగీతం : శ్రావణ్ భరద్వాజ్,

ఎడిటింగ్ : విప్లవ్,

నిర్మాణ సంస్థ : ఎస్ వీఎఫ్,

నిర్మాతలు : శ్రీకాంత్ మొహతా, మహేంద్ర సోని

రచన దర్శకత్వం : పవన్ సాధినేని

ట్రైలర్ తో అందరి దృష్టిని ఆకర్షించిన వెబ్ సిరీస్ దయా. ఈ వెబ్ సిరీస్ కు చేసిన ప్రమోషన్ కూడా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అటు సోషల్ మీడియాలోనూ దయా కంటెంట్ వైరల్ అయ్యింది. వెయిటింగ్ కు పుల్ స్టాప్ పెడుతూ దయా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో రివ్యూలో చూద్దాం

కథేంటంటే :

దయా (జేడీ చక్రవర్తి) ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్. మహాప్రస్థానానికి చనిపోయిన వారిని తీసుకెళ్తుంటాడు. అతనికి భార్య అలివేలు (ఈషా రెబ్బా) ఉంటుంది. ఆమె ప్రెగ్నంట్. ఒక రోజు దయా ఫ్రీజర్ వ్యాన్ లో డెడ్ బాడీ దొరుకుతుంది. ఇది చూసి షాక్ కు గురైన దయా…ఈ పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేయాలో తెలియక తన అసిస్టెంట్ ప్రభ (జోష్ రవి ) హెల్ప్ తీసుకుంటాడు. ఆ బాడీ ప్రముఖ జర్నలిస్ట్ కవితది అని వారికి తెలుస్తుంది. ఆ పరిస్థితుల్లో దయా ఏం చేశాడు. ఈ ఇన్సిడెంట్ అతని జీవితాన్ని ఎలా మార్చేసింది అనేది మిగిలిన కథ.

రివ్యూ :

దయా వెబ్ సిరీస్ ప్రారంభం నుంచి ఒక క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ సాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగే దయా జీవితంలో అనూహ్యంగా వచ్చి పడే ఈ సంఘటన కల్లోల్లాన్ని రేపుతుంది. ఎపిసోడ్స్ పెరుగుతూ ఉంటే కథలోని థ్రిల్ కూడా పెరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ లోని ప్రత్యేకత, బలం ఏంటంటే…ప్రతి పాత్రను యూనిక్ గా డిజైన్ చేశారు. జేడీ చక్రవర్తి, ఈషా రెబ్బా, కమల్ కామరాజు, రమ్య నంబీశన్, జోష్ రవి..ఇలా ప్రతి ఒక్క పాత్ర కథలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఏం జరిగి ఉంటుంది అనేది ప్రేక్షకుల ఊహకు అందకుండా సాగుతుంది.

ఒక పర్పెక్ట్ థ్రిల్లర్ సినిమాకు కావాల్సినంత బలమైన కథను దర్శకుడు పవన్ రాసుకున్నాడు. నటీనటుల్లో జేడీ చక్రవర్తి సహా ప్రతి ఒక్కరి పర్ ఫార్మెన్స్ ఆకట్టుకుంటుంది. పవన్ దయా కథకు రాసుకున్న స్క్రీన్ ప్లే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్ ఎక్స్ లెంట్ గా ఉంది.

సెకండ్ సీజన్ కు కావాల్సినంత విషయాన్ని మిగిల్చే ఉంచారు. దయా సెకండ్ సీజన్ ఇంకెంత బాగుంటుందో అనేది ఫస్ట్ సీజన్ చూసిన వాళ్లు ఊహించుకోవచ్చు. వివేక్ సినిమాటోగ్రఫీ, శ్రావణ్ భరద్వాజ్ సంగీతం దయా వెబ్ సిరీస్ కు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. జేడీ చక్రవర్తి డిజిటల్ డెబ్యూ సూపర్ హిట్టయ్యింది. ఇక దర్శకుడు పవన్ మరోసారి తన టాలెంట్ ను దయాతో ప్రూవ్ చేసుకున్నారు. మంచి మంచి వెబ్ సిరీస్ లు అందిస్తున్న హాట్ స్టార్ లో దయా మరో సూపర్ హిట్ వెబ్ సిరీస్ గా మారే అవకాశాలున్నాయి.

రేటింగ్ : 3.25/5

]]>
https://telugu.cinebullet.com/dayaa-web-series-review-an-engagging-thriller-web-series/feed/ 0
స్లమ్‌డాగ్ హస్బెండ్ సినిమా రివ్యూ – కుటుంబాని అలరించే చిత్రం https://telugu.cinebullet.com/slumdog-husband-movie-review-a-family-entertainer/ https://telugu.cinebullet.com/slumdog-husband-movie-review-a-family-entertainer/#respond Sat, 29 Jul 2023 11:42:30 +0000 https://telugu.cinebullet.com/?p=2615 సినిమా : స్లమ్‌డాగ్ హస్బెండ్

