మీ ఇంట్లో అమ్మాయి చేసిన సినిమా అనుకుని “ఫియర్” చిత్రాన్ని థియేటర్‌లో చూడండి – ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దర్శకురాలు డా. హరిత గోగినేని

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":[],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్స్ డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు.‌ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు డా. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 70 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు “ఫియర్” మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

సినిమాటోగ్రాఫర్ ఐ అండ్రూ మాట్లాడుతూ – హరిత గారు “ఫియర్” కథ చెప్పినప్పుడే ఈ సినిమాకు చాలా అవార్డ్స్ వస్తాయని ఆమెతో అన్నాను. ఈ చిత్రాన్ని ఎక్కడా కొత్త డైరెక్టర్ చేసినట్లు రూపొందించలేదు. “ఫియర్” సినిమాకు పనిచేయడం మంచి ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు అమీన్ మాట్లాడుతూ – హరిత గారు నాకు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ ఇచ్చి ఎంకరేజ్ చేశారు. ఆమె ఒక ట్రూ లీడర్. మా టీమ్ ను కంఫర్ట్ గా లీడ్ చేశారు. ఈ నెల 14న థియేటర్స్ లో “ఫియర్” మూవీ చూసేందుకు కలుద్దాం. అన్నారు.

నటుడు అనురాగ్ చింటు మాట్లాడుతూ – నేను గతంలో అభి గారు, హరిత గారు చేసిన లక్కీ లక్ష్మణ్ మూవీలో నటించాను. ఇప్పుడు మళ్లీ “ఫియర్” సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ చిత్రంలో ఇన్స్ పెక్టర్ రోల్ లో కనిపిస్తాను. ఈ క్యారెక్టర్ నాకు మంచి గుర్తింపు తీసుకొస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ మాట్లాడుతూ – “ఫియర్” సినిమా గురించి చెప్పాలంటే హరిత గారి గురించి చెప్పాలి. వన్ మ్యాన్ ఆర్మీ లాగ ఆమె ఈ మూవీ చేశారు. అభి గారు, హరిత గారు మేడ్ ఫర్ ఈచ్ అదర్, ఈ మూవీ కోసం ఎంతో కష్టపడి ఈ నెల 14న థియేటర్స్ లోకి తీసుకొస్తున్నారు. వేదిక గారి పర్ ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. “ఫియర్” మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. అన్నారు.

నటుడు అప్పాజీ అంబరీష్ మాట్లాడుతూ – “ఫియర్” సినిమాలో నటించేప్పుడు హరిత గారు మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ లా చూసుకున్నారు. మనలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక భయం ఉంటుంది. ఆ భయాన్ని ఎలా అధిగమించాం అనేది గొప్ప విషయం. అలాంటి ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ ఈ చిత్రంలో చూస్తారు. అన్నారు.

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ – హరిత, అభి గతంలో లక్కీ లక్ష్మణ్ అనే సినిమా చేశారు. అప్పటి నుంచి వాళ్లను చూస్తున్నా. మూవీ కోసం ఎంతో కష్టపడతారు. అనుకున్న షెడ్యూల్స్ అనుకున్నట్లు రూపొందిస్తారు. వీళ్లు “ఫియర్” సినిమా స్టార్ట్ చేస్తున్నారని తెలిసి హ్యపీగా ఫీలయ్యా. ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా ఆడియెన్స్ ఆదరణ పొందాలని కోరుకుంటున్నా. అన్నారు.

నటుడు షానీ మాట్లాడుతూ – లక్కీ లక్ష్మణ్ సినిమా కంప్లీట్ అవగానే హరిత, అభి గారు “ఫియర్” సినిమా స్టార్ట్ చేశారు. లక్కీ లక్ష్మణ్ తర్వాత వెంటనే ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చారు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఏంటి అనేది స్క్రీన్ మీదే చూడాలి. ఒక మంచి చిత్రంగా “ఫియర్” పేరు తెచ్చుకుంటుంది. అన్నారు.

