1 మిలియన్ అందుకున్న ఆనంద్ దేవరకొండ ‘బేబీ’ టీజర్!!

ఆనంద్ దేవరకొండ హీరో గా నటిస్తున్న తాజా చిత్రం బేబీ. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ నిన్న విడుదల అయ్యింది. ఈ మేరకు హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్ లో ఓ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ టీజర్ ను ఆవిష్కరించారు. ఇప్పటికే పలు విభిన్నమైన సినిమాల్తో ఆకట్టుకున్న ఆనంద్ తన గత సినిమాల తరహా లోనే ఓ విభిన్నమైన కాన్సెప్ట్ ను ఎంచుకున్నాడని ఈ టీజర్ ను బట్టి తెలుస్తుంది.

పలు షార్ట్ ఫిలిమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న వైష్ణవి ఈ సినిమా లో హీరోయిన్ గా నటించగా ఆమె డీ గ్లామర్ పాత్ర లో కనిపించడం కొసమెరుపు. ఈ సినిమా లో అదే హైలైట్ అవుతుందని చెబుతున్నారు. ఈ సినిమా లో మరో కీలక పాత్ర లో నటిస్తున్నాడు విరాజ్. టీజర్ లో అయన ఎక్కువగా కనిపించకపోయినప్పటికీ సినిమాలో అయన ఎంతో కీలక పాత్ర అని తెలుస్తుంది.

టీజర్ విషయానికొస్తే, దర్శకుడు ఎంతో జాగ్రత్తగా చేసిన సినిమాగా కనిపిస్తుంది. ప్రతి ఫ్రేమ్ ఎంతో బాగుంది. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ ఎంతో అద్భుతంగా చూపించాడు. స్కూల్ కుర్రాడిలా ఆనంద్ దేవరకొండ ఒదిగిపోయాడని చెప్పాలి.

ఏదేమైనా ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యేలా టీజర్ ను రూపొందించారు. సోషల్ మీడియా లో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు ప్రేక్షకులు కామెంట్స్ పెడుతున్నారు. వచ్చే ఏడాది ఈ సినిమా ను విడుదల చేసుందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా కు విజయ్ బుల్గానిన్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. తాజాగా ఈ టీజర్ కి మిలియన్ వ్యూస్ రావడం విశేషం. టీజర్ విదుదలైన 24 గంటలు కాకముందే ఈ స్థాయి లో వ్యూస్ రావడం విశేషం.