సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రధాన పాత్ర‌లో ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ చిత్రం ‘లాల్ సలామ్’ టీజర్ విడుదలైంది.

ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. ఎన్నో మ‌తాలు, కులాల వాళ్లు ఇక్క‌డ ఎలాంటి బేదాభిప్రాయాలు లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు. అయితే కొన్ని సంద‌ర్భాల్లో కొంద‌రు స్వార్థ రాజ‌కీయాల‌తో మ‌న‌లో మ‌న‌కు గొడ‌వ‌లు పెట్టారు. దీని వ‌ల్ల న‌ష్టం జ‌రిగింది. అయితే ఇలాంటి చెడు ప‌రిమాణాల నుంచి ప్ర‌జ‌ల‌ను, దేశాల‌ను కాపాడిన వారెందరో ఉన్నారు. అలాంటి ఓ హీరో మొయిద్దీన్ భాయ్‌.

మంచి క్రికెట‌ర్స్‌, ఫ్రెండ్స్ అయిన హిందూ, ముస్లిం యువ‌కులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆట‌ను మ‌తం పేరుతో గొడ‌వ‌లు ప‌డుతూ ఉంటే ఆ గొడ‌వ‌ల‌ను మొయిద్దీన్ భాయ్ ఎలా స‌ర్దుబాటు చేశారు. ప్ర‌జ‌ల మ‌ధ్య ఎలాంటి స‌ఖ్య‌త‌ను కుదిర్చార‌నేది తెలుసుకోవాలంటే ‘లాల్ స‌లామ్‌’ సినిమా చూడాల్సిందేనంటున్నారు లైకా ప్రొడ‌క్ష‌న్స్ ప్ర‌తినిధులు. మొయిద్దీన్ భాయ్ పాత్ర‌లో సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్ న‌టించ‌టం విశేషం. చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రానున్న సంక్రాంతికి విడుద‌ల‌వుతుంది.

దీపావ‌ళి సంద‌ర్భంగా ‘లాల్ స‌లామ్‌’ చిత్రం నుంచి టీజ‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే ముంబై వంటి సెన్సిటివ్ ప్రాంతంలో హిందువులు, ముస్లింలు మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌లు జ‌రిగిన‌ప్పుడు జ‌రిగిన న‌ష్టం ఏంటి? క‌్రికెట్‌ను ఎంతగానో ప్రేమించే ఇద్ద‌రు యువ‌కులు.. వారిలో ఒక‌రు హిందు, మ‌రొక‌రు ముస్లిం. ఇద్ద‌రి మ‌న‌సుల్లో మ‌తపూరిత ద్వేషం ఉండ‌టంతో క్రికెట్ ఆట‌లో ఒక‌రిపై ఒక‌రు పోటీ ప‌డే స‌న్నివేశాలు, దాని వ‌ల్ల వారిద్ద‌రూ మ‌తం పేరుతో గొడ‌వ‌లు ప‌డే స‌న్నివేశాల‌ను చూడొచ్చు. ఆట‌లో మ‌తాన్ని చేర్చారు. అంతే కాకుండా పిల్ల‌ల మ‌న‌సుల్లో విషాన్ని నింపారు అని అక్క‌డున్న పెద్ద‌ల‌ను మొయిద్ధీన్ పాత్ర తిడుతుంది. అలాగే హిందు, ముస్లింలు గొడ‌వ ప‌డుతున్న‌ప్పుడు.. మొయిద్దీన్ భాయ్ ఆ ప్రాంతంలో శాంతి కోసం ఏం చేశార‌నే క‌థాంశంతో ‘లాల్ స‌లాం’ రూపొందింద‌ని టీజ‌ర్ చూస్తుంటే అర్థమ‌వుతుంది. ఎప్ప‌టిలాగానే సూప‌ర్ స్టార్ రజినీకాంత్ త‌న‌దైన స్టైలింగ్ పెర్ఫామెన్స్‌తో ఆక‌ట్టుకోనున్నారు. విష్ణు విశాల్‌, విక్రాంత్ యువ క్రికెట‌ర్స్‌గా అలరించబోతున్నారు. త‌మిళ‌, తెలుగు, హిందీ, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ సినిమా గ్రాండ్ రిలీజ్ అవుతుంది.

అగ్ర హీరోల‌తో భారీ బ‌డ్జెట్ సినిమాల‌ను నిర్మించ‌టంతో పాటు డిఫ‌రెంట్ కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల‌కు ప్రాధాన్య‌త‌నిస్తూ రూపొందిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్ష‌న్స్. ఈ బ్యాన‌ర్‌పై ఎన్నో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. అలాంటి క్రేజీ ప్రాజెక్ట్స్‌లో ఒక‌టి ‘లాల్ సలామ్‌’. ఈ చిత్రాన్ని ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇందులో ముంబై డాన్‌ మొయిద్దీన్ భాయ్‌గా సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్ న‌టిస్తుండ‌టం విశేషం. ర‌జినీకాంత్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెంజెండ్ క‌పిల్ దేవ్ త‌దిత‌రులు న‌టించారు. రీసెంట్‌గా జైల‌ర్‌తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన తలైవ‌ర్ ఇప్పుడు ‘లాల్ సలాం’తో సంక్రాంతికి అల‌రించ‌నుండ‌టంతో ఆయ‌న అభిమానుల‌తో పాటు సినీ ప్రేక్ష‌కుల్లోనూ అంచ‌నాలు పీక్స్‌కు చేరుకున్నాయి.

నటీనటులు:

సూప‌ర్‌స్టార్ ర‌జినీకాంత్‌, విష్ణు విశాల్‌, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క‌పిల్ దేవ్‌, సెంథిల్, తంబి రామ‌య్య‌, అనంతిక‌, వివేక్ ప్ర‌స‌న్న‌, తంగ దురై త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు:

బ్యాన‌ర్‌: లైకా ప్రొడ‌క్ష‌న్స్‌, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: ఐశ్వ‌ర్య ర‌జినీకాంత్, నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌, సంగీతం: ఎ.ఆర్‌.రెహ‌మాన్‌, సినిమాటోగ్ర‌ఫీ: విష్ణు రంగస్వామి, ఎడిటింగ్‌: బి.ప్ర‌వీణ్ భాస్క‌ర్‌, లైకా ప్రొడ‌క్ష‌న్స్ హెడ్‌: జి.కె.ఎం.త‌మిళ్ కుమ‌ర‌న్‌, ఆర్ట్‌: రాము తంగ‌రాజ్, స్టైలిష్ట్‌: స‌త్య ఎన్‌.జె, స్టంట్స్‌: అన‌ల్ అర‌సు, కిక్కాస్ కాళి, స్టంట్ విక్కీ, స్టోరి: విష్ణు రంగ‌స్వామి ప‌బ్లిసిటీ డిజైన‌ర్‌: శివ‌మ్ సి.క‌బిల‌న్‌, పి.ఆర్‌.ఒ (తెలుగు): నాయుడు సురేంద్ర కుమార్ – ఫ‌ణి కందుకూరి (బియాండ్ మీడియా).