హిట్ 3 .. మల్టీ స్టారర్ సినిమానా?

హిట్ రెండు భాగాలూ సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు హిట్ 3 పైనే అందరి దృష్టి ఉంది. హిట్ 3లో నాని నటిస్తున్నాడని ఆల్రెడీ హింట్ ఇచ్చేశాడు డైరెక్టర్ శైలేష్. హిట్ 2 లో దీన్ని స్పష్టం చేశారు. అయితే ఈ థర్డ్ కేసు లో కేవలం నాని మాత్రమే కాదు హిట్ 1 2 హీరోలు కూడా నటిస్తారని తెలుస్తుంది.

అవును హిట్ 3 ఒక క్రేజీ మల్టీస్టారర్ గా ప్లాన్ చేస్తున్నాడట డైరెక్టర్ శైలేష్.హిట్ ఫస్ట్ అండ్ సెకండ్ కేస్ రెండిటిలో కేవలం సోలో హీరోలే చేస్తూ వచ్చారు. కానీ థర్డ్ కేస్ భారీగా ఉండబోతుందట.

అంతేకాదు హిట్ 3 బడ్జెట్ కూడా పెంచబోతున్నరట. హిట్ 3లో నాని అర్జున్ సర్కార్ పాత్రలో కనిపించనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా యొక్క షూటింగ్ మొదలు కాబోతుంది.