ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ లో పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ గెల్చుకున్న సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ “సత్య”

Supreme Hero Sai Durgha Tej's SATYA Wins People's Choice Award at Filmfare Short Film Awards 2024

హార్ట్ టచింగ్ షార్ట్ ఫిలింగా అందరి ప్రశంసలు పొందింది సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ నటించిన “సత్య”. ఈ షార్ట్ ఫిలిం ఫిలింఫేర్ షార్ట్ ఫిలిం అవార్డ్స్ 2024లో పీపుల్స్ ఛాయిస్ కేటగిరిలో అవార్డు గెల్చుకుంది. ఈ అవార్డు గెల్చుకున్న హ్యాపీ మూవ్ మెంట్ ను టీమ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకున్నారు.

“సత్య” షార్ట్ ఫిలింలో స్వాతి రెడ్డి హీరోయిన్ గా నటించింది. హర్షిత్, హన్షిత నిర్మాతలుగా వ్యవహరించారు. విజయకృష్ణ వీకే దర్శకత్వం వహించారు. మ్యూజికల్ షార్ట్ ఫిలింగా “సత్య” ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇచ్చింది.