ఇటీవల జరిగిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికలలో వీరశంకర్ ప్యానెల్ సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలుపొందిన సంగతి తెలిసినదే. కాగా ఎన్నికైన నూతన కార్యవర్గం నేడు 16 ఫిబ్రవరి శుక్రవారం, రథసప్తమి పర్వదినాన దర్శకుల సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలను చేపట్టింది. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు వీరశంకర్ మాట్లాడుతూ.. తమ మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలుపరిచే దిశగా, గెలిచిన క్షణం నుండే కార్యాచరణను ప్రారంభించామని, మా సభ్యులు మాకిచ్చిన అతికొద్ది కాలంలోనే మా సంఘాన్ని TFDA 2.0గా తీర్చిదిద్దుతామని తెలియజేశారు.
ఈ సమావేశంలో ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సాయిరాజేష్, వశిష్టలతో పాటు ప్రధాన కార్యదర్శి సుబ్బారెడ్డి, కోశాధికారి రామారావు, సంయుక్త కార్యదర్శులు వడ్డాణం రమేష్, కస్తూరి శ్రీనివాస్, కార్యనిర్వాహక కార్యదర్శులు ప్రియదర్శిని, వంశీ దొండపాటి, కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన యువ దర్శకులు శ్రీరామ్ ఆదిత్య, శైలేష్ కొలను, విజయ్ కుమార్ కొండా, సీనియర్ దర్శకుడు రాజా వన్నెంరెడ్డి, డాక్టర్ క్రిష్ణమోహన్, కూరపాటి రామారావు,ఆకాష్, లక్ష్మణ్ రావు, రమణ మొగిలి, ప్రవీణ పాల్గొన్నారు.
బాధ్యతలు చేపట్టిన తెలుగు ఫిలిం డైరెక్టర్స్ అసోసియేషన్ కార్యవర్గం
బి.వీర శంకర్ – అధ్యక్షులు
నీలం సాయి రాజేశ్, వశిష్ట – ఉపాధ్యక్షులు
జనరల్ సెక్రటరీ – సి.హెచ్ సుబ్బారెడ్డి
ట్రెజరర్ – పీవీ రామారావు
జాయింట్ సెక్రటరీస్ – వడ్డాణం రమేష్, కస్తూరి శ్రీనివాస్
ఆర్గనైజింగ్ సెక్రటరీస్ – ప్రియదర్శిని, వంశీ దొండపాటి
ఎగ్జిక్యూటివ్ కమిటీ – శ్రీరామ్ ఆదిత్య, శైలేష్ కొలను, విజయ్ కుమార్ కొండా,
రాజా వన్నెంరెడ్డి, డాక్టర్ కృష్ణమోహన్, కూరపాటి రామారావు, ఆకాష్,
లక్ష్మణ్ రావు, రమణ మొగిలి, ప్రవీణ