లవ్ రెడ్డి సమీక్ష: శక్తివంతమైన సామాజిక సందేశంతో ఆకట్టుకునే రొమాంటిక్ థ్రిల్లర్

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"remove":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}

టైటిల్: లవ్ రెడ్డి

నటీనటులు: అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, జ్యోతి మదన్, ఎన్.టి. రామస్వామి, గణేశ్, పల్లవి మరియు ఇతరులు.

నిర్మాణ సంస్థలు: గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్లు

నిర్మాతలు: సునంద బి. రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి., మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్

రచన మరియు దర్శకత్వం: స్మరన్ రెడ్డి

సంగీతం: ప్రిన్స్ హెన్రీ

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

విడుదల తేది: అక్టోబర్ 18, 2024

కంటెంట్ బాగుంటే పెద్ద, చిన్న అనే తేడా లేకుండా ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లడానికి వెనుకాడటం లేదు. కథ బలంగా ఉంటే, నటీనటుల గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఈ తరహాలోనే కొత్త తరానికి చెందిన టాలీవుడ్ దర్శకులు కొత్త కథలతో సినిమాలను తీసి విజయవంతం అవుతున్నారు. అలాంటి ఓ కొత్త తరహా ప్రేమ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన యంగ్ డైరెక్టర్ స్మరన్ రెడ్డి ‘లవ్ రెడ్డి’ సినిమాను తీసుకువచ్చాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి, అలాగే ప్రమోషన్లు కూడా బలంగా ఉండడంతో ‘లవ్ రెడ్డి’పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. రేపు (అక్టోబర్ 18) ఈ చిత్రం విడుదల కానుండగా, మీడియా కోసం స్పెషల్ ప్రివ్యూ ప్రదర్శించారు. మరి సినిమా ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

నారాయణ రెడ్డి (అంజన్ రామచంద్ర) 30 ఏళ్ల వయస్సులో కూడా పెళ్లి కాలేదు. ఇంట్లో వారు ఎన్నో సంబంధాలు చూపించినా, అతనికి నచ్చడం లేదు. ఒక రోజు బస్సులో దివ్య (శ్రావణి రెడ్డి)ని చూసి, తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. అప్పటి నుండి నారాయణ ‘లవ్ రెడ్డి’గా మారి దివ్యను ఇష్టపడతాడు. దివ్య కూడా అతనితో స్నేహం చేస్తుంది, కానీ ప్రేమ విషయమై ఇద్దరూ మాట్లాడుకోలేదు. ఒక రోజు ధైర్యం చేసి నారాయణ తన ప్రేమను చెప్పగా, దివ్య అతని ప్రేమను తిరస్కరించేస్తుంది. నారాయణను ఎందుకు దివ్య తిరస్కరించింది? ఈ ప్రేమ కథ చివరికి ఎక్కడికి చేరింది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాలి.

సినిమా ఎలా ఉందంటే:

“మనిషి మరణించవచ్చు కానీ ప్రేమ అనేది ఎప్పటికీ కొనసాగే భావన” అని చిత్రం ముగింపులో పేర్కొనబడిన కొటేషన్ ఈ కథకు తగినదే. కథ పరువు ప్రతిష్టలతో ముడిపడి, స్వచ్ఛమైన ప్రేమ కథగా సున్నితంగా సాగుతుంది. డైరెక్టర్ స్మరన్ రెడ్డి ఈ ప్రేమకథను సహజంగా తెరపైకి తీసుకురావడంలో సఫలమయ్యాడు. మొదట వినోదాత్మకంగా ప్రారంభించిన కథ చివర్లో ఎమోషన్‌తో ముగుస్తుంది.

నటీనటుల ప్రదర్శన:

ఈ చిత్రంలో నటించినవారు కొత్తవారే అయినప్పటికీ, వారు తమ పాత్రలకు మంచి న్యాయం చేశారు. భగ్న ప్రేమికుడు నారాయణ రెడ్డిగా అంజన్ రామచంద్ర సహజంగా నటించాడు. దివ్యగా శ్రావణి రెడ్డి తన పాత్రకు న్యాయం చేసింది. ఇతర నటీనటులు కూడా తమ పాత్రలను బాగా పోషించారు.

సాంకేతికంగా:

సినిమాకి సంగీతం ప్రధాన బలం. ప్రిన్స్ హెన్రీ తన సంగీతంతో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు. సినిమాటోగ్రఫీ రిచ్‌గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు మంచి స్థాయిలో ఉన్నాయి.

రేటింగ్: 3/5