విడుదల తేదీ : జూలై 29, 2023

నటీనటులు : సంజయ్ రావ్, ప్రణవి మనుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి, రఘు కారుమంచి, యాదమ్మ రాజు, మురళీధర్ గౌడ్

దర్శకుడు : ఏఆర్ శ్రీధర్

నిర్మాతలు : అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి

సంగీతం : భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ : శ్రీనివాస్ జె రెడ్డి

ఎడిటర్ : ఎ వైష్ణవ్ వాసు

“పిట్ట కథ” సినిమాతో తెరంగేట్రం చేసిన సంజయ్ రావు కథానాయకుడిగా నటిస్తున్న సినిమా “స్లమ్‌డాగ్ హస్బెండ్” (Slumdog Husband) ఔట్ అండ్ ఔట్ కామెడీ ఫ్లిక్ గా రూపొందిన ఈ సినిమా బ్రహ్మాజీ, సప్తగిరి, ‘ఫిష్’ వెంకట్, మురళీధర్ గౌడ్, వేణు పొలసాని తదితరులు కీలక పాత్రల్లో కనిపించగా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజే విడుదలయిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

లచ్చి అలియాస్ లక్ష్మణ్ (సంజయ్ రావ్) ఓ బస్తి లో నివసించే కుర్రాడు. మౌనిక (ప్రణవి మానుకొండ)తో ప్రేమలో ఉంటాడు. ప్రేమలో ఉండే ఇబ్బందులు పడలేక వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే జాతకరీత్యా లక్ష్మణ్ ముందుగా ఓ కుక్కతో వివాహం చేసుకోవాలని పంతులు చెబుతాడు. అయన చెప్పిన విధంగా ఓ కుక్కని పెళ్లి చేసుకుంటాడు. ఇక తర్వాత తమ పెళ్లి అని సంతోషంలో రెడీ అవుతున్న ఇద్దరికీ సడెన్ గా ఓ షాక్ తగులుతుంది. ఆ పరిస్థితులలో వారు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు అనేదే సినిమా కథ.

నటీనటులు : సంజయ్‌రావు నటన బాగుంది. ఇంతకుముందు సినిమాలు, సీరియళ్లలో రోల్స్ చేసిన ప్రణవి ఈసారి భిన్నంగా కనిపించింది. గ్లామర్ పెద్దగా చూపించకపోయినా కేవలం ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది, కొన్ని సీన్స్ లో మసాలా డోస్ పెంచి అందరిని అలరించింది. ఆమెకు మరిన్ని అవకాశాలు రావచ్చు. ఈ సినిమాలో యాదమ్మ రాజు మరో సర్ ప్రైజ్. మంచి కామెడీని అందించడమే కాకుండా, ఎండింగ్ లో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. కుక్క యజమానిగా వేణు పొలసాని కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. సప్తగిరి మరియు బ్రహ్మాజీ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. రఘు కారుమంచి, మురళీధర్ గౌడ్ తదితరులు రెగ్యులర్ పాత్రల్లో నటించగా తమ పాత్ర పరిధిమేరకు బాగా ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు : దర్శకుడిగా పరిచయం అయిన ఏఆర్ శ్రీధర్ రాసుకున్న కాన్సెప్ట్ బాగుంది. చికిత్సలో తక్కువ హాస్య పంక్తులు ఉన్నాయి. రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించడంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మాస్ పల్స్ ఆయన ఆధ్వర్యంలోనే ఉంటుంది. బీమ్ యొక్క “సిసెరోరియో” పాట చిత్రానికి ఘనతనిస్తుంది. అతను “మౌనికా ఓ మై డార్లింగ్” తరహాలో “మేరే చోటా దిల్” అనే రెట్రో పాటను కంపోజ్ చేశాడు. వీడియో పాటలు విడుదలైన తర్వాత వైరల్‌గా మారవచ్చు. “లచ్చి గాని పెళ్లి” పాట కూడా చెడ్డది కాదు. కాసర్ల శ్యామ్ మరియు సురేష్ గంగుల ప్రసిద్ధ పాటలు రాశారు. నేపథ్య సంగీతం ఓకే. నిర్మాత అప్పిరెడ్డి ఇప్పటికే కథ కోసం ఖర్చు పెట్టాడు. ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

కథ

నటీనటులు

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడా స్క్రీన్ ప్లే వీక్ గా ఉండడం

స్లో నేరేషన్

కుక్కను పెళ్లి చేసుకోవడం వల్ల హీరోకు ఎదురయ్యే ఇబ్బందులు, దాన్నుంచి బయటపడేందుకు ఏం చేస్తాడు, అతని జీవితం ఎంత గందరగోళానికి గురైంది అనే అంశాల నేపథ్యంలో చిత్ర దర్శకుడు ఏఆర్ శ్రీధర్ దీనిని హాస్యభరితంగా తీర్చిదిద్దారు. మంచి కామెడీ సినిమా.. బీసీ సెంటర్స్ లో ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కావడం ఖాయం.

