సీతారామం బ్యూటీ ని పట్టించుకోవడం లేదా!!

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో హిట్ అందుకోవడం ఎంతో ముఖ్యమైన విషయం. ఎందుకంటే విజయాన్ని అందుకున్న హీరోలకే నటులకే ఇక్కడ మరిన్ని అవకాశాలు వస్తూ ఉంటాయి. ఆ విధంగా సీతారామమ్ సినిమాతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకొని అందాల కలల రాణిగా గుర్తింపు సంపాదించుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.

ఈమె తెలుగులో నటించింది మొదటి సినిమానే అయినా కూడా తెలుగింటి అమ్మాయిల తెరపై కనిపించి అందరిని మంత్రముగ్ధులను చేసింది. ప్రతి ఒక్క సీన్ లో ప్రతి ఒక్క షాట్ లో కూడా తెలుగుదనం ఉట్టిపడేలా చేసి మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీంతో ఈమెకు మంచి మంచి అవకాశాలు రావడం ఖాయం అని అందరూ అనుకున్నారు.

దానికి తగ్గట్లుగానే పలువురు దర్శకులు ప్రేమకథ సినిమాలను చేయడానికి ఆమెను అప్రోచ్ అయ్యారు. అయితే తొందరగానే పలు సినిమాలలో ఈమె నటించడం ఖాయం అని అందరూ అనుకున్నారు. కానీ సీతారామమ్ సినిమా విడుదలై చాలా రోజులే అవుతున్నా కూడా ఇంకా ఈమె తన తదుపరి సినిమాను చేసే విషయంలో ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం ఆమె అభిమానులను ఎంతగానో నిరాశ పరుస్తుంది.