స్లమ్‌డాగ్ హస్బెండ్ సినిమా రివ్యూ – కుటుంబాని అలరించే చిత్రం

సినిమా : స్లమ్‌డాగ్ హస్బెండ్

విడుదల తేదీ : జూలై 29, 2023

నటీనటులు : సంజయ్ రావ్, ప్రణవి మనుకొండ, బ్రహ్మాజీ, సప్తగిరి, రఘు కారుమంచి, యాదమ్మ రాజు, మురళీధర్ గౌడ్

దర్శకుడు : ఏఆర్ శ్రీధర్

నిర్మాతలు : అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి

సంగీతం : భీమ్స్ సిసిరోలియో

సినిమాటోగ్రఫీ : శ్రీనివాస్ జె రెడ్డి

ఎడిటర్ : ఎ వైష్ణవ్ వాసు

“పిట్ట కథ” సినిమాతో తెరంగేట్రం చేసిన సంజయ్ రావు కథానాయకుడిగా నటిస్తున్న సినిమా “స్లమ్‌డాగ్ హస్బెండ్” (Slumdog Husband) ఔట్ అండ్ ఔట్ కామెడీ ఫ్లిక్ గా రూపొందిన ఈ సినిమా బ్రహ్మాజీ, సప్తగిరి, ‘ఫిష్’ వెంకట్, మురళీధర్ గౌడ్, వేణు పొలసాని తదితరులు కీలక పాత్రల్లో కనిపించగా ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ రోజే విడుదలయిన ఈ సినిమా ఎలా ఉందో ఈ సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

లచ్చి అలియాస్ లక్ష్మణ్ (సంజయ్ రావ్) ఓ బస్తి లో నివసించే కుర్రాడు. మౌనిక (ప్రణవి మానుకొండ)తో ప్రేమలో ఉంటాడు. ప్రేమలో ఉండే ఇబ్బందులు పడలేక వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే జాతకరీత్యా లక్ష్మణ్ ముందుగా ఓ కుక్కతో వివాహం చేసుకోవాలని పంతులు చెబుతాడు. అయన చెప్పిన విధంగా ఓ కుక్కని పెళ్లి చేసుకుంటాడు. ఇక తర్వాత తమ పెళ్లి అని సంతోషంలో రెడీ అవుతున్న ఇద్దరికీ సడెన్ గా ఓ షాక్ తగులుతుంది. ఆ పరిస్థితులలో వారు ఎలాంటి పరిణామాలను ఎదుర్కొన్నారు అనేదే సినిమా కథ.

నటీనటులు : సంజయ్‌రావు నటన బాగుంది. ఇంతకుముందు సినిమాలు, సీరియళ్లలో రోల్స్ చేసిన ప్రణవి ఈసారి భిన్నంగా కనిపించింది. గ్లామర్ పెద్దగా చూపించకపోయినా కేవలం ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంది, కొన్ని సీన్స్ లో మసాలా డోస్ పెంచి అందరిని అలరించింది. ఆమెకు మరిన్ని అవకాశాలు రావచ్చు. ఈ సినిమాలో యాదమ్మ రాజు మరో సర్ ప్రైజ్. మంచి కామెడీని అందించడమే కాకుండా, ఎండింగ్ లో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. కుక్క యజమానిగా వేణు పొలసాని కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు. సప్తగిరి మరియు బ్రహ్మాజీ ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. రఘు కారుమంచి, మురళీధర్ గౌడ్ తదితరులు రెగ్యులర్ పాత్రల్లో నటించగా తమ పాత్ర పరిధిమేరకు బాగా ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు : దర్శకుడిగా పరిచయం అయిన ఏఆర్ శ్రీధర్ రాసుకున్న కాన్సెప్ట్ బాగుంది. చికిత్సలో తక్కువ హాస్య పంక్తులు ఉన్నాయి. రొమాంటిక్ సన్నివేశాలను చిత్రీకరించడంలో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మాస్ పల్స్ ఆయన ఆధ్వర్యంలోనే ఉంటుంది. బీమ్ యొక్క “సిసెరోరియో” పాట చిత్రానికి ఘనతనిస్తుంది. అతను “మౌనికా ఓ మై డార్లింగ్” తరహాలో “మేరే చోటా దిల్” అనే రెట్రో పాటను కంపోజ్ చేశాడు. వీడియో పాటలు విడుదలైన తర్వాత వైరల్‌గా మారవచ్చు. “లచ్చి గాని పెళ్లి” పాట కూడా చెడ్డది కాదు. కాసర్ల శ్యామ్ మరియు సురేష్ గంగుల ప్రసిద్ధ పాటలు రాశారు. నేపథ్య సంగీతం ఓకే. నిర్మాత అప్పిరెడ్డి ఇప్పటికే కథ కోసం ఖర్చు పెట్టాడు. ప్రొడక్షన్ వాల్యూస్ స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. సినిమాటోగ్రఫీ బాగుంది.

ప్లస్ పాయింట్స్ :

కథ

నటీనటులు

నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్ :

అక్కడక్కడా స్క్రీన్ ప్లే వీక్ గా ఉండడం

స్లో నేరేషన్

కుక్కను పెళ్లి చేసుకోవడం వల్ల హీరోకు ఎదురయ్యే ఇబ్బందులు, దాన్నుంచి బయటపడేందుకు ఏం చేస్తాడు, అతని జీవితం ఎంత గందరగోళానికి గురైంది అనే అంశాల నేపథ్యంలో చిత్ర దర్శకుడు ఏఆర్ శ్రీధర్ దీనిని హాస్యభరితంగా తీర్చిదిద్దారు. మంచి కామెడీ సినిమా.. బీసీ సెంటర్స్ లో ఈ సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ కావడం ఖాయం.

రేటింగ్ : 3/5