సమంత సినిమా కి కలెక్షన్స్ లేవా?

సమంత ప్రధాన పాత్ర లో తెరకెక్కిన యశోద సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా ఆ చిత్రానికి మొదటి రోజునుంచి మంచి టాక్ ఏర్పడింది. అయితే వీకెండ్ వరకు మంచి కలెక్షన్స్ సంపాదించినా ఈ సినిమా కి ఇప్పుడు పూర్ కలెక్షన్స్ వస్తున్నాయట.

ఈ సోమవారం నుంచి ఈ సినిమా కి కలెక్షన్స్ లేకపోవడం చిత్ర బృందాన్ని నిరాశపరుస్తుంది. ‘యశోద’ సినిమా వసూళ్లను బడ్జెట్ లెక్కలతో పోల్చి చూస్తే నిర్మాతలకు నష్టాలే మిగిలేలా ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

కాకపోతే డిజిటల్ మరియు శాటిలైట్ వంటి నాన్ థియేట్రికల్ హక్కుల రూపంలో ఎంతో కొంత బయట పడే అవకాశం ఉందని అంటున్నారు. సరోగసీ నేపథ్యంలో మెడికల్ మాఫియా ప్రధానంగా రూపొందిన ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్ ను తమిళ దర్శక ద్వయం హరి & హరీష్ తెరకెక్కించారు.