వివాదాల్లో ఉన్నా ట్రెండింగ్ లో వారసుడు!!

విడుదల విషయంలో వివాదాల్లో చిక్కుకుంది విజయ్ దళపతి హీరో గా నటించిన వారసుడు సినిమా. గత కొంత కాలంగా తెలుగు తమిళ పాటలు నెట్టింట రిలీజ్ అయిన క్షణాల్లోనే మిలియన్ ల కొద్దీ వ్యూస్ ని రాబట్టేస్తూ నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.

కొన్ని పాటలు 800 మిలియన్ 500 మిలియన్ లని క్రాస్ చేయడం ఇప్పడు సర్వసాధారణంగా మారింది. అలా విజయ్ దళపతి వారసుడు సినిమా నుంచి వచ్చిన రంజితమే పాత ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది. ఇప్పటి వరకు 1.4 బిలియన్ వ్యూస్ ని రాబట్టి సరికొత్త రికార్డుని తన ఖాతాలో వేసుకుంది.

ఈ సాంగ్ లు సాధించిన రికార్డ్ వ్యూస్ తరువాత ప్రతీ సినిమా సాంగ్ రిలీజ్ చేసిన గంటల్లోనే మిలియన్ ల వ్యూస్ ని రాబట్టడం ఆనవాయితీగా మారింది. ఇకపోతే ఈ సినిమా విడుదల ఇప్పుడు అయోమయంలో ఉంది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా సంక్రాంతి కి వస్తుందా అనేది చూడాలి.