జీ5 లో ట్రెండింగ్‌లో ఉన్న ‘అజయ్ గాడు’ సినిమా . మంచి కథ, కథనాలతో అందరికీ చేరువవుతున్న సినిమా

భార‌త‌దేశంలో అత్యంత వేగవంతంగా అభివృద్ధి చూస్తున్న వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్‌గా జీ 5 తనదైన గుర్తింపును సంపాదించుకోవటమే కాకుండా పలు భాషల్లో వైవిధ్యమైన కంటెంట్‌ను అందిస్తూ ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది . ఇప్పటికే పలు చిత్రాలను ఆడియెన్స్‌కు అందించిన జీ 5 ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ మూవీగా ‘అజయ్‌గాడు’ చిత్రాన్ని అందిస్తోంది. ఈ సినిమాను స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో నిర్మించారు అజ‌య్ క‌ర్తుర్వ‌ర్‌. అజ‌య్ కుమార్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రూపొందించారు. చంద‌న కొప్పిశెట్టి సంయుక్తంగా నిర్మించారు. అజయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన ‘అజయ్‌గాడు’ మూవీలో బిగ్ బాస్ తెలుగు ఫేమ్ భానుశ్రీ, రోడీస్ విన్న‌ర్ శ్వేత మెహ‌తా కీలక పాత్రల్లో నటించారు. ప్రాచీ ట‌క్క‌ర్‌, అభ‌య్ బేతిగంటి, జ‌య‌శ్రీగారు, య‌ద్దం రాజు తదితరలు ఇతర పాత్ర‌ల్లో న‌టించి మెప్పించారు.

అజ‌య్ గాడు సినిమా అజ‌య్ అనే వ్య‌క్తికి సంబంధించిన క‌థ‌. మ‌ధ్య‌త‌ర‌గ‌తి కుటుంబానికి చెందిన వ్య‌క్తి అజ‌య్‌. రోజురోజుకీ మారిపోతున్న ప్రపంచాన్ని అర్థం చేసుకోవ‌డానికి, డ‌బ్బు, పేరు, ప్రేమ వంటి వాటిని తెలుసుకోవ‌డానికి ఇబ్బందిప‌డుతుంటాడు. వీట‌న్నిటినీ వ‌దిలేయాల‌నుకున్న అత‌ను ఒకానొక సంద‌ర్భంలో శ్వేత‌ను స్ఫూర్తిగా ప్రేమిస్తాడు. ఆమె డ్ర‌గ్స్‌కి బానిస అయిన మెడికో. అలాంటి ఆమెను సక్రమ మార్గంలో ఉంచటానికి చేసే ప్రయత్నాల్లో బాహ్య ప్ర‌పంచంతో అజ‌య్ ఎలాంటి యుద్ధం సాగించాడ‌నేదే క‌థ‌. ఈ సినిమా జ‌న‌వ‌రి 12 నుంచి జీ5లో ఉచితంగా అందుబాటులో ఉంది.

Ajay Gadu Trailer – https://youtu.be/BED0xBncBlw

ఈ సందర్భంగా అజ‌య్ క‌ర్తుర్వ‌ర్ మాట్లాడుతూ ‘‘ఒక సినిమాలో న‌టిస్తూ, నిర్మాత‌గా, ద‌ర్శ‌కుడిగా ప‌నిచేయ‌డం మామూలు విష‌యం కాదు. చాలా థ్రిల్లింగ్ జ‌ర్నీ ఇది. ఈ ప్రాజెక్టుకు నా మ‌న‌సులో ఎప్పుడూ ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంటుంది. ఈ అద్భుత‌మైన అనుభ‌వాన్ని ప్ర‌తి ఒక్క‌రితోనూ పంచుకోవాల‌ని అనుకుంటున్నాను. సినిమా క‌థ ఎలా ఉంటుందో ట్రైల‌ర్ చూస్తే అర్థ‌మ‌వుతుంది. కానీ సినిమాలో అంత‌కు మించిన విష‌యాలు చాలా ఉంటాయి. స్టంట్స్, ఎమోష‌న్స్, రొమాన్స్ వీట‌న్నిటిని క‌ల‌గ‌లిపి అద్భుతంగా తెర‌కెక్కించాం. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులకు ఈ సినిమాను అందించ‌డ‌మే నా ధ్యేయం. జీ5తో క‌లిసి ఈ సినిమాను విడుద‌ల చేయ‌డానికి చాలా ఆనందంగా ఉంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల‌ను ఒకే రోజు ప‌ల‌క‌రించ‌డానికి జీ5 చ‌క్క‌టి వేదిక అయింది. అజ‌య్‌గాడు సకుటుంబంగా చూడాల్సిన సినిమా. ప్ర‌తి ఒక్క‌రికీ నచ్చే అంశాలు ఇందులో ఉంటాయి. ఈ అద్భుతమైన సినిమాను ప్రేక్ష‌కుల‌తో క‌లిసి ఆస్వాదించాల‌ని అనుకుంటున్నాను’’ అని అన్నారు.

భానుశ్రీ మాట్లాడుతూ ‘‘అజ‌య్ క‌ర్తుర్వ‌ర్‌తో ప‌నిచేయ‌డం అత్య‌ద్భుత‌మైన అనుభవం. తను మంచి కోస్టార్. ఈ సినిమాలో ఆయన పాత్ర, కథనం డిఫరెంట్‌గా ఉంటుంది. అజయ్ తనదైన నటనతో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తారనటంలో సందేహహం లేదు. ఆయ‌న క‌థ చెప్ప‌గానే నాకు న‌చ్చింది. ఈ సినిమాలో నేను ప్రియ అనే పాత్ర‌లో న‌టిస్తున్నాను. స్వేచ్ఛ‌గా ఉండే యువ‌తి పాత్ర అది. త‌న జీవితానికి త‌న‌కు న‌చ్చిన సిద్ధాంతాన్ని అమ‌లు చేసుకునే అమ్మాయి పాత్ర అది. బోల్డ్ రిలేష‌న్‌షిప్స్ ని చూపిస్తూ సాగే, అంద‌మైన ప్రేమ క‌థ ఇది. మూవీలో అజయ్‌తో నా కెమిస్ట్రీ అద్భుతంగా కుదిరింది. ఈ సినిమాను ప్రేక్ష‌కులు జీ5లో ఆస్వాదిస్తార‌ని ఆశిస్తున్నాను` అని అన్నారు.

‘అజయ్‌గాడు’ మూవీ జీ 5లో జనవరి 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది.

జీ5 గురించి:

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.

అజయ్ గాడు’ సినిమా ని Miss అవ్వకుండా free గా చూడండి మీ ZEE5 లో ఎప్పుడైనా, ఎక్కడైనా!

▶️https://zee5.onelink.me/RlQq/uljrqf1f