హారర్, సస్పెన్స్, కామెడీ కథా చిత్రాలకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. ఆ కోవలో విభిన్నంగా తెరక్కెక్కించిన చిత్రం “బ్లడ్”.
గతంలో “డేంజర్ లవ్ స్టోరీ” తో పాటు పలు చిత్రాలను నిర్మించిన అవధూత గోపాల్ దర్శక, నిర్మాతగా తీసిన చిత్రమిది.
శ్రీ లక్ష్మీ కనకవర్షిణి క్రియేషన్స్ పతాకంపై గౌరవ్ హీరోగా, గోపాలరావు, నందినీ కపూర్, జబర్దస్త్ వినోదిని, రాకింగ్ రాకేష్, ప్రధాన పాత్రలలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం ప్రెస్ మీట్ మంగళవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది.
దీనికి అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, “జబర్దస్త్ ” అప్పారావులతో పాటు నటుడు విజయభాస్కర్ చిత్రంప్రోమోలను ఒక్కోరు ఒక్కోటి ఆవిష్కరించగా, “జబర్దస్త్” వినోదిని, “జబర్దస్త్” చిట్టిబాబు, నటులు కొల్హాపూర్ రామచంద్ర గౌడ్, ఆనందభారతి, కొల్హాపూర్ రామకృష్ణ ఐటమ్ సాంగ్ ను ఆవిష్కరించారు.
అతిథి రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, “అవదూత గోపాల్ కు సినిమా అంటే ప్రాణం. అందుకే ఆయన మంచి స్క్రిప్ట్ కుదిరినప్పుడల్లా సినిమాలు తీస్తూనే ఉన్నారు. ప్రోమోస్ తో పాటు ఐటమ్ సాంగ్ కూడా సినిమాను బాగా తీశారనేందుకు ఒక సూచికగా నిలిచాయి” అని అన్నారు.
మరో అతిథి “జబర్దస్త్” అప్పారావు మాట్లాడుతూ, అవధూత గోపాల్ తన అభిరుచిని చాటుకుంటూనే ఎందరికో అవకాశాలు కల్పించడం అభినందనీయమని అన్నారు.
దర్శక, నిర్మాత, అవధూత గోపాల్ మాట్లాదుతూ,”ట్రెండ్ కు అనుగుణంగా తీసిన చిత్రమిది. ఈ నెల 27న చిత్రాన్ని విడుదల చేయబోతున్నాం. ఓ యువతి హత్యకు గురైన నేపథ్యంలో దయ్యంగా మారి, తనకు అన్యాయం చేసిన వారిపై ఏ విధంగా పగ తీర్చుకుందన్న అంశాన్ని ఇందులో చాలా ఆసక్తికరంగా చూపించాం. ఊహించలేని ట్విస్టులు, సస్పెన్స్ తో చిత్రం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ఇందులో నేను ద్విపాత్రాభినయం చేశాను/ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో చిత్రాన్ని శుక్రవారం విడుదల చేయబోతున్నాం” అని చెప్పారు.
హీరో గౌరవ్ మాట్లాడుతూ, “మా నాన్న ఎంకరేజ్ మెంట్ తో నేను ఈ రంగంలోనికి వచ్చాను. ఓ వైపు బిజినెస్ మెన్ గా ఉంటూనే, మరో వైపు సినిమాలలో నటిస్తున్నాను. ఇందులోనూ ఓ చక్కటి పాత్రలో నటించాను” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇతర నటీనటులు కూడా చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
ఈ చిత్రానికి సంగీతం: భానుప్రసాద్, కెమెరా: విజయ్, ఎడిటింగ్: శ్రీను బాబు, ఆర్ట్: రాము, వెంకటేష్, నిర్మాత, దర్శకత్వం: అవధూత గోపాల్.