అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన వేవ్స్ (WAVES – వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్) సమ్మిట్ ఘనంగా జరిగింది. గురువారం (మే 1) నాడు జియో కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి భారత చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖులెందరో విచ్చేశారు. ఈ క్రమంలో లైకా సంస్థ తమ భవిష్యత్ ప్రాజెక్ట్‌ల గురించి ప్రకటించింది.
Proud to announce Lyca Productions partners with Mahaveer Jain Films to produce 9 feature films for global audiences, inspired by Hon. PM @narendramodi‘s vision at #WAVES2025!
This visionary collaboration has been inspired by Hon. Prime Minister Narendra Modi’s WAVES (World of… pic.twitter.com/ipsMD5uRHJ
— Lyca Productions (@LycaProductions) May 2, 2025
ప్రధాని మోదీ విజన్, లక్ష్యాలకు అనుగుణంగా భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో గ్లోబల్ ఎంటర్టైన్మెంట్గా తీర్చి దిద్దేందుకు 9 ప్రాజెక్టుల్ని చేయబోతోన్నట్టుగా లైకా సంస్థ ప్రకటించింది. ఈ మేరకు మహవీర్ జైన్ ఫిల్మ్స్, లైకా ప్రొడక్షన్ సంయుక్తంగా 9 ప్రాజెక్టుల్ని నిర్మించబోతోంది.
ఈ సందర్భంగా లైకా సంస్థ గ్రూప్ చైర్మన్ డా.సుభాస్కరణ్ మాట్లాడుతూ.. ‘భారతీయ మూలాలు కలిగిన ప్రపంచ సంస్థగా లైకా గ్రూప్ భారతీయ సినిమాకు, ప్రపంచ ప్రేక్షకులకు మధ్య వారధిగా పనిచేయడానికి మరింతగా కృషి చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు భారతదేశ అసాధారణ సాంస్కృతిక వారసత్వం, కథల్ని చెప్పేందుకు, మన సంప్రదాయాలను చాటి చెప్పేందుకు, వరల్డ్ కంటెంట్‌ను రూపొందించడానికి మహావీర్ జైన్ ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం అవ్వడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.
ఈ క్రమంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవెంద్ర ఫడ్నవీస్, కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అశ్వినీ వైష్ణవ్, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి డా. ఎల్ మురుగన్‌లత చైర్మన్ అల్లిరాజా సుభాస్కరణ్, మహవీర్ జైన్ ముచ్చటించారు.