సలార్ లో విజయ్ దేవరకొండ.. నిజమేనా?

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా శృతిహసన్ హీరోయిన్ గా తెరకెక్కుతున్న సినిమా సలార్. ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ వారు నిర్మిస్తున్న ఈ ‘సలార్’ చిత్రం 200 కోట్ల భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నాఋ. ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ గా మారింది.

అదేంటంటే? సలార్ లో రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ నటిస్తున్నాడన్న వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ముంబై లో ఓ యాడ్ షూట్ లో పాల్గొన్న విజయ్ దేవరకొండ లుక్ బయటకు రావడం అది సలార్ లో ప్రభాస్ లుక్ కి సేమ్ గా ఉండడంతో అందరు విజయ్ కూడా ఈ సినిమా లో నటిస్తున్నాడు అని చెబుతున్నారు.

అయితే దేవరకొండ కాంపౌండ్ నుండి అందుతున్న వార్తల ప్రకారం ఇందులో నిజం లేదని తెలుస్తుంది. యాడ్ షూటింగ్ కోసం ముంబై లో విజయ్ దేవరకొండ త్వరలోనే ఖుషి సినిమా షూటింగ్ లో పాల్గొన బోతున్నాడు.