బచ్చలమల్లి మూవీ రివ్యూ అండ్ రేటింగ్!!

కామెడీ హీరోగా అల్లరి నరేష్ అందరికి తెలుసు. అయితే ‘నాంది’ వంటి సినిమాలతో సీరియస్ పాత్రల్లో మెప్పించి కొత్త రూట్ ఎంచుకున్నాడు. ఇప్పుడు ‘బచ్చల మల్లి’లో ఒక గ్రామీణ యువకుడి పాత్రలో విభిన్నంగా కనిపించారు. ఈ సినిమా నరేష్ అభిమానులను మెప్పించిందా లేదా అనేది ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ:

బచ్చలమల్లి (నరేష్) తండ్రిని ఎంతో గౌరవిస్తాడు, కానీ తండ్రి రెండో పెళ్లి చేసుకోవడం అతనికి సహించలేకపోతాడు. ఈ కోపం పగగా మారి, మల్లి తన జీవితాన్ని చెడు అలవాట్లతో నాశనం చేసుకుంటాడు. చదువు మానేసి, మద్యం, పొగ తాగడం మొదలుకుని, మూర్ఖత్వంలో లిమిట్స్ దాటిపోతాడు. అతను కావేరి (అమృత అయ్యర్)ను ప్రేమిస్తాడు. తన చెడు అలవాట్లను మారుస్తున్నట్టు అనిపించినప్పటికీ, మళ్లీ మూర్ఖంగా ప్రవర్తించడం మొదలవుతుంది. అతని జీవితంలో ఈ మార్పుకు కారణం ఏమిటి? మల్లి ఎలా తప్పుడు దారిలోకి వెళ్లాడు? ఈ ప్రశ్నలకు సమాధానం ఈ కథలో ఉంది.

నటీనటులు:

అల్లరి నరేష్ తన కెరీర్‌లో మరో వైవిధ్యమైన పాత్రలో నటించారు. గ్రామీణ యువకుడి పాత్రలో ఆయన సహజంగా కనిపించారు. కొన్ని హార్డ్ హిట్టింగ్ సన్నివేశాలలో ఆయన నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. అమృత అయ్యర్ కూడా తన పాత్రకు న్యాయం చేశారు. రావు రమేష్, బలగం జయరామ్, అచ్యుత్ కుమార్, ప్రవీణ్, హరితేజ, వైవా హర్ష తమ పాత్రలకు సరైన న్యాయం చేశారు. ప్రవీణ్ కొత్త తరహా పాత్రలో నవ్వులు పూయించారు.

సాంకేతికత:

సుబ్బు మంగాదేవి దర్శకునిగా మంచి కథ తో ప్రయత్నించారు. మల్లి పాత్ర ద్వారా కోపం, మూర్ఖత్వం వల్ల కలిగే నష్టాన్ని సందేశాత్మకంగా చాటారు. స్క్రీన్‌ప్లే కట్టుదిట్టంగా ఉండి ఆసక్తిని కలిగిస్తుంది. పీరియాడిక్ కాన్సెప్ట్ కోసం ఊర్లలో చిత్రీకరించిన దృశ్యాలు అందంగా మెరిసాయి. విశాల్ చంద్రశేఖర్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత జోష్ ఇచ్చింది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు రిచ్ గానే ఉన్నాయి.

బలాబలాలు:

‘బచ్చల మల్లి’లో అల్లరి నరేష్ నటన ప్రభావవంతంగా నిలిచింది. కథలో కొన్ని హార్డ్ హిట్టింగ్ ఎపిసోడ్లు ఉన్నాయి. స్క్రీన్‌ప్లేలో కొన్ని సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ప్రీ-క్లైమాక్స్ సీన్ల నుండి పుంజుకుని, మంచి ముగింపును అందించింది చిత్రం.

రేటింగ్: 3/5