హరీష్ శంకర్ ఇంకా ఎన్నాళ్ళు ఖాళీగా ఉంటాడు?

టాలీవుడ్ మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ తదుపరి సినిమా ను మొదలుపెట్టకపోవడం అయన అభిమానులను నిరాశపరుస్తుంది. పవన్ కళ్యాణ్ తో సినిమా ను అనౌన్స్ చేసి అది మొదాలుపెట్టకుండా టైం వేస్ట్ చేసిన ఈ దర్శకుడు ఇప్పుడు వెంటనే సినిమా చేయాలనే డిమాండ్ నెలకొంటుంది.

అయితే ఇప్పుడు అయన బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నాడు అనే వార్తలు రావడం అందరిని సంతోషపరుస్తుంది. హరీశ్ శంకర్ కొన్ని రోజుల క్రితం ముంబైకి వెళ్ళాడని తెలుస్తోంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ తో సినిమా చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడని చెబుతున్నారు.

గబ్బర్ సింగ్ సినిమా ను హరీష్ శంకర్ చేసిన విధానానికి మెచ్చిన సల్మాన్ ఆయనకు ఓ సినిమా అవకాశం ఇవ్వబోతున్నారని అంటున్నారు. హిందీ లో ఆ సినిమా ను సల్మాన్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే సల్మాన్ కు భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చిన మైత్రీ మూవీ మేకర్స్.. హరీశ్ తో ప్రాజెక్ట్ సెట్ చేయటానికి మీటింగ్ ఏర్పాటు చేసినట్లుగా వార్తలు వచ్చాయి.