ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘సత్య’ ఇప్పుడు ‘ఆహా’ ఓటిటి ప్లాట్‌ఫార్మ్‌లో అందుబాటులో ఉంది

హమరేశ్, ప్రార్ధనా సందీప్ జంటగా నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా సత్య ఇప్పుడు ‘ఆహా’ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. వాలీ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని, శివమ్ మీడియా పతాకంపై శివమల్లాల నిర్మాతగా తమిళ చిత్రం రంగోలిను తెలుగులోకి సత్య పేరుతో అనువదించారు.

ఈ సినిమాలో ‘ఆడుకాలం’ మురుగదాస్ తండ్రి పాత్రలో అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రతి ఒక్కరూ సినిమా గొప్ప విలువలతో ఉన్నట్లు ప్రశంసించారు. గవర్నమెంట్ కాలేజ్ కంటే ప్రైవేట్ కాలేజ్‌లో చదివితేనే మంచి చదువు వస్తుంది అనే అపోహకు సవాల్ విసిరిన ఈ చిత్రం, ఎక్కడ ఉన్నా చక్కగా చదివే పిల్లలు ప్రతి స్కూల్‌లోనూ మంచిగా చదువుతారు అనే కాన్సెప్ట్‌తో ఎమోషనల్ హిట్‌గా నిలిచింది.

అప్పులు చేసి, వడ్డీలు కడుతూ పిల్లలను ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో చేర్చి ఇబ్బందులు పడే చిన్న ఫ్యామిలీ కథ ఆధారంగా రూపొందిన సత్య వినాయక చవితి సందర్భంగా ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రాన్ని చూసి ప్రతీ ఒక్కరూ తమ జీవితంలో స్కూల్, కాలేజీ, టీనేజ్ లవ్‌ను మరోసారి గుర్తు తెచ్చుకోవాలని చిత్ర యూనిట్ కోరుకుంటోంది.

సంగీతం సుందరమూర్తి అందించగా, మాటలు కె.యన్ విజయ్‌కుమార్ రాశారు. పాటలను రాంబాబు గోసాల అందించారు.

సాంకేతిక బృందం:

పి.ఆర్.ఓ: వి.ఆర్ మధు, మూర్తి

మల్లాల