నందమూరి కళ్యాణ్ రామ్..విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ, వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న స్టార్ హీరో. ఈయన కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్.
రీసెంట్‌గా రిలీజైన ఈ మూవీ టీజర్‌కి అమేజింగ్ రెస్పాన్స్ రావటంతో పాటు సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘డెవిల్’ మూవీ నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న రిలీజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో డెవిల్ సినిమా నుంచి ‘మాయే చేశావే..’ అనే పాటను తొలి సాంగ్‌గా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాటను ఐకాన్ మ్యూజిక్ విడుదల చేసింది.
‘మాయే చేశావే..’ పాటను గమనిస్తే ఇదొక అద్బుతమైన మెలోడీ సాంగ్. పాట వింటున్నప్పుడు ప్రేక్షకులు అందమైన అనుభూతికి లోనవుతారు. స్వాతంత్ర్యం రాక ముందు ఉన్న బ్యాక్ డ్రాప్‌తో డెవిల్ సినిమాను తెరకెక్కించారు. సన్నివేశాలు, పాటలను కూడా అలాగే చిత్రీకరించారు. కాస్ట్యూమ్స్, బ్యాగ్రౌండ్ ఇలా ప్రతీ విషయంలో మేకర్స్ పలు జాగ్రత్తలను తీసుకున్నారు. స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడటం ఇంకా హైలైట్‌గా నిలిచింది. కచ్చితంగా ఈ పాట ఆడియెన్స్ ప్లే లిస్ట్ లో రిపీటెడ్ సాంగ్ అవుతుంది.
ఈ పాటకు బృంద మాస్టర్ నృత్యాన్ని సమకూర్చారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సూపర్బ్ రెట్రో ట్రాక్‌ను అందించారు. కళ్యాణ్ రామ్, సంయుక్త మధ్య అద్భుతమైన కెమిస్ట్రీ కుదిరింది. మాయే చేశావే.. సాంగ్‌తో మేకర్స్ ఓ ఎగ్జయిటింగ్ మ్యూజికల్ జర్నీని స్టార్ట్ చేసి ప్రేక్షకుల హృదయాలను ఆకట్టుకున్నారు.
పాటలో కళ్యాణ్ రామ్, సంయుక్త అద్బుతమైన నటనతో మెప్పించారు. వీరి మధ్య కుదిరిన చక్కటి కెమిస్ట్రీ ఆడియెన్స్‌ని ఎంతో గొప్పగా అలరిస్తుంది. భారీ చిత్రాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించింది. ప్రొడక్షన్ డిజైనర్ గాంధీ నడికుడికర్ వేసిన ఎక్స్‌ట్రార్డినరీ సెట్స్ విజువల్ రిచ్‌నెస్‌ను తీసుకు వస్తాయి. దీనికి సౌందర్ రాజ్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా తమ్మిరాజు ఎడిటర్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
శ్రీకాంత్ విస్సా అద్భుతమైన కథ, కథనం, మాటలను సమకూర్చారు. ఇది ప్రేక్షకులను కట్టిపడేసింది. త్వరలోనే ఈ స్పై థ్రిల్లర్ గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మేకర్స్ తెలియజేయనున్నారు.
ఏ ఫిల్మ్ బై అభిషేక్ పిక్చర్స్
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, సంయుక్త తదితరుల.
సాంకేతిక వర్గం:
సమర్పణ: దేవాన్ష్ నామా
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
డైరెక్టర్, ప్రొడ్యూసర్ : అభిషేక్ నామా
సీఈఓ : వాసు పోతిని
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్.ఎస్
కథ, స్క్రీన్ ప్లే, మాటలు: శ్రీకాంత్ విస్సా
మ్యూజిక్: హర్షవర్ధన్ రామేశ్వర్
ప్రొడక్షన్ డిజైనర్: గాంధీ నడికుడికర్
ఎడిటర్: తమ్మిరాజు
స్టోరి డెవలప్‌మెంట్: ప్రశాంత్ బరాడి
కోడైరెక్టర్: చలసాని రామారావు
పి.ఆర్.ఒ: వంశీ కాకా
రీరికార్డింగ్ మిక్స్: ఎ.ఎం.రహ్మతుల్లా, ఎం.రహ్మతుల్లా
స్టంట్స్: వెంకట్ మాస్టర్
పోస్టర్ డిజైన్స్: కన్నీ స్టూడియోస్
డిజిటల్ మార్కెటింగ్: వాల్స్ అండ్ ట్రెండ్స్
కాస్ట్యూమ్ డిజైన్స్: అశ్విన్ రాజేష్