ప్రొడ్యూసర్ ఏఆర్ అభి మాట్లాడుతూ – మా మూవీ ప్రీ రిలీజ్ కు వచ్చిన ప్రేక్షకులంతా పెద్ద అతిథులే. వాళ్లే నాకు దేవుళ్లతో సమానం. చిన్న స్థాయి నుంచి లెజెండ్స్ గా ఎదిగిన ప్రతి హీరో మాకు స్ఫూర్తినిస్తారు. హీరోయిన్ వేదిక మా మూవీకి ఎంతో సపోర్ట్ చేశారు. నాలుగు భాషల్లో హీరోలతో టీజర్ రిలీజ్ చేయించారు. మాధవన్ గారితో మాట్లాడి ట్రైలర్ రిలీజ్ చేయించారు. ఆమెకు ఒంట్లో బాగాలేక ఈరోజు ఈవెంట్ కు రాలేకపోయారు. నా వైఫ్ హరితకు పట్టుదల ఎక్కువ. స్క్రిప్ట్ మీద పూర్తి నమ్మకంతో మూవీ చేసింది. “ఫియర్” లో నటించిన ఆర్టిస్టులంతా మాకు సపోర్ట్ చేశారు. కో ప్రొడ్యూసర్ సుజాత రెడ్డి సహకారం అందించారు. నిర్మాతగా రెండు చిత్రాలు పూర్తి చేసి రిలీజ్ చేస్తున్నా. నెక్ట్ మూవీ స్టార్ట్ చేస్తున్నాం. మా “ఫియర్” సినిమా టీజర్, పాటలు చూడండి మీకు నచ్చితే థియేటర్స్ కు వెళ్లి చూడండి. ఈ నెల 12 నుంచి పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. మేము అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా 70 పర్సెంట్ బుకింగ్స్ ఉన్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ప్రీమియర్స్ మిస్ అయినవాళ్లు 14న థియేటర్స్ లో “ఫియర్” సినిమా చూడండి. అన్నారు.

కో ప్రొడ్యూసర్ సుజాత రెడ్డి మాట్లాడుతూ – “ఫియర్” సినిమాను చాలా కొత్త తరహా స్క్రిప్ట్ తో హరిత రూపొందించారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు సర్ ప్రైజ్ చేసింది. అలాంటి మంచి సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కథలో ఉన్నాయి. హరిత మూవీ కోసం చాలా కష్టపడింది. అభి మాకు ఫ్యామిలీ పర్సన్. “ఫియర్” సినిమాను థియేటర్స్ లో చూడండి మీ అందరికీ నచ్చుతుంది. అన్నారు.

నటి సాహితి దాసరి మాట్లాడుతూ – “ఫియర్” సినిమాను హరిత గారు ఫియర్ లెస్ గా రూపొందించారు. ఈ సినిమాకు మంచి స్క్రిప్ట్, బ్యూటిఫుల్ విజువల్స్, అనూప్ గారి మ్యూజిక్ హైలైట్స్ అని చెప్పవచ్చు. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. మీ అందరికీ నా క్యారెక్టర్ నచ్చుతుందని ఆశిస్తున్నా. “ఫియర్” మిమ్మల్ని బాగా ఎంగేజ్ చేస్తుంది. అన్నారు.

