టీజర్, ట్రైలర్ మంచి హైప్‌ను క్రియేట్ అయిన ‘1000 వాలా’ మూవీ రివ్యూ!!

1000 Wala Movie : 1000 వాలా.. త్వరలోనే రిలీజ్.. భారీగా ప్రీ రిలీజ్ ఈవెంట్..  | Amith 1000 wala movie releasing soon post productions completed sy-10TV  Telugu

మార్చి 14న థియేటర్లలో విడుదల అయిన ‘1000 వాలా’ సినిమా, ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని కలిగించింది. ఈ చిత్రాన్ని సూపర్ హిట్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై షారుఖ్ నిర్మించగా, యువ కథానాయకుడు అమిత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ముఖ్యపాత్రల్లో సీనియర్ నటులు సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్ నటించారు. అద్భుతమైన నిర్మాణ విలువలతో తెరకెక్కిన ఈ చిత్రం, మాస్ మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ సమపాళ్లలో మేళవించబడింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. కథలోని ఆసక్తికరమైన ఎలిమెంట్స్ ప్రేక్షకులను థ్రిల్ చేయనున్నాయి. థియేటర్లలో ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోవడం ఎంతవరకు సాధ్యమవుతుందో చూడాలి.

కథ :

అర్జున్ (అమిత్) చిన్నప్పుడు తల్లిదండ్రులను కోల్పోయి తాతయ్య వద్ద పెరుగుతాడు. నటుడిగా మారాలని కలలు కంటూ, స్నేహితుడి సహాయంతో సినీరంగంలో అడుగుపెడతాడు. భవాని ప్రసాద్ (ముక్తార్ ఖాన్)ను కలిసిన అతనికి, స్నేహితుడు (సుమన్) సినిమా నిర్మిస్తానని మాట ఇస్తాడు. ఇదే సమయంలో హీరోయిన్ శైలాతో ప్రేమలో పడతాడు. కథ మలుపు తిరుగుతూ, చనిపోయిన అమిత్ స్థానంలో తనను పెట్టి సినిమా కంప్లీట్ చేస్తున్నారని అర్జున్ తెలుసుకుంటాడు. మరోవైపు డేవిడ్ (షారుఖ్ భైగ్) కావ్యను చంపేందుకు ప్రయత్నిస్తాడు, కానీ ఆమె అమిత్ హత్య వెనుక ఉన్న నిజాన్ని అర్జున్‌కు వెల్లడిస్తుంది. అమిత్ హత్య వెనుక ఉన్న రహస్యాలు, అర్జున్ దీనిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే మిగతా కథ.

విశ్లేషణ:

‘1000 వాలా’ చిత్రం కమర్షియల్ కథకు కుటుంబ భావోద్వేగాలను జోడించి మంచి సినిమా గా అందించింది. అఫ్జల్ షేక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. టైటిల్ నుండే మాస్ అంశాలను జోడించి ఆద్యంతం అలరించే స్క్రీన్ ప్లేను అందించాడు. మొదటి భాగంలో తాత మనవళ్ల సెంటిమెంట్, ఇంటర్వెల్ ఫైట్ మాస్ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. రెండవ భాగంలో కుటుంబ భావోద్వేగాలు, ముఖ్యంగా తల్లి సెంటిమెంట్ బాగా పండింది. సంభాషణలు కూడా బాగున్నాయి.

పల్లెటూరి అందాలను చందు ఏజే సినిమాటోగ్రఫీ అద్భుతంగా చూపించింది. వంశీ కాంత్ రేఖాన సంగీతం సినిమాకి ప్రధాన బలం. ముఖ్యంగా చివరి పాట మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. నేపధ్య సంగీతం కూడా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్ కథకు తగ్గట్టుగా ఉంది.

అమిత్ డ్రీం స్టార్ ద్విపాత్రాభినయం మెప్పించింది. అర్జున్, అమిత్ పాత్రల్లో రెండు రకాల ఛాయలను చక్కగా చూపించాడు. డ్యాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. షారుఖ్ భైగ్ స్టైలిష్ విలన్ గా కనిపించాడు. హీరోకి ధీటుగా నటించి ఆకట్టుకున్నాడు. సుమన్, ముక్తార్ ఖాన్, పిల్లా ప్రసాద్ తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. మిగతా నటీనటులు కూడా తమ పరిధి మేరకు నటించారు. మాస్ ప్రేక్షకులతో పాటు కుటుంబ ప్రేక్షకులను కూడా ఈ చిత్రం అలరిస్తుంది. దర్శకుడి ప్రతిభ, నటీనటుల నటన, సాంకేతిక అంశాలు సినిమాను విజయవంతం చేశాయి.

ప్లస్ పాయింట్స్:

  • దర్శకత్వం: అఫ్జల్ షేక్ దర్శకత్వం కమర్షియల్ అంశాలను ఫ్యామిలీ సెంటిమెంట్ తో మిళితం చేసి ఆకట్టుకుంది.
  • సంగీతం: వంశీ కాంత్ రేఖాన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా నిలిచింది.
  • నటన: అమిత్ డ్రీం స్టార్ ద్విపాత్రాభినయం, షారుఖ్ భైగ్ విలన్ గా, సీనియర్ నటులు సుమన్, ముక్తార్ ఖాన్, పిల్లా ప్రసాద్ చక్కని నటనను కనపరిచారు.
  • కథనం: గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే సినిమాను ఆసక్తికరంగా నడిపించింది.
  • సినిమాటోగ్రఫీ: చందు ఏజే సినిమాటోగ్రఫీ పల్లెటూరి అందాలను అందంగా చిత్రీకరించింది.
  • ఇంటర్వెల్ ట్విస్ట్: ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ మాస్ ఆడియన్స్ కి మంచి ఫీస్ట్ ఇస్తుంది.
  • క్లైమాక్స్: క్లైమాక్స్ ఆకట్టుకునేలా ఉంది.

మైనస్ పాయింట్స్ :

సెకండాఫ్ లో ల్యాగ్: రెండవ భాగంలో కొన్ని చోట్ల సాగతీత ఉన్నట్లు అనిపిస్తుంది.

‘1000 వాలా’ చిత్రం ఓవరాల్ గా చూస్తే మాస్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. మంచి దర్శకత్వం, సంగీతం, నటీనటుల ప్రతిభ, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. ఈ వీకెండ్ లో థియేటర్లలో చూడదగిన సినిమా ఇది.

రేటింగ్ : 2.75/5