మార్చి 6వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కు వస్తున్న సుమ కనకాల “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K”

ఆహా ఓటీటీ మరో ఎగ్జైటింగ్ ప్రోగ్రాంను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. సుమ కనకాల హోస్ట్ గా వ్యవహరిస్తున్న “చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ K” మార్చి 6వ తేదీ నుంచి ప్రతి గురువారం రాత్రి 7 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కు రానుంది. చెఫ్ మంత్ర సీజన్ 1 టేస్టీ ఎంటర్ టైన్ మెంట్ ను ఈ సీజన్ 2 మరింతగా అందించనుంది. ప్రాజెక్ట్ కె అంటే ఏంటి అనేది ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. సుమతో పాటు నటుడు జీవన్ కుమార్ చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కెలో తనవంతు వినోదాన్ని జోడించనున్నారు.

అమర్ దీప్-అర్జున్, దీపికా రంగరాజు-సమీరా భరద్వాజ్, సుప్రిత-యాదమ్మ రాజు, ప్రషు-ధరణి మరియు విష్ణుప్రియా-పృథ్వీ జోడీ రుచికరమైన వంటకాలు ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నారు. తెలుగింటి వంటలతో పాటు సర్ ప్రైజ్ చేసే క్రియేటివ్ వంటకాలు ప్రతి ఎపిసోడ్ లో చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె అందించనుంది. ఈ సీజన్ ప్రోమో ఇప్పటికే రిలీజై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ సందర్భంగా ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ – ఆహా ఐదేళ్ల యానివర్సరీ జరుపుకుంటున్న 2025 మాకు ఎంతో ప్రత్యేకమైనది. ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు ఎగ్జైటింగ్ కంటెంట్ అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. చెఫ్ మంత్ర ప్రాజెక్ట్ కె సీజన్ 2 ఆ ప్రయత్నంలో భాగమే. పది మంది కంటెస్టెంట్స్ పరిచయం చేసే వంటకాలు, నవ్వించే సుమ హోస్టింగ్, జీవన్ కుమార్ ఫన్ ప్రేక్షకులకు రుచికరమైన వంటలతో పాటు కావాల్సినంత వినోదాన్ని అందించబోతున్నాయి. అన్నారు.