మా టుక్‌ టుక్‌ సినిమాను చూసి అందరూ ఎంజాయ్‌ చేస్తారు: దర్శకుడు సుప్రీత్‌ కృష్ణ

ఫాంటసీ, మ్యాజికల్‌ అంశాలతో ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘టుక్‌ టుక్‌’. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు,సాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్‌ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్‌ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డిలు ఈచిత్రాన్ని నిర్మించారు. మార్చి 21న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా దర్శకుడు సోమవారం సుప్రీత్‌ కృష్ణ పాత్రికేయులతో ముచ్చటించారు. ఆ విశేషాలివి.

 

ఈ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు.

ఓ క్రికెట్‌ యాడ్‌లో ఓ వెహికల్‌ చూసినప్పుడు కలిగిన ఆలోచన ఇది. వెహికల్‌కు లైఫ్‌ ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన నుంచి వచ్చిన కథ ఇది. ఈ అంశానికి కమర్షియల్‌ ప్యాకేజీని కలిపి చేసిన చిత్రం టుక్‌ టుక్‌. పిల్లల దగ్గరికి టుక్‌టుక్‌ ఎలా వచ్చింది? ఈ వెహికల్‌ వెనుక కథ ఏమిటి అనేది ఆసక్తి కరంగా చెప్పాం. ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటు ఎమోషన్‌ కూడా ఉంటుంది.

గతంలో వచ్చిన బామ్మ బాట బంగారు బాట, మెకానిక్‌ మామయ్య, కారు దిద్దిన కాపురం చిత్రాలకు ఈ చిత్రానికి ఏమైనా పోలీక ఉంటుందా?

పోలీక ఏమీ లేదు. ఆ సినిమాల నుంచి ప్రేరణ పొందలేదు. ఇది కంప్లీట్‌ వర్జినల్‌ స్టోరీ.

 

ఆర్టిస్టుల ఎంపిక ఎలా జరిగింది?

సినిమాలో ముగ్గురు టీనేజ్‌అబ్బాయిలు అవసరం అందుకే హర్ష, కార్తికేయ, మధును తీసుకున్నాను. అడిషన్‌ చేసి తీసుకున్నాను. వర్క్‌ షాప్స్‌ జరిపి చిత్రీకరణ చేశాం.

అసలు ఈ కథాంశం ఏమిటి?

చిత్తూరు నేపథ్యంలో 90 నుండి 20వ దశకంలో జరిగే స్టోరీ. టుక్‌ టుక్‌ టైటిల్‌ వెనుక కూడా ఓ కథ ఉంది. సౌండ్‌ని టైటిల్‌గా పెట్టాలని పెట్టాం. మూవీ చూస్తే తెలుస్తుంది. దీనికి టైటిల్‌ ఎందుకు పెట్టారు అనే దానికి ఓ అర్థం వుంటుంది. నా నేటివిటి చిత్తూరు నేపథ్యం కావడం నాకు ఈ సినిమాకు ప్లస్‌ అయ్యింది.

ఈ సినిమాలో వెహికల్‌ పాత్రను ఎలా డిజైన్‌ చేశారు.

గతం, వర్తమానం, భవిష్యత్‌ అన్ని తెలిసిన స్కూటర్‌. మనం ఏదైనా ప్రశ్న అడిగితే దానికి తనదైన శైలిలో సమాధానం చెబుతుంది. ట్రైలర్‌లో చూసినట్టుగానే చిన్న హ్యుమర్‌ కోసం ఆ వెహికల్ ఉంటుంది. కానీ ఆ వెహికల్ వెనుక మంచి ఎమోషన్ ఉంటుంది.

అందరికి హై ఇచ్చే సీక్వెన్సీస్‌ ఉన్నాయి. టుక్‌టుక్‌ చుట్టే కథ తిరుగుతుంది. వాళ్ల దగ్గరకు టుక్‌ టుక్‌ ఎందుకొచ్చింది వాళ్లు ఏం చేశారు? అందరికి టుక్‌టుక్‌తో సంబంధం ఉంటుంది. స్ట్రాంగ్‌ ఎమోషన్‌.. బాగా రూటెడ్‌ స్టోరీ, విలేజ్‌ నేపథ్యంలో ఉంటుంది.

 

రోషన్‌ నటించిన కోర్టు హిట్‌ అవ్వడం మీకు ఎంత వరకు ప్లస్‌ అవుతుందని అనుకుంటున్నారు?

కోర్టుతో పాటు మా సినిమాపై కూడా రోషన్‌ మంచి నమ్మకంతో ఉన్నాడు. సినిమా హిట్‌ అవ్వడం, కోర్డు హిట్‌అవ్వడం మా మూవీకి కూడా ప్లస్‌ అవుతుంది.

ఈ చిత్రంలో టుక్‌టుక్‌ వెహికల్‌ కాకుండా ఇంకా హైలైట్స్‌ ఏమిటి?

ఫాంటసీ మ్యాజికల్‌ పవర్స్‌ ఉన్నాయి. వెహికల్‌ కాకుండా ఈ చిత్రంలో చాలా లేయర్స్‌ ఉన్నాయి. టుక్‌ టుక్‌ వెనకలా ఉందేమిటి? అది దెయ్యమా? దేవుడా అనేది సినిమాలో ఆసక్తికరంగా ఉంటుంది. స్క్రీన్‌ప్లే చాలా టైట్‌గా బాగుంటుంది. ఈ సినిమాలో కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ కూడా బాగా కుదిరాయి.

మీ నేపథ్యం ఏమిటి

పూరి జగన్నాథ్‌ దగ్గర రచయితగా చేశాను. అలనాటి సిత్రాలు అనే ఓటీటీ సినిమా చేశాను. దర్శకుడిగా తొలి ఫీచర్‌ ఫిల్మ్‌ ఇదే.

 

టుక్‌ టుక్‌ సీక్వెల్‌ కూడా ఉంటుందా?

టుక్‌ టుక్‌ ఫ్రాంచైజీని డిజైన్‌ చేసే ఆలోచన ఉంది. డిఫరెంట్‌ వెహికల్స్‌తో, డిఫరెంట్‌ బ్యాక్‌స్టోరీతో ఆ ఫ్రాంఛైజీని కొనసాగించాలనుకుంటున్నాను.

 

 

 

 

మీ తదుపరి చిత్ర ఏమిటి?

ఈ సినిమా రిజల్ట్‌ను బట్టి తదుపరి సినిమా ఎలా ఉండాలో, ఏ రేంజ్‌లో ఉండాలో ప్లాన్‌ చేసుకుంటున్నాను. తప్పకుండా కొత్త రకమైన కథాంశంతోనే నా సినిమాలు ఉంటాయి.