‘సైమా’లో తన హ్యాపీ మూమెంట్స్‌ను షేర్ చేసిన హీరో విజయ్ దేవరకొండ, త్వరలో “వీడీ 12″కి సంబంధించిన అప్డేట్ ఇవ్వనున్నామని వెల్లడించాడు

{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{},"is_sticker":false,"edited_since_last_sticker_save":false,"containsFTESticker":false}

హీరో విజయ్ దేవరకొండ తన తాజా ట్వీట్‌లో సైమా అవార్డ్స్ వేడుకల నుండి హ్యాపీ మూమెంట్స్‌ను షేర్ చేశారు. ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఈ అవార్డ్స్ వేడుకల్లో, డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్నారు. అలాగే, హీరో ఆనంద్ దేవరకొండ బేబీ చిత్రానికి బెస్ట్ యాక్టర్ క్రిటిక్ అవార్డు అందుకున్నారు.

సైమా వేడుకలో పాల్గొన్న విజయ్ దేవరకొండ, సందీప్ వంగా మరియు ఆనంద్ దేవరకొండతో కలసి హ్యాపీ మూమెంట్స్‌ను పంచుకున్నారు. ఈ ఫొటోలను ఈ రోజు ట్విట్టర్ లో షేర్ చేశారు. తన ట్వీట్‌లో విజయ్ దేవరకొండ “నాకు ఇష్టమైన డైరెక్టర్ సందీప్ వంగా సైమా సెన్సేషన్ అవార్డును పొందినందుకు మరియు మా బ్రదర్ ఆనంద్ దేవరకొండకు బెస్ట్ యాక్టర్ క్రిటిక్ అవార్డు దక్కినందుకు ఎంతో ఆనందంగా మరియు గర్వంగా ఉంది. త్వరలో వీడీ 12 మూవీకి సంబంధించిన అప్డేట్‌ను మీతో పంచుకుంటాం” అని పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ యొక్క తాజా ట్వీట్ నెటిజన్స్‌ను ఆసక్తిగా ఉంచుతుంది.