రేటింగ్ : 3/5

]]>
https://telugu.cinebullet.com/slumdog-husband-movie-review-a-family-entertainer/feed/ 0
అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ – కల్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ https://telugu.cinebullet.com/annapurna-photo-studio-movie-review-cult-family-entertainer/ https://telugu.cinebullet.com/annapurna-photo-studio-movie-review-cult-family-entertainer/#respond Fri, 21 Jul 2023 14:15:36 +0000 https://telugu.cinebullet.com/?p=2543 చిత్రం – అన్నపూర్ణ స్టూడియో

నటీనటులు – చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు

బ్యానర్ – బిగ్ బెన్ సినిమాస్

నిర్మాత – యష్ రంగినేని

దర్శకత్వం – చెందు ముద్దు

చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు (21.7.2023) ఈ సినిమా థియేటర్స్ కి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది… ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా… మంచి వసూళ్లు సాధిస్తుందా తదితర విషయాలను రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.

కథ

1980 ల నేపథ్యం కలిగిన స్టోరీ తో తెరకేకినా సినిమా ఇది. కపిలేశ్వరపురం ఊరికి చెందిన చంటి (చైతన్య రావు) సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి పక్క ఊరికి వెళ్లి ఎత్తైన కొండ మీద నుంచి దూకేస్తాడు. అయితే కొండ మీద నుంచి దూకిన చంటి పోలీసుల జీపు పై పడతాడు. తను రాసుకున్నసూసైడ్ లెటర్ తో పాటు చంటి పోలీసులకు దొరికిపోతాడు. చంటిని హాస్పటల్లో అడ్మిట్ చేసి, సూసైడ్ లెటర్ చదవడం మొదలుపెడతారు. చంటి స్టోరీ లోకి వెళితే…

తన ఊరిలో అన్నపూర్ణ ఫోటో స్టూడియోను రన్ చేస్తుంటాడు చంటి. వయసు మీద పడినా పెళ్లి మాత్రం అవ్వదు. సరిగ్గా అలాంటి టైమ్ లో గౌతమి (లావణ్య) తో ప్రేమలో పడతాడు చంటి. కొన్ని సంఘటనల తర్వాత లావణ్య కూడా చంటిని ప్రేమించడం మొదలుపెడుతుంది. చంటికి ప్రాణ గండం ఉందని తెలుసుకున్న లావణ్య చాలా భయపడుతుంది. ఇలాంటి సమయంలో ఓ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఓ వ్యక్తిని హత్య చేస్తాడు చంటి. ఈ హత్యను ఫోటోలు తీసిన ఓ వ్యక్తి చంటిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ విషయం బయటికి రాకుండా ఉండాలంటే, మరో హత్య చేయాలని ఆ వ్యక్తి చంటిని డిమాండ్ చేస్తాడు.

చంటి ని బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి ఎవరు? హత్యలకు చంటికి లింకేంటీ? చంటి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు? పోలీసులు చంటిక సాయం చేస్తారా తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పెర్ ఫామెన్స్

చైతన్యరావు చంటి పాత్రలో చాలా బాగా నటించాడు. కొన్ని సీన్స్ లో అతని నటన ఆడియన్స్ కి నవ్వులు తెప్పిస్తుంది. న్యాచురల్ పెర్ ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు చైతన్యరావు. హీరోయిన్ గా లావణ్య తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. లుక్స్ బాగున్నాయి. ఉత్తర రెడ్డి, హీరో చెల్లెలు గా నటించిన పద్దు పాత్రలు ఆడియన్స్ కి గుర్తుండి పోతాయి. కానిస్టేబుల్ గా ఇంటూరి వాసు పాత్ర నవ్వులు పూయిస్తుంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక నిర్మాత యష్ రంగినేని ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. ఫస్ట్ సినిమా అయినప్పటికీ, అనుభవం ఉన్న నటుడిలా నటించి మెప్పించారు.

సాంకేతిక వర్గం

ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ చెందు ముద్దు. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో ఫస్ట్ హాఫ్ ని మెప్పించిన చెందు ముద్దు… సెకండాఫ్ విషయంలో ఇంకొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఫోటో స్టూడియో నేపథ్యంలో కథ ఉంటుందని భావిస్తారు. కానీ టైటిల్ కి కథ కు ఎలాంటి సంబంధం లేదు. విజువల్స్ బాగున్నాయి. ప్రిన్స్ హెన్రీ అందించిన సాంగ్స్ బాగున్నాయి. కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చడంతో నిర్మాణపు విలువలు బాగున్నాయి.

ఫిల్మీబజ్ విశ్లేషణ

ఆడియన్స్ నవ్వుకుంటారు. బి,సి సెంటర్ ఆడియన్స్ కి ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కనెక్ట్ అవుతుంది. అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఓవరాల్ గా ఒక్కసారి సినిమా చూడొచ్చు అనే ఫీల్ ని కలిగిస్తుంది. కాబట్టి ఈ వీకెండ్ ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.

రేటింగ్ – 3.5/5

]]>
https://telugu.cinebullet.com/annapurna-photo-studio-movie-review-cult-family-entertainer/feed/ 0