సుక్కు ఇంత టైం తీసుకుంటే ఎలా?

పుష్ప సినిమా తో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకున్న దర్శకుడు సుకుమార్ ఇపుడు ఈ సినిమా రెండో భాగాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసిన ఈ దర్శకడు త్వరలోనే షూటింగ్ ను మొదలు పెట్టుకోనున్నాడు.

బన్నీ లుక్ దగ్గరి నుంచి బడ్జెట్ లొకేషన్స్ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్స్ ల విషయంలోనూ ఎక్కడా రాజీపడకుండా ఈ మూవీని తెరపైకి తీసుకురావాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో బన్నీపై ఇటీవల లుక్ టెస్ట్ ని నిర్వహించిన చిత్ర బృందం రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్స్ లో బన్నీ లేకుండానే ఈ మూవీ షూటింగ్ ని మొదలు పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటె ఒక సినిమా చేయడానికి సంవత్సరం గ్యాప్ తీసుకోవడం అయన అభిమానులను ఏమాత్రం మెప్పించడం లేదు.