ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్స్ సంస్థ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌ను యాక్టర్స్ బ్రాంచ్‌లోకి స్వాగతించింది. ఈ సారి ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ చేసిన సందడి, రామ్ చరణ్ మీద వచ్చిన ప్రశంసలు అందరికీ తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా రామ్ చరణ్ పేరు మార్మోగిపోయింది.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ 94వ ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ తన మార్క్ వేసింది. అంతే కాకుండా తన అద్భుతమైన నటనతో రామ్ చరణ్ సైతం ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు ఆయన్ను యాక్టర్స్ బ్రాంచ్‌లోకి తీసుకుని తగిన స్థానాన్ని ఇచ్చారు.
https://www.instagram.com/p/CzHvIyzv7KQ
ఈ మేరకు అకాడమీ సోషల్ మీడియాలో పోస్ట్ వేసింది. ఎంతో అంకితభావంతో ఈ నటులు ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో సినిమాలో వారి నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. వారి కళతో సాధారణ సినిమాతో కూడా ప్రేక్షకులకు అసాధారణ అనుభూతిని కలిగించారు. ప్రేక్షకులకు భావోద్వేగాలు పంచుతూ ప్రశంసలు అందుకుంటున్నారు అంటూ రామ్ చరణ్‌తో పాటు మరి కొంత మంది హాలీవుడ్ నటుల పేర్లను కూడా ప్రకటించింది.
లషానా లించ్, రామ్ చరణ్, విక్కీ క్రీప్స్, లూయిస్ కూ టిన్ లాక్, కీకి పామర్, చాంచ్ చెన్, సకురా అండో, రాబర్ట్ డేవి తదితరుల పేర్లను యాకర్ట్స్ బ్రాంచ్‌లోకి తీసుకుంది.
రామ్ చరణ్ తన పదహారేళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, ఎన్నో గొప్ప పాత్రలను పోషించి ప్రేక్షకుల హృదయాల్లో అభిమానాన్ని సంపాదించుకున్నారు. తాజాగా రామ్ చరణ్‌కు ఈ గౌరవం లభించడంతో ఆయన అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపించిన రామ్ చరణ్.. శంకర్‌తో చేయబోతోన్న ‘గేమ్ చేంజర్’ మరో మైలురాయిగా నిలిచే చిత్రం కానుంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటిస్తోంది.