సీనియర్ హీరో లతో శృతి హాసన్ ఆటా పాటా!!

హీరోయిన్ శృతి హాసన్ ఇద్దరు స్టార్ హీరోలతో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. చిరంజీవి తో కలిసి వాల్తేరు వీరయ్య సినిమా లో నటిస్తున్న ఈమె అటు బాలయ్య బాబు తో కలిసి వీర సింహ రెడ్డి సినిమాలో నటిస్తుంది. ఈ రెండు సినిమాలు కూడా ఒకే రోజున సంక్రాంతి కి విడుదల కాబోతు ఉండడం కొసమెరుపు.

ప్రస్తుత ఈ సినిమాల యొక్క విడుదల తేదీ లు దగ్గరపడుతూ ఉండడంతో ఆ సినిమా ల యొక్క షూటింగ్ లు వేగంగా జరుగుతున్నాయి. శృతి హాసన్ అయితే ఈ రెండు సినిమాల షూటింగ్ లలో ఒకదానితర్వాత ఒకరు పాల్గొంటూ చకచకా పూర్తి చేస్తుంది.

మరి ఈ సినిమాలలో ఏ సినిమా ఆమెకు ఎక్కువ పేరును తెస్తుందో చూడాలి. చిన్న వయసులోనే తనదైన టాలెంట్లతో ఫేమస్ అయిన ఈ చిన్నది.. హీరోయిన్‌గా వచ్చిన తర్వాత సత్తా చాటింది. దీంతో తక్కువ సమయంలోనే స్టార్ అయిపోయింది.