సోనీ లివ్‌లో డాక్యుమెంట్-డ్రామాగా ‘బ్లాక్ వైట్ & గ్రే – లవ్ కిల్స్’ నుంచి అద్భుతమైన ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ సిరీస్‌లోని విషయాన్ని చెప్పేలా, ఉండే సంక్లిష్టమైన, ఆలోచించపజేసేలా ట్రైలర్‌ను కట్ చేశారు.
ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం, వాటి నుంచి తప్పించుకునే యువకుడు, అతడితో ముడిపడి ఉన్న హత్యలు, వాటి వెనుకున్న రహస్యాల్ని ఛేదించే జర్నలిస్ట్ డేనియల్ చుట్టూ ఈ కథ తిరుగుతుంది. డేనియల్ దర్యాప్తు ఈ సిరీస్‌లో ఆద్యంతం ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉంటుంది. ఈ ట్రైలర్ ప్రస్తుతం సిరీస్ మీద అంచనాల్ని పెంచేస్తోంది.
మయూర్ మోర్ మాట్లాడుతూ.. ‘బ్లాక్, వైట్ అండ్ గ్రే – లవ్ కిల్స్ ప్రాజెక్టులో భాగం కావడం ఆనందంగా ఉంది. ఇది ఒక బోల్డ్, జానర్-బెండింగ్ డాక్యుమెంటరీ. క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేటివ్ జానర్‌లో ఇది ది బెస్ట్‌గా నిలుస్తుంది. ఈ కథ అపరాధం, అమాయకత్వం, న్యాయం వంటి వాటిపై అవగాహన కల్పించి.. ప్రశ్నించేలా చేస్తుంది. నా పాత్ర చాలా బాగా వచ్చింది. ఆడియెన్స్ అంతా కూడా ఈ కథకు కనెక్ట్ అవుతారు. ఇది మిమ్మల్ని చాలా కాలం వెంటాడుతుంది’ అని అన్నారు.
పుష్కర్ సునీల్ మహాబల్మ్ దర్శకత్వం వహించిన బ్లాక్, వైట్ & గ్రే – లవ్ కిల్స్‌ను స్వరూప్ సంపత్, హేమల్ ఎ. ఠక్కర్ నిర్మించారు. టిగ్మాన్షు ధులియాతో పాటు, ఈ సిరీస్‌లో మయూర్ మోర్, పాలక్ జైస్వాల్, దేవేన్ భోజని, ఎడ్వర్డ్ సోన్నెన్‌బ్లిక్, హక్కిమ్ షాజహాన్, అనంత్ జోగ్, కమలేష్ సావంత్ తదితరులు నటించారు.