చిత్రం – అన్నపూర్ణ స్టూడియో
నటీనటులు – చైతన్య రావ్, లావణ్య, మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య తదితరులు
బ్యానర్ – బిగ్ బెన్ సినిమాస్
నిర్మాత – యష్ రంగినేని
దర్శకత్వం – చెందు ముద్దు
చైతన్య రావ్, లావణ్య జంటగా నటించిన చిత్రం అన్నపూర్ణ ఫోటో స్టూడియో. బిగ్ బెన్ సినిమాస్ పతాకంపై యష్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. చెందు ముద్దు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో మిహిరా, ఉత్తర, వైవా రాఘవ, లలిత్ ఆదిత్య వంటి వారు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ రోజు (21.7.2023) ఈ సినిమా థియేటర్స్ కి వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది… ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందా… మంచి వసూళ్లు సాధిస్తుందా తదితర విషయాలను రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
1980 ల నేపథ్యం కలిగిన స్టోరీ తో తెరకేకినా సినిమా ఇది. కపిలేశ్వరపురం ఊరికి చెందిన చంటి (చైతన్య రావు) సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యి పక్క ఊరికి వెళ్లి ఎత్తైన కొండ మీద నుంచి దూకేస్తాడు. అయితే కొండ మీద నుంచి దూకిన చంటి పోలీసుల జీపు పై పడతాడు. తను రాసుకున్నసూసైడ్ లెటర్ తో పాటు చంటి పోలీసులకు దొరికిపోతాడు. చంటిని హాస్పటల్లో అడ్మిట్ చేసి, సూసైడ్ లెటర్ చదవడం మొదలుపెడతారు. చంటి స్టోరీ లోకి వెళితే…
తన ఊరిలో అన్నపూర్ణ ఫోటో స్టూడియోను రన్ చేస్తుంటాడు చంటి. వయసు మీద పడినా పెళ్లి మాత్రం అవ్వదు. సరిగ్గా అలాంటి టైమ్ లో గౌతమి (లావణ్య) తో ప్రేమలో పడతాడు చంటి. కొన్ని సంఘటనల తర్వాత లావణ్య కూడా చంటిని ప్రేమించడం మొదలుపెడుతుంది. చంటికి ప్రాణ గండం ఉందని తెలుసుకున్న లావణ్య చాలా భయపడుతుంది. ఇలాంటి సమయంలో ఓ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఓ వ్యక్తిని హత్య చేస్తాడు చంటి. ఈ హత్యను ఫోటోలు తీసిన ఓ వ్యక్తి చంటిని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఈ విషయం బయటికి రాకుండా ఉండాలంటే, మరో హత్య చేయాలని ఆ వ్యక్తి చంటిని డిమాండ్ చేస్తాడు.
చంటి ని బ్లాక్ మెయిల్ చేస్తున్న వ్యక్తి ఎవరు? హత్యలకు చంటికి లింకేంటీ? చంటి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటాడు? పోలీసులు చంటిక సాయం చేస్తారా తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
చైతన్యరావు చంటి పాత్రలో చాలా బాగా నటించాడు. కొన్ని సీన్స్ లో అతని నటన ఆడియన్స్ కి నవ్వులు తెప్పిస్తుంది. న్యాచురల్ పెర్ ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు చైతన్యరావు. హీరోయిన్ గా లావణ్య తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. లుక్స్ బాగున్నాయి. ఉత్తర రెడ్డి, హీరో చెల్లెలు గా నటించిన పద్దు పాత్రలు ఆడియన్స్ కి గుర్తుండి పోతాయి. కానిస్టేబుల్ గా ఇంటూరి వాసు పాత్ర నవ్వులు పూయిస్తుంది. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. ఇక నిర్మాత యష్ రంగినేని ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. ఫస్ట్ సినిమా అయినప్పటికీ, అనుభవం ఉన్న నటుడిలా నటించి మెప్పించారు.
సాంకేతిక వర్గం
ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ చెందు ముద్దు. గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే తో ఫస్ట్ హాఫ్ ని మెప్పించిన చెందు ముద్దు… సెకండాఫ్ విషయంలో ఇంకొంత కేర్ తీసుకుని ఉంటే బాగుండేది. ఫోటో స్టూడియో నేపథ్యంలో కథ ఉంటుందని భావిస్తారు. కానీ టైటిల్ కి కథ కు ఎలాంటి సంబంధం లేదు. విజువల్స్ బాగున్నాయి. ప్రిన్స్ హెన్రీ అందించిన సాంగ్స్ బాగున్నాయి. కథకు సరిపడా బడ్జెట్ సమకూర్చడంతో నిర్మాణపు విలువలు బాగున్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఆడియన్స్ నవ్వుకుంటారు. బి,సి సెంటర్ ఆడియన్స్ కి ఈ విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ కనెక్ట్ అవుతుంది. అక్కడక్కడా బోర్ కొట్టించే సన్నివేశాలు ఉన్నప్పటికీ, ఓవరాల్ గా ఒక్కసారి సినిమా చూడొచ్చు అనే ఫీల్ ని కలిగిస్తుంది. కాబట్టి ఈ వీకెండ్ ఈ సినిమాని థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.
రేటింగ్ – 3.5/5