డివోషనల్‌ థ్రిల్లర్‌ షణ్ముఖ అందరికి నచ్చుతుంది: హీరో ఆది సాయికుమార్‌ 

కొత్తతరహా కథలతో రూపొందే డివోషనల్‌ థ్రిల్లర్స్‌కు ప్రేక్షకుల్లో మంచి ఆదరణ వుంది. ఇప్పుడు అదే తరహాలో ఓ ఇంట్రెస్టింగ్‌ డివోషనల్‌ కథతో రూపొందుతున్న చిత్రం ‘షణ్ముఖ’ కూడా ఆ జాబితాలో చేరడానికి రెడీ అవుతోంది. డివోషనల్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా ‘షణ్ముఖ’. అనే ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఆది సాయికుమార్ క‌థానాయ‌కుడు. అవికాగోర్ క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ష‌ణ్ముగం సాప్ప‌ని ద‌ర్శ‌కుడు. శాస‌న‌స‌భ అనే పాన్ ఇండియా చిత్రంతో అంద‌రికి సుప‌రిచిత‌మైన సంస్థ సాప్‌బ్రో ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ త‌మ ద్వితీయ చిత్రంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. సాప్ప‌ని బ్ర‌దర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో తుల‌సీరామ్ సాప్ప‌ని, ష‌ణ్ముగం సాప్ప‌ని, రమేష్‌ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులను శరవేగంగా జరుపుకుంటోంది. కాగా ఈ చిత్రాన్ని మార్చి 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్ ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నటుడు ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ ” విడుదలకు ముందే ఈ సినిమా అన్ని డిజిటల్‌ హక్కులు, అన్ని భాషల శాటిలైట్‌ హక్కులు, థియేట్రికల్‌ హక్కులు ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోవడం ఆనందంగా ఉంది. నా సినిమా విడుదలై సంవత్సరం దాటిపోయిది.పైనల్‌గా మార్చి 21తో షణ్ముఖతో వస్తున్నాను. ఈ సినిమా క్రెడిట్‌ అంతా దర్శక, నిర్మాత ష‌ణ్ముగం సాప్ప‌ని. ఈ సినిమా విషయంలో ఆయన చాలా కష్టపడ్డాడు. ఈసినిమా బిజినెస్‌ అయిపోవడం కూడా హ్యపీగా ఉంది. రవిబసూర్‌తో సంగీతంతో పాటు ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాను మరో లెవల్‌కు తీసుకవెళుతుంది. అవికాతో పనిచేయడం హ్యపీగా పీలయ్యాను.మళ్లీ మరో సారి ఆమెతో ఓ సినిమా చేయాలని ఉంది. తప్పకుండా మంచి సినిమాకు ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. కాబట్టి ఈ సినిమా హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది అన్నారు. అవికా గోర్‌ మాట్లాడుతూ ” అందరిలాగే ఈ సినిమా కోసం నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఇది నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైన సినిమా నాకు సపోర్ట్‌ చేసినందుకు అందరికి థ్యాంక్స్‌. డివోషనల్‌ పిలిం చేయడం హ్యపీగా ఉంది. ప్రతి ఆర్టిస్ట్‌ కోరుకునే డిఫరెంట్‌ రోల్ నాకు ఈ చిత్రంలో లభించింది. ఐయామ్‌ వెరీ థ్యాంక్‌ఫుల్‌. అమేజింగ్‌.. క్లియర్‌ అమేజింగ్ కోయాక్టర్‌ ఆది. రవిబసూర్‌తో పనిచేయాలనే నాకోరిక ఈ సినిమా తీరింది.

 

ప్రతినాయకుడు చిరాగ్‌ మాట్లాడుతూ అమేజింగ్‌..డివోషషనల్‌ ఫిల్మ్‌ ఇది. ప్రొడక్షన్‌ వాల్యూస్‌ ఉన్న సినిమా. నేను ఎదురుచూస్తున్న ఓ డిఫరెంట్‌ పాత్ర ఇందులో దొరికింది. తప్పకుండా సినిమా అందదరికి నచ్చుతుందనే నమ్మకం ఉందిఅన్నారు.

దర్శక నిర్మాత షణ్ముగం సాప్పని మాట్లాడుతూ ” హిందీ డిజిటల్‌ హక్కులు, అదర్‌స్టేట్స్‌ తో థియేట్రికల్ హక్కులు సేల్ అవ్వడం హ్యపీగా ఉంది. ఏపీ, తెలంగాణలో నా మిత్రుడు శశిధర్‌ రెడ్డి విడుదల చేస్తున్నారు. అ చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసాఫీసర్‌గా ఆది కనిపిస్తాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ట‌చ్ చేయ‌ని ఓ అద్భుత‌మైన పాయింట్‌తో రూపొందుతున్న డివోష‌న‌ల్ థ్రిల్ల‌ర్ ఇది. విజువ‌ల్ వండ‌ర్‌లా, అద్బుత‌మైన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాం. డివోషనల్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రతి పాత్ర హైలైట్‌గా వుంటుంది. అందరూ ఫ్యామిలీతో చూడదగ్గ డివోషనల్‌ థ్రిల్లర్‌ ఇది. నా దర్శకత్వంలో మొదటి సినిమా ఇది. ఇటీవల విడుదలైన చంద్రకళ సాంగ్‌కు మంచి స్పందన వస్తోంది. సినిమా కూడా అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. అన్నారు. మనోజ్‌ నందం మాట్లాడుతూ ” ఇంత మంచి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు ఆనందంగా ఉంది. ఆదితో మొదట్నుంచీ మంచి అనుబంధం వుంది.ఈ సినిమాలో ఆదిని పవర్‌ఫుల్‌క్ష పోలీస్‌ ఆఫీసర్‌గా కొత్తగా చూస్తారు. చాలా డిఫరెంట్ షేడ్స్‌ ఉన్న పాత్ర ఆయనది. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అన్నారు.