స్టార్ హీరోగా ప్రేక్షకుల అభిమానం పొందడం నన్ను చాలా ఎగ్జైట్ చేస్తుంటుంది – “రౌడీ వేర్” ఫస్ట్ ఆఫ్ లైన్ స్టోర్ ప్రారంభోత్సవంలో విజయ్ దేవరకొండ

స్టార్ హీరో విజయ్ దేవరకొండ తన ఫ్యాషన్ బ్రాండ్ రౌడీ వేర్ తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటిదాకా ఆన్ లైన్ లోనే అందుబాటులో ఉన్న ఈ బ్రాండ్ ఇప్పుడు ఆఫ్ లైన్ లోకి తీసుకొచ్చారు. రౌడీ వేర్ ఫస్ట్ ఆఫ్ లైన్ స్టోర్ ను హైదరాబాదులో ప్రారంభించారు విజయ్ దేవరకొండ. బంజారాహిల్స్ బ్రాడ్ వేలో రౌడీ వేర్ స్టోర్ ఓపెన్ చేశారు. ఈ సందర్భంగా

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ – రౌడీ వేర్ ఆఫ్ లైన్ స్టోర్ కోసం చాలా డిమాండ్ ఉంది. ఎప్పటినుంచో ఫ్యాషన్ లవర్స్ మమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ వస్తున్నారు. హైదరాబాదులో మా ఫస్ట్ ఆఫ్ లైన్ స్టోర్ ప్రారంభించుకోవడం సంతోషంగా ఉంది. ఇది నా ప్లేస్, వీళ్లంతా నా వాళ్లు. ఏ గుర్తింపు లేని స్థాయి నుంచి స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకోవడం నన్ను చాలా ఎగ్జైట్ చేస్తుంటుంది. అన్నారు.