హిట్ 2 పై ఆసక్తి పెంచేస్తున్న ట్రైలర్!!

అడివి శేష్ హీరో గా నటించిన హిట్ 2 సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. శైలేష్ కోనేరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కి నాని నిర్మాత గా వ్యవహరిస్తుండగా హిట్ సినిమా కి సీక్వెల్ గా ఈ సినిమా విడుదల కాబోతుంది.

సెంబర్ 2వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్ హైదరాబాదులోని ఆర్కే సినీప్లెక్స్ లో ట్రైలర్ లాంచ్ ఈవెంటును నిర్వహించింది. ఈ వేదిక ద్వారా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

ఓ యువతి హత్య కేసును పోలీస్ ఎలా చేధించాడు అనేదే ఈ సినిమా యొక్క కథ అని తెలుస్తుంది. ‘మేజర్’ వంటి సూపర్ హిట్ తరువాత శేష్ చేసిన సినిమా కావడం వలన, సహజంగానే ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా కు ఏ స్థాయి లో గుర్తింపు వస్తుందో చూడాలి.