డైరెక్టర్ డా. హరిత గోగినేని మాట్లాడుతూ – “ఫియర్” స్క్రీన్ ప్లే ఓరియెంటెడ్ మూవీ. ఒక కాన్సెప్ట్ తో వెళ్తుంది. సరికొత్త స్క్రీన్ ప్లే ఉంది కాబట్టే 70 ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. “ఫియర్” లో వేదిక డ్యూయల్ రోల్ చేసిందనే విషయాన్ని ఈ ఈవెంట్ లో రివీల్ చేస్తున్నాం. మా సినిమాకు యూఏ సర్టిఫికేషన్ వచ్చింది. పిల్లలు, పెద్దలు, ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చు. పెద్ద సినిమా థియేటర్ లో , చిన్న సినిమా ఓటీటీలో చూద్దామనే భావన మన ఆడియెన్స్ లో వచ్చేసింది. అయితే థియేటర్ లో ఆదరిస్తేనే ఓటీటీలోకి చిన్న చిత్రాలు వెళ్తాయి. అందుకే చిన్న సినిమాను మీరంతా ఆదరించాలని కోరుతున్నా. నేనొక మూవీ లవర్ ను, ప్రతి సినిమా ఫస్ట్ షో చూస్తా. ఈ స్క్రిప్ట్ వినగానే అభి తప్పకుండా మూవీ చేద్దామని ఎంకరేజ్ చేశారు. అలాగే నా ఫ్రెండ్ సుజాత రెడ్డి కో ప్రొడ్యూస్ చేశారు. హీరోయిన్ వేదిక బంగారం. మా మూవీకి ఎంతో సపోర్ట్ చేసింది. అలాగే చిన్న క్యారెక్టర్ అయినా అరవింద్ కృష్ణ చేశాడు. అనూప్ రూబెన్స్ గారికి చిన్న సినిమా పెద్ద సినిమా అనే బేధం లేదు. మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే ఆండ్రూ గారి విజువల్స్ హైలైట్ గా నిలుస్తాయి. మేము లక్కీ లక్ష్మణ్ తర్వాత చేస్తున్న సినిమా ఇది. మాతో పనిచేసిన వారు, ఫ్యామిలీలా మారిపోతారు. ఆ ప్రేమను సంపాదించుకున్నాం. అచ్చి బాబు గారు మాకు చాలా థియేటర్స్ ఇప్పిస్తూ సపోర్ట్ చేస్తున్నారు. ఫియర్ సినిమాలో ఎన్నో సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటి గురించి మూవీ రిలీజ్ అయ్యాక మాట్లాడుతా. ఫీమేల్ డైరెక్టర్స్ మనకు చాలా తక్కువ. మీ ఇంట్లో అమ్మాయి తీసిన సినిమా అనుకుని “ఫియర్” చూడండి. అన్నారు.

హీరో సొహైల్ మాట్లాడుతూ – హరిత, అభి గారితో లక్కీ లక్ష్మణ్ మూవీ చేశాను. వీళ్లిద్దరూ చాలా జెన్యూన్ పర్సన్స్, సినిమా కోసం ధైర్యంగా అడుగు వేస్తారు. మనం లవ్ స్టోరీస్, థ్రిల్లర్స్, హారర్ మూవీస్ చూసి ఉంటాం. కానీ “ఫియర్” సినిమాలో లవ్ స్టోరీతో పాటు థ్రిల్లర్ హారర్ ఎలిమెంట్స్ కలిసిన ఒక కొత్త తరహా స్క్రీన్ ప్లే ఉంటుంది. ఇలాంటి స్క్రిప్ట్ స్కీన్ ప్లేతో తెలుగులో మూవీ రాలేదని చెప్పగలను. “ఫియర్” కంటెంట్ చాలా బాగుంది. వేదిక గారి పర్ ఫార్మెన్స్, అనూప్ గారి మ్యూజిక్, ఆండ్రూ గారి విజువల్స్..ఇవన్నీ హైలైట్ అవుతాయి. ఈ సినిమా తప్పకుండా థియేటర్స్ లో చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటీనటులు – వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు

టెక్నికల్ టీమ్

మ్యూజిక్ – అనూప్ రూబెన్స్,

సినిమాటోగ్రఫీ – ఐ ఆండ్రూ

లిరిక్స్ – కృష్ణ కాంత్

కొరియోగ్రఫీ – విశాల్

పీఆర్ ఓ- జీఎస్ కే మీడియా(సురేష్ – శ్రీనివాస్)

డిజిటల్ మీడియా – హౌస్ ఫుల్, మాయాబజార్

నిర్మాత – డా. వంకి పెంచలయ్య, ఏఆర్ అభి

కో ప్రొడ్యూసర్ – సుజాత రెడ్డి

రచన, ఎడిటింగ్, దర్శకత్వం – డా. హరిత గోగినేని