హర్ష చెముడు, దివ్య శ్రీపాద ప్రధాన తారాగణంగా ఆర్.టి.టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా బ్యానర్స్‌పై కళ్యాణ్ సంతోష్ దర్శకత్వంలో రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు నిర్మాతలుగా రూపొందుతోన్న చిత్రం ‘సుందరం మాస్టర్’. సుందరం అనే టీచర్ చుట్టూ నడిచే కథే ఇది. తను గవర్నమెంట్ టీచర్. సోషల్ స్టడీస్ బోధిస్తుంటాడు. అయితే మిర్యాల మెట్ట అనే మారుమూల పల్లెలో ఇంగ్లీష్ టీచర్‌గా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అందులో అన్నీ వయసులవారు ఇంగ్లీష్ నేర్చుకోవటానికి విద్యార్థులుగా వస్తారు. మరి సుందరం మాస్టర్ వారికెలా ఇంగ్లీష్‌ను బోధించారు అనే విషయం ఎంటర్టైనింగ్గా రూపొందించిన చిత్రమే ఇది. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది.
న్యూ ఇయర్ సందర్భంగా ‘సుందరం మాస్టర్’ అటెండెన్స్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ‘సుందరం మాస్టర్’ మూవీ ఎంత ఎంటర్టైనింగ్గా ఉండనుందనే విషయాన్ని ఈ ప్రోమోలో మరోసారి ఎలివేట్ చేశారు. సినిమాలో కీలక పాత్రల్లో నటించిన ఆర్టిస్టులకు భిన్నమైన పేర్లు, అవెందుకు వచ్చాయనే బ్యాక్‌డ్రాప్‌తో ఉన్న ప్రోమో అందరినీ ఆకట్టుకుంటోంది. ఇందులో ‘సుందరం మాస్టర్’ రిలీజ్ డేట్‌ను మేకర్స్ అనౌన్స్ చేశారు. ఫిిబ్రవరి 16న ఈ హిలేరియస్ ఎంటర్టైనర్ను థియేటర్స్లతో ఎంజాయ్ చేయండంటూ మేకర్స్ ప్రకటించారు. ఇప్పటి వరకు కమెడియన్‌గా మెప్పించిన హర్ష చెముడు.. ‘సుందరం మాస్టర్’ మూవీలో తొలిసారి ప్రధాన పాత్రధారిగా ఎలా మెప్పించబోతున్నారోనని అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తోన్న ‘సుందరం మాస్టర్’ చిత్రానికి దీపక్ ఎరెగడ సినిమాటోగ్రఫీ అందించారు. చంద్రమౌళి ఆర్ట్ డైరెక్టర్‌గా వర్క్ చేశారు.
నటీనటులు: హర్ష చెముడు, దివ్య శ్రీపాద తదితరులు
సాంకేతిక వర్గం:
బ్యానర్స్: ఆర్.టి.టీమ్ వర్క్స్, గోల్ డెన్ మీడియా, నిర్మాతలు: రవితేజ, సుధీర్ కుమార్ కుర్రు, రచన, దర్శకత్వం: కళ్యాణ్ సంతోష్, మ్యూజిక్: శ్రీచరణ్ పాకాల, క్రియేటివ్ ప్రొడ్యూసర్స్: శ్వేత కాకర్లపూడి, షాలిని నంబు, సినిమాటోగ్రఫీ: దీపక్ ఎరెగడ, ఆర్ట్: చంద్రమౌళి, కాస్ట్యూమ్స్: శ్రీహిత కోటగిరి, రాజశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమంత్ కుర్రు, ఎడిటర్: కార్తీక్ ఉన్నవా, సౌండ్: సాయి మణిందర్ రెడ్డి, కొరియోగ్రఫీ: విజయ్ బిన్ని, పి.ఆర్.ఒ: వంశీ కాకా.