సమంత ఆరోగ్యం మరింత క్షీణించిందంటూ వార్తలు ఎక్కువవుతున్న వేళా తాజాగా ఆమె టీం దీనిపై స్పందించింది. ఆ వార్తలు పూర్తిగా అవాస్తవమంటూ కొట్టి పడేసింది. సమంత ఆరోగ్యంగా ఉన్నారని, ఇలాంటి తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేసింది.
నిజానికి సమంత ఆరోగ్యంపై ఇలాంటి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు. తాను మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు సామ్ స్వయంగా వెల్లడించిన తర్వాత ఆమె ఆరోగ్యంపై పుకార్లు షికారు చేశాయి.
ఆమె ఆరోగ్యం విషమించిందని, చికిత్స కోసం విదేశాలకు వెళ్తున్నారంటూ సోషల్ మీడియా కోడై కూసింది. అప్పుడు కూడా సమంత ఆ వార్తలకు చెక్ పెట్టారు.