స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రధాన పాత్రలో, బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమా ‘జాక్ – కొంచెం క్రాక్’… ఈ సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతోంది

సిద్ధు జొన్నలగడ్డ రీసెంట్‌గా విడుదలైన “డీజే టిల్లు” సీక్వెల్ “టిల్లు స్క్వేర్”తో పెద్ద సక్సెస్ అందుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆయన హీరోగా, బ్లాక్ బస్టర్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో కొత్త ప్రాజెక్ట్ “జాక్” రూపొందుతోంది. “కొంచెం క్రాక్” అనే ట్యాగ్ లైన్ తో ఈ సినిమా ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని ప్రయత్నిస్తుంది. సిద్ధు తన విభిన్న కథల ఎంపికతో ప్రసిద్ధి గాంచిన నేపథ్యంలో, బొమ్మరిల్లు భాస్కర్‌తో కలిసి తీస్తున్న ఈ సినిమా మిగతా సినిమాల కంటే ప్రత్యేకమైనదిగా ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్. ప్రసాద్, శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్‌లో శరవేగంగా షూటింగ్ జరుగుతుండగా, ప్ర‌కాష్‌రాజ్‌, నరేష్‌, బ్రహ్మాజీ తదితరులతో కలిసి కమెడీ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. సిద్ధు తన అద్భుతమైన టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తారని అంచనా వేస్తున్నారు.

ఇప్పటివరకు 80 శాతం షూటింగ్ పూర్తయింది, తదుపరి షెడ్యూల్ నేపాల్‌లో సెప్టెంబర్ 15న ప్రారంభమవుతుందని సమాచారం. అచ్చు రాజమణి సంగీతాన్ని అందిస్తున్నారు, ఆయన ఈ చిత్రానికి ఫ్రెష్ సౌండ్ ట్రాక్‌ను సిద్దం చేస్తున్నారని చిత్ర బృందం చెబుతోంది.

సిద్ధు జొన్నలగడ్డ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, “బేబి” సినిమా ఫేమ్ వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తున్నారు.