ఎమోష‌న‌ల్ జ‌ర్నీగా రూపొందిన ‘విమానం’ మూవీ నుంచి మే 22న ‘సుమతి’ లిరికల్ సాంగ్ రిలీజ్

సినీ రంగంలోకి ఎంద‌రో న‌టీన‌టులు త‌మ‌దైన గుర్తింపు సంపాదించుకున్నారు. అందుకు కార‌ణం వాళ్లు ఎంపిక చేసుకునే విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌లే. అలాంటి వెర్స‌టాలిటీ లేక‌పోతే ఆడియెన్స్‌కు క‌నెక్ట్ కారు. అలాంటి డిఫ‌రెంట్ రోల్స్‌తో త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును సంపాదించుకున్న న‌టి అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. రంగ‌స్థ‌లంలో రంగ‌మ్మ‌త్త‌గా అయినా, పుష్ప 2లో దాక్షాయ‌ణిగా అయినా మెప్పించ‌టం ఆమెకే చెల్లింది. ఇప్పుడలాంటి మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌టానికి రెడీ అవుతోంది అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌. ఆ సినిమాయే ‘విమానం’.

ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన పాత్ర‌ల‌న్నింటితో పోల్చితే ‘విమానం’ చిత్రంలో ఆమె చేసిన సుమ‌తి పాత్ర చాలా వెరైటీగా ఉంటుంద‌ని రీసెంట్‌గా విడుద‌లైన స‌ద‌రు పాత్ర ఫ‌స్ట్ లుక్ చూస్తుంటేనే అర్థ‌మ‌వుతుంది. ఓ వైపు బోల్డ్‌గా ఉంటూనే ఎమోష‌న‌ల్ ట‌చ్‌తో ఉండే పాత్ర ఆమెది. ఆమె పాత్ర‌కు సంబంధించి ‘సుమతి..’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను మే 22న విడుద‌ల చేయ‌బోత‌న్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. ఇప్ప‌టికే విడుద‌లైన మూవీ టీజ‌ర్‌, రేలా రేలా అనే లిరికల సాంగ్‌తో పాటు సుమ‌తి పాత్ర ఫ‌స్ట్ లుక్‌, వీడియో గ్లింప్స్‌తో సినిమాపై మంచి బ‌జ్‌ను క్రియేట్ చేసింది. ఈ చిత్రంలో వీర‌య్య అనే అంగ వైకల్యం ఉన్న తండ్రి పాత్ర‌లో స‌ముద్ర ఖ‌ని, కొడుకు పాత్రలో మాస్టర్ ధ్రువన్ న‌టిస్తుండగా సుమ‌తి పాత్ర‌లో అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, రాజేంద్ర‌న్ పాత్ర‌లో రాజేంద్ర‌న్‌, డేనియ‌ల్ పాత్ర‌లో ధ‌న్‌రాజ్‌, కోటి పాత్ర‌లో రాహుల్ రామ‌కృష్ణ ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో మెప్పించబోతున్నారు.

మ‌న‌కు జీవితంలో క‌నిపించే వివిధ పాత్ర‌లకు సంబంధించిన ఎమోష‌న‌ల్ జ‌ర్నీ ’విమానం’. జూన్ 9న ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. శివ ప్రసాద్ యానాల దర్శకత్వంలో జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌) ‘విమానం’ చిత్రాన్ని నిర్మించారు.

న‌టీన‌టులు:

స‌ముద్ర ఖ‌ని, అన‌సూయ భ‌ర‌ద్వాజ్‌, మాస్ట‌ర్ ధ్రువ‌న్‌, మీరా జాస్మిన్, రాహుల్ రామ‌కృష్ణ‌, ధ‌న్‌రాజ్‌, రాజేంద్ర‌న్

సాంకేతిక వ‌ర్గం:

ప్రొడ్యూస‌ర్స్‌: జీ స్టూడియోస్‌, కిర‌ణ్ కొర్ర‌పాటి (కిర‌ణ్ కొర్ర‌పాటి క్రియేటివ్ వ‌ర్క్స్‌)

ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: శివ ప్ర‌సాద్ యానాల‌

సినిమాటోగ్ర‌పీ: వివేక్ కాలేపు

ఎడిట‌ర్‌: మార్తాండ్ కె.వెంక‌టేష్‌

మ్యూజిక్‌: చ‌ర‌ణ్ అర్జున్‌

ఆర్ట్‌: జె.జె.మూర్తి

డైలాగ్స్‌: హ‌ను రావూరి (తెలుగు), ప్ర‌భాక‌ర్ (త‌మిళం)

లిరిక్స్ : స్నేహ‌న్‌(తమిళ్), చరణ్ అర్జున్ (తెలుగు)

పి.ఆర్‌.ఒ: నాయుడు – ఫ‌ణి (బియాండ్ మీడియా) (తెలుగు), యువ‌రాజ్ (త‌మిళ్‌)

డిజిట‌ల్ ఏజెన్సీ: హ్యాష్ ట్యాగ్ మీడియా