ఇన్టెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ “ఘటికాచలం” కి టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల

హీరో నిఖిల్ దేవాదుల ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “ఘటికాచలం”. ఈ చిత్రానికి కథను అందిస్తూ, ఒయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఎం.సి.రాజు నిర్మాణం వహిస్తున్నారు. దర్శకుడు అమర్ కామెపల్లి ఈ సినిమాను ఒక ఇన్టెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ఈరోజు “ఘటికాచలం” టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ విడుదల చేశారు.

“ఘటికాచలం” ఫస్ట్ లుక్‌లో హీరో నిఖిల్ దేవాదుల రెండు విభిన్నమైన రూపాలలో కనిపిస్తున్నారు. ఒక లుక్ ఇన్నోసెంట్‌గా, మరొకటి ఇంటెన్స్‌గా ఉండి, టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ చిత్రంలో ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. “ఘటికాచలం” సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

నటీనటులు: నిఖిల్ దేవాదుల, ఈటీవీ ప్రభాకర్, ఆర్వికా గుప్తా, జోగి నాయుడు, సంజయ్ రాయ్ చుర, దుర్గాదేవి, తదితరులు

టెక్నికల్ టీమ్:

– కాస్ట్యూమ్ డిజైన్: అంజలి

– ఎడిటింగ్: శ్రీనివాస్ బైనబోయిన

– సినిమాటోగ్రఫీ: ఎస్ఎస్ మనోజ్

– మ్యూజిక్: ఫ్లేవియో కుకురోలొ

– ప్రొడక్షన్ డిజైన్: అనిల్ పొగరు

– సౌండ్ డిజైన్: సాయి మనిందర్ రెడ్డి

– ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: విజయ్ కుమార్

– డిజిటల్ ప్రమోషన్: హౌస్ ఫుల్

– పీఆర్ఓ: జీఎస్ కే మీడియా (సురేష్ – శ్రీనివాస్)

– రచన: శ్రీనివాస్ మల్కార్

– బ్యానర్: ఒయాసిస్ ఎంటర్‌టైన్‌మెంట్

– కథ, నిర్మాత: ఎం.సి.రాజు

– స్క్రీన్ ప్లే, దర్శకత్వం: అమర్ కామెపల్లి