ఫిబ్రవరి 14 నుంచి ఆహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతున్న “డ్యాన్స్ ఐకాన్ 2 – వైల్డ్ ఫైర్”

డ్యాన్స్ లవర్స్ ను మెస్మరైజ్ చేసిన డ్యాన్స్ ఐకాన్ సీజన్ 1 ఓహా ఓటీటీలో సూపర్ సక్సెస్ అయ్యింది. ఈ షో మీద ఉన్న క్రేజ్ తో ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ను అనౌన్స్ చేసింది ఆహా ఓటీటీ. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ ఫిబ్రవరి 14వ తేదీ నుంచి ఓహా ఓటీటీలో ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ షో కు ఓంకార్, హీరోయిన్ ఫరియా అబ్దుల్లా, శేఖర్ మాస్టర్ హోస్ట్ లు గా వ్యవహరిస్తున్నారు.

డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా కంటెస్టెంట్స్ పాల్గొంటున్నారు. హిప్ హాప్, క్లాసికల్, కాంటెంపరరీ స్టైల్స్ లో డ్యాన్స్ పర్ ఫార్మెన్స్ ఆకట్టుకోనున్నాయి. డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ గురించి ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ – డ్యాన్స్ మీద ఉన్న ప్యాషన్ ను, డ్యాన్స్ చేయడంలో ఉన్న టాలెంట్ ను డ్యాన్స్ ఐకాన్ సెలబ్రేట్ చేసింది. ఇప్పుడు డ్యాన్స్ ఐకాన్ 2 వైల్డ్ ఫైర్ తో మరింత వైడ్ రేంజ్ లో ఆడియెన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాం. అన్నారు.