https://twitter.com/SKNonline/status/1678033301800632320?t=UKJ7il_IAwNs1OpcdHmR3Q&s=08
నిర్మాత ఎస్.కే.ఎన్ గురించి, ఆయన చేసే సేవా కార్యక్రమాలు సోషల్ మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఎవరికైనా ఏదైనా సాయం కావాలన్నా, ఆర్థిక సాయం చేయాలన్నా కూడా ఎస్.కే.ఎన్ ముందుంటారు. నిర్మాతగా తన అభిరుచిని చాటుతూ మంచి చిత్రాలు తీస్తోన్న ఎస్.కే.ఎన్ ఇలా సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటారు.
స్టేజ్ ఎక్కితే ప్రాసలు, పంచ్‌లతో ఆడియెన్స్‌ను అలరించే ఎస్.కే.ఎన్.. ఇలా తనకు వీలైనంతలో సాయం చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. తాజాగా ఆయన తన తోటి స్నేహితుడి బిడ్డ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోంది. దీంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విరాళం కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో చలించిన ఎస్.కే.ఎన్ లక్ష రూపాయాల ఆర్థిక సాయాన్ని అందించారు. అంతే కాకుండా దాతలైవరైనా ఉంటే ముందుకు రావాలని కోరారు.
‘చిన్న పిల్లలు దేవుడితో సమానం.. ఈ బిడ్డ ప్రాణాంతాక వ్యాధితో బాధపడుతోంది.. నేను లక్ష రూపాయాల ఆర్థిక సాయాన్ని అందించాను.. నా స్నేహితులు, మా అభిమానులను కూడా తోచినంత విరాళాన్ని ఇవ్వాలని కోరుతున్నాను.. బిడ్డను ఆ దేవుడు చల్లగా ఆశీర్వదించాల’ని కోరుతూ ఎస్.కే.ఎన్ వేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఎస్.కే.ఎన్ నిర్మించిన బేబీ చిత్రం జూలై 14న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. సాయి రాజేష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆనంద్ దేవరకొండ, వైష్ణవీ చైతన్య, విరాజ్ అశ్విన్‌లు ముఖ్య పాత్రలు పోషించారు.