విజయ్ ఆంటోనీ నటించిన యాక్షన్ థ్రిల్లర్ “హిట్లర్” ట్రైలర్ విడుదలైంది. ఈ సినిమా ఈ నెల 27న పాన్ ఇండియా స్థాయిలో భారీ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది

విజయ్ ఆంటోనీ, తన వైవిధ్యమైన సినిమాలతో సౌత్ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ హీరో, ఇప్పుడు తన తాజా చిత్రం “హిట్లర్”తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. గతంలో విజయ్ ఆంటోనితో “విజయ్ రాఘవన్” అనే సినిమాను నిర్మించినచెందూర్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ, తమ ఏడవ ప్రాజెక్ట్ గా “హిట్లర్” సినిమాను నిర్మిస్తోంది. ఈ చిత్రానికి డీటీ రాజా మరియు డీఆర్ సంజయ్ కుమార్ నిర్మాతలు. దర్శకుడు ధన, ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కించారు. ఈ సినిమా హిందీతో పాటు తమిళ, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో ఈ నెల 27న భారీ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. నేడు ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేయబడింది.

“హిట్లర్” ట్రైలర్ విషయానికి వస్తే, “ఈ ప్రపంచంలో నిజమైన శక్తి డబ్బు కాదు, అధికారం కాదు, ఒక మనిషిని నమ్మే జనమే అతనికి నిజమైన బలం” అనే పవర్‌ఫుల్ డైలాగ్‌తో ప్రారంభమవుతుంది. హీరో విజయ్ ఆంటోనీ వేరువేరు గెటప్స్‌లో కనిపిస్తూ, పోలీసులు పట్టుకోలేని విధంగా ముగ్గురిని కాల్చేస్తాడు. ఈ తెలివైన నేరస్తుడి కోసం పోలీసులు వేట సాగిస్తారు. యాక్షన్ సీక్వెన్సులతో పాటు, హీరో ప్రేమకథ కూడా ట్రైలర్‌లో చూపబడింది. చరణ్ రాజ్, దశాబ్దాలుగా రాజకీయాల్లో ముల్లు గుచ్చిన స్వార్థపూరిత నాయకుడిగా కనిపిస్తారు. పొలిటికల్ డ్రామా, యాక్షన్, ప్రేమ, రొమాన్స్ అంశాలతో “హిట్లర్” ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విజయ్ ఆంటోనీ ప్రదర్శన, అత్యుత్తమ ప్రొడక్షన్ వ్యాల్యూస్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ ఈ ట్రైలర్ హైలైట్స్ గా నిలుస్తున్నాయి. ట్రైలర్ చూస్తే “హిట్లర్” సినిమా విజయ్ ఆంటోనీ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుందని అనిపిస్తోంది.

నటీనటులు:

– విజయ్ ఆంటోనీ

– రియా సుమన్

– గౌతమ్ వాసుదేవ్ మీనన్

– చరణ్ రాజ్

సాంకేతిక విభాగం:

– సినిమాటోగ్రఫీ: ననీన్ కుమార్

– సంగీతం: వివేక్, మెర్విన్

– ఆర్ట్: సి. ఉదయ్ కుమార్

– ఎడిటింగ్: సంగతమిజాన్.ఇ

– కొరియోగ్రఫీ: బృందా, లీలావతి

– స్టంట్స్: జి. మురళి

– కాస్ట్యూమ్: అనుష.జి

– పీఆర్వో: జీఎస్‌కే మీడియా

– నిర్మాతలు: డీటీ రాజా, డీఆర్ సంజయ్ కుమార్

– రచన మరియు దర్శకత్వం